Gemini Internet
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
20, జూన్ 2022, సోమవారం
15, జూన్ 2022, బుధవారం
Agnipath Scheme: నెలకు రూ.40,000 జీతం... నాలుగేళ్ల తర్వాత రూ.12 లక్షల ప్యాకేజీ... అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Agnipath Recruitment Scheme | కేంద్ర సాయుధ బలగాల్లో నాలుగేళ్ల పాటు పనిచేసే అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను (Agnipath Scheme) ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా అగ్నివీర్లను (Agniveer) నియమించుకోనుంది.
కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రకటించింది. అగ్నిపథ్
స్కీమ్‌ను (Agnipath Scheme) మంగళవారం ఆవిష్కరించింది. ఇది కేంద్ర సాయుధ
బలగాల కోసం చేపడుతున్న రిక్రూట్‌మెంట్ స్కీమ్. డిఫెన్స్ బడ్జెట్
తగ్గించుకొని మరిన్ని ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ
పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఇండియన్ ఆర్మీ
(Indian Army), ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలగాలకు చెందిన
అధినేతలు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం
భారీగా అగ్నివీర్‌లను (Agniveer) నియమించుకోనుంది.
రాబోయే 90 రోజుల్లోనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి బ్యాచ్ 2023 జూలై నాటికి సిద్ధం అవుతుంది. ఎంపికైనవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. విద్యార్హతల విషయానికి వస్తే సాయుధ బలగాల్లో రెగ్యులర్‌గా జరిగే నియామకాలకు ఎలాంటి విద్యార్హతలు ఉంటాయో అగ్నివీర్ పోస్టులకు కూడా అవే అర్హతలు ఉంటాయి.
అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఎంపికయ్యేవారు అగ్నివీర్‌గా నాలుగేళ్లు మాత్రమే పనిచేస్తారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మొదట 45,000 మంది అగ్నివీర్‌లను నియమించుకోనుంది. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని మాత్రమే నియమించుకుంటారు. వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఇస్తారు. నాలుగేళ్ల కాల వ్యవధిలో ఆరు నెలల శిక్షణ కాలం కూడా కలిపే ఉంటుంది. అంటే మూడున్నరేళ్లు పనిచేయాల్సి ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు స్టైపెండ్ లభిస్తుంది. అలవెన్సులు కూడా ఉంటాయి. మెడికల్, ఇన్స్యూరెన్స్
బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నాలుగేళ్లు పూర్తైన తర్వాత వీరిలో 25 శాతం మందిని
రెగ్యులర్ కేడర్‌లో చేర్చుకుంటారు. రెగ్యులర్ కేడర్‌లో చేరినవారు 15 ఏళ్ల
పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
ఇక మిగతా 75 శాతం మందికి ఎగ్జిట్ అవకాశం కల్పిస్తారు. అంటే నాలుగేళ్లు పూర్తైన తర్వాత వారు ఈ ఉద్యోగం వదిలేయొచ్చు. ఎగ్జిట్ సమయంలో రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సేవా నిధి ప్యాకేజీ, స్కిల్ సర్టిఫికెట్స్ లభిస్తాయి. వారికి ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు. అయితే ఆ తర్వాత మరో కెరీర్‌లో స్థిరపడేందుకు బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయి. ఈ స్కీమ్ ద్వారా డిఫెన్స్ వార్షిక ఖర్చులు బాగా తగ్గిపోతాయి. వార్షిక డిఫెన్స్ బడ్జెట్ రూ.5.2 లక్షల కోట్లకు తగ్గుతుంది.
https://airmenselection.cdac.in/CASB/
Gemini Internet
14, జూన్ 2022, మంగళవారం
శ్రీ సత్యసాయి ఇంటర్ ప్రవేశాల అప్డేట్ పరీక్ష వ్రాయాల్సిన వెబ్సైట్ గురించి Sri Sathya Sai Intermediate Entrance Exam Updates
Sairam students,
The online entrance exam is being conducted by a third party website wheebox.com
They have mailed the user IDs and passwords to all the students. If you have doubt regarding the exam or if you have not received the user ID and password you can call them at 0120-6740105. Alternatively you can drop a mail to support@wheebox.com.
The login credentials are to be used in the URL
www.wheebox.com/ssshss
Gemini Internet
సాయిరాం విద్యార్థులు,
ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షను థర్డ్ పార్టీ వెబ్‌సైట్ wheebox.com నిర్వహిస్తోంది
వారు విద్యార్థులందరికీ యూజర్ ఐడిలు మరియు పాస్‌వర్డ్‌లను మెయిల్ చేశారు. మీకు పరీక్షకు సంబంధించి సందేహం ఉంటే లేదా మీకు యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్ రాకుంటే మీరు 0120-6740105కు కాల్ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు support@wheebox.comకి మెయిల్ పంపవచ్చు.
లాగిన్ ఆధారాలను URLలో ఉపయోగించాలి
13, జూన్ 2022, సోమవారం
SSSHSS XI ప్రవేశ పరీక్ష గురించి తెలుసుకోండి 2022 Update
సాయిరామ్ విద్యార్థులు, ప్రవేశానికి ప్రత్యేక హాల్ టికెట్ లేదు. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉన్నందున పరీక్షకు అర్హత సాధించడానికి “లాగిన్ ఆధారాలు” (యూజర్ ఐడి & పాస్‌వర్డ్) సరిపోతాయి. హాల్ టికెట్ లాంటిది ప్రత్యేకించి ఏమి ఉండదు గమనించగలరు.
ఆన్‌లైన్ పరీక్ష సమయాలు
మాక్ టెస్ట్: 16 & 17 తేదీల్లో
ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు మీరు ఎప్పుడైనా లాగిన్ చేయవచ్చు మరియు మీ రెండు ప్రయత్నాలను ఉపయోగించవచ్చు.
ప్రధాన పరీక్ష:
జూన్ 19న విద్యార్థులు 8:45 నుండి లాగిన్ ప్రారంభించవచ్చు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.
గమనిక: రోజులో ఎప్పుడైనా మాక్ టెస్ట్ మాత్రమే ప్రయత్నించవచ్చు. కానీ మెయిన్ పరీక్ష అందరికీ ఉదయం 9:00 గంటలకు వెంటనే ప్రారంభమవుతుంది.
సాయిరాం
Gemini Internet
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...


















