Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

30, మే 2022, సోమవారం

1 నుంచి 10వ తరగతి వరకు కొడిగెనహళ్ళిలో ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల, సేవామందిరంలో చేరే విద్యార్థులకు అర్హత వివరాలు | విద్యతో పాటు మరిన్ని ప్రయోజనాలు


 

Gemini Internet

ఇక 10వ తరగతి తరువాత 11 మరియు 12 తరగతులుగా ఇంటర్ | త్వరలో ఇంటర్ బోర్డు స్కూల్ బోర్డులోకి విలీనం


♦️విలీన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

♦️ఎన్‌ఈపీ, సీబీఎస్‌ఈ అమలుకు ఒకే విభాగం

🌻ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయనున్నారు. ఇందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 1971లో ఏర్పాటైన ఇంటర్‌ విద్యామండలి ఇక కనుమరుగు కానుంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగంలోనే రెండు శాఖల అధికారులుంటారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 5+3+3+4లో చివరి నాలుగేళ్లు 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. వీటికి సంబంధించి కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రత్యేకంగా అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం ప్రవేశపెట్టడం, ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌టూను ఎలాగూ ప్రారంభిస్తున్నందున ఈ విలీనానికి నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు సాగుతోంది. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నియామకాలు, సర్వీసు నిబంధనలు, కొత్తగా ఏ విభాగాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పదోన్నతుల్లో, సర్వీసు నిబంధనల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

♦️విలీన ప్రతిపాదన ఇలా..
ఇంటర్మీడియట్‌లోని విద్యా పరిశోధన, శిక్షణ మండలిని పాఠశాల విద్యలోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిలో (ఎస్‌సీఈఆర్టీ) విలీనం చేస్తారు. ఇంటర్‌ వృత్తి విద్యా కోర్సులను సమగ్రశిక్ష అభియాన్‌లో నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సుల్లో కలిపేస్తారు. పాఠశాల విద్య, ఇంటర్‌ విద్యకు కలిపి కొత్తగా డైరెక్టర్‌ అకడమిక్‌, డైరెక్టర్‌ పరిపాలన, డైరెక్టర్‌ అకౌంట్స్‌ విభాగాలను ఏర్పాటు చేస్తారు.
వీటి కిందికి 2 శాఖల్లోని వారిని తీసుకొస్తారు.

* ప్రస్తుతం పాఠశాల విద్యలో 4 ప్రాంతీయ సంయుక్త సంచాలకుల (ఆర్జేడీ) పోస్టులుండగా.. ఇంటర్‌లో మూడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కొత్తగా ఇంటర్‌ ఆర్జేడీ పోస్టును ఏర్పాటు చేస్తారు. ఇద్దరు ఆర్జేడీలు ఉంటే 9నుంచి 12వ తరగతి వరకు ఒకరు పర్యవేక్షిస్తారు. ఇంటర్‌ విద్యా మండలిలోని సిబ్బందిని ప్రభుత్వ పరీక్షల విభాగంలో విలీనం చేస్తారు. పది, ఇంటర్మీడియట్‌కు ఈ బోర్డే పరీక్షలు నిర్వహిస్తుంది.

* రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 434 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 292 కళాశాలలను ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసి ‘హైస్కూల్‌ ప్లస్‌’గా పిలుస్తారు. ఇక్కడ ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీలో ఉపాధ్యాయులు, జూనియర్‌ లెక్చరర్లకు అవకాశమిస్తారు. జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్‌ పోస్టును జోనల్‌ పోస్టుగా మార్పు చేయనున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లో అర్హత కలిగిన ఉపాధ్యాయులను పదోన్నతుల ద్వారా లెక్చరర్లుగా నియమించాలని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న జూనియర్‌ కళాశాలల్లో 90శాతం నేరుగా నియామకాలు, 10శాతం బోధనేతర సిబ్బందిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. హైస్కూల్‌ ప్లస్‌లో ప్రాథమికంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.

* ఇంటర్మీడియట్‌కు జిల్లాలో ఆర్‌ఐఓ, డీవీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులు ఉండగా, కొత్త జిల్లాలు ఏర్పడినందున జిల్లాకు ఒక డీవీఈఓ పోస్టును మాత్రమే ఉంచుతారు. క్షేత్రస్థాయిలో హైస్కూల్‌ ప్లస్‌ను ఎవరు పర్యవేక్షించాలనే అంశంపై నిర్ణయానికి రాలేదు.

 

Gemini Internet

అనంతపురం | శ్రీ సత్యసాయి జిల్లాలలో గల ప్రాంతీయ ఉద్యోగ వివరాలు 30-05-2022



 

Gemini Internet

ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం

 

Gemini Internet




Delhi Police Jobs Staff Selection Commission పూర్తి సమాచారం తెలుగు


 

Gemini Internet

28, మే 2022, శనివారం

గీతం ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల✍️📚 మే 31 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌



🌻విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌, ఫార్మశీ, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, లా, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల (గ్యాట్‌-2022) ఫలితాలను గీతం ఉప కులపతి ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాట్‌ ర్యాంకుల ఆధారంగా ఆన్‌లైన్‌లో మే 31వ తేదీ నుంచి తొలి విడత అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాల్లో ఇంజనీరింగ్‌, ఫార్మశీ, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏడాదికి ప్రోత్సాహకాలుగా రూ.30 కోట్లు అందించనున్నట్టు వెల్లడించారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో 3,920 మంది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. వైద్య రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది నుంచి కొత్తగా బీఎ్‌ససీ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ, ఎమెర్జన్సీ మెడిసిన్‌ కోర్సులను ప్రారంభించామని వెల్లడించారు. ఈ సమావేశంలో గీతం ప్రొ-వైస్‌ ఛాన్సలర్‌ జయశంకర వారియర్‌, రిజిస్ట్రార్‌ గుణశేఖరన్‌, అడ్మిషన్ల డైరెక్టర్‌ శేఖర్‌ జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.
Gemini Internet

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...