Gemini Internet
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
11, జులై 2022, సోమవారం
10, జులై 2022, ఆదివారం
Indian Navy Agniveer Recruitment: 2,800 అగ్నివీర్–ఎస్‌ఎస్‌ఆర్ పోస్ట్‌లు
ఇంటర్మీడియెట్ ఎంపీసీ లేదా బైపీసీ పూర్తి చేశారా.. త్రివిధ దళాల్లో చేరాలనే ఆసక్తి ఉందా.. అయితే మీకు స్వాగతం పలుకుతోంది.. భారత నావికా దళం! కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన.. ‘అగ్నిపథ్’ స్కీమ్‌లో భాగంగా.. నావికా దళంలో.. 2,800 ‘అగ్నివీర్–ఎస్‌ఎస్‌ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్)’ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది! ఈ పోస్ట్‌లకు.. ఈ నెల 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో.. అగ్నివీర్ ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష, సర్వీస్ కాలం, వేతనం తదితర సమాచారం...
- 2,800 పోస్ట్‌లకు నావికా దళం నోటిఫికేషన్
- ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ అర్హతగా అవకాశం
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటెన్ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువత దేశంలో లక్షల సంఖ్యలో ఉంటారనడంలో సందేహం లేదు. ఇలాంటి వారి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం ప్రకటించింది. త్రివిధ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం అగ్నిపథ్ పేరిట ప్రత్యేక విధానానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతలతో సాయుధ బలగాల్లో అగ్నివీర్ పేరుతో పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో అగ్నివీర్, అగ్నివీర్‌వాయు పోస్ట్‌ల భర్తీ ప్రక్రియ మొదలైంది. తాజాగా ఇండియన్ నేవీలోనూ అగ్నివీర్(ఎస్‌ఎస్‌ఆర్)కు నోటిఫికేషన్ వెలువడింది.
2,800 పోస్ట్‌లు
- అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీ.. అగ్నివీర్ తొలి బ్యాచ్‌లో 2,800 అగ్నివీర్(ఎస్‌ఎస్‌ఆర్) పోస్ట్‌లు భర్తీ చేయనుంది. వీటిలో 560 పోస్ట్‌లను మహిళలకు కేటాయించారు.
అర్హతలు
- మ్యాథ్స్, ఫిజిక్స్‌లు ప్రధాన సబ్జెక్ట్‌లుగా, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక సబ్జెక్ట్‌తో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
- వయసు: నవంబర్ 1, 1999 – ఏప్రిల్ 30, 2005 మధ్యలో జన్మించి ఉండాలి.
- అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
- కనీస ఎత్తు: పురుషులు 158 సెంటీ మీటర్లు, మహిళలు 152 సెంటీ మీటర్లు
ఎంపిక ప్రక్రియ ఇలా
- అగ్నివీర్(ఎస్‌ఎస్‌ఆర్) ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో చేపట్టనున్నారు. అవి..
- రాత పరీక్ష, – ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్.
- ముందుగా వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఒక్కో పోస్ట్‌కు నలుగురు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారికి తొలి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. నిర్దిష్ట కటాఫ్ ప్రమాణాలను నిర్దేశించి తదుపరి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
రాత పరీక్ష
నేవీ అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్) రాత పరీక్ష నాలుగు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–25 మార్కులు, సైన్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు కేటాయించిన సమయం 60 నిమిషాలు.
- రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా నిర్దిష్ట కటాఫ్ సాధించిన వారికి తదుపరి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
ఐఎన్‌ఎస్ చిల్కాలో శిక్షణ
రాత పరీక్ష, పీఈటీలలో ప్రతిభ చూపిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. ఐఎన్‌ఎస్ చిల్కాలో ఆరు నెలలపాటు పలు ట్రేడ్‌లకు సంబంధించి శిక్షణనిస్తారు. తాజా బ్యాచ్‌కు సంబంధించిన శిక్షణ నవంబర్‌లో ప్రారంభం కానుంది. శిక్షణ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. ఆయా విభాగాల్లో మిగిలిన మూడున్నరేళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
శాశ్వత సెయిలర్స్ 25 శాతం మంది
మొత్తం నాలుగేళ్ల వ్యవధిలో ఉండే అగ్నివీర్ సర్వీస్ పూర్తి చేసుకున్న వారిలో 25 శాతం మందిని నేవీలో శాశ్వత సెయిలర్‌గా నియమించనున్నారు. దీనికోసం ప్రత్యేక నోటిఫికేషన్ వెలువరిస్తారు. సంబంధిత ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. అగ్నివీర్‌లుగా సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ నియామాకాల్లోనూ పది శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
రూ.30 వేలు–రూ.40 వేలు
అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40 వేలు చొప్పున నెల వేతనం లభిస్తుంది. ఈ వేతనంలోంచి ప్రతి నెల 30 శాతం చొప్పున అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు జమ చేస్తారు. ఈ 30 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఇలా నాలుగేళ్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల కార్పస్ ఫండ్‌లో రూ. 10.04 లక్షలు జమ అవుతాయి.
విధులు నిర్వర్తించే విభాగాలు
నేవీలో అగ్నివీర్‌లుగా ఎంపికైన వారు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్, ఫ్రైగేట్స్, రిప్లెనిష్‌మెంట్ షిప్స్, టెక్నికల్ సబ్ మెరైన్స్, నేవీ ఎయిర్ క్రాఫ్ట్స్ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
రాత పరీక్షలో రాణించేలా
- ఇంగ్లిష్: బేసిక్ గ్రామర్ నైపుణ్యాలు పరీక్షించే విభాగం ఇది. ఇందులో రాణించడానికి ప్రిపొజిషన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్, ప్యాసివ్ వాయిస్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్, డైరెక్ట్–ఇన్‌డైరెక్ట్ స్పీచ్,వెర్బ్స్,టెన్సెస్, పంక్చుయేషన్స్,యాం టానిమ్స్, సినానిమ్స్‌లపై పట్టు సాధించాలి.
- సైన్స్: ఇంటర్మీడియెట్ స్థాయిలోని కైనమాటిక్స్, వర్క్, ఎనర్జీ చలన నియమాలు, మెకానిక్స్, హీట్ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, వేవ్స్, సెమీ కండక్టర్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
- మ్యాథమెటిక్స్: క్వాడ్రాట్రిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, సమితులు, ప్రమేయాలు, ట్రిగ్నోమెట్రీ, స్ట్రెయిట్ లైన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, వెక్టార్స్, స్టాటిస్టిక్స్, 3డి జామెట్రీ, డిఫరెన్షియేషన్స్, డెరివేటివ్స్, అల్జీబ్రా వంటి ఇంటర్మీడియెట్ స్థాయిలోని గణిత అంశాలపై సన్నద్ధత పొందాలి.
- జనరల్ అవేర్‌నెస్: అభ్యర్థులకున్న సామాజిక అవగాహనను పరీక్షించే ఈ విభాగంలో రాణించడానికి కరెంట్ అఫైర్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపాలి. అదే విధంగా భారత దేశ చరిత్ర, భౌగోళిక అంశాలు, పోర్ట్‌లు, తీర ప్రాంతాలు, ముఖ్యమైన వ్యక్తులు, సదస్సులు, క్రీడలు–విజేతలు, రక్షణ రంగానికి సంబంధించి తాజా పరిణామాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చివరి తేదీ: జూలై 15–22, 2022
- అగ్నివీర్ రాత పరీక్ష తేదీ: అక్టోబర్‌లో
- అగ్నివీర్ శిక్షణ ప్రారంభం: ఐఎన్‌ఎస్ చిల్కాలో నవంబర్‌లో
- వెబ్‌సైట్: http://www.joinindiannavy.org/
Gemini Internet
8, జులై 2022, శుక్రవారం
Teaching Jobs: నవోదయ విద్యాలయ సమితి, నోయిడాలో 1616 పోస్టులు | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.07.2022
నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్).. దేశవ్యాప్తంగా టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1616
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్–12, పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు)–397, టీజీటీ
(ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు)–683, టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్)–343, మిసిలేనియస్ కేటగిరీ (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియ¯Œ )–181.
ప్రిన్సిపల్:
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు):
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో
ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీతో పాటు
బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
టీజీటీ(ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు):
అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో
ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బీఈడీ
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
మిసిలేనియస్ కేటగిరి (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్):
అర్హత: గ్రాడ్యుయేషన్, డిప్లొమా(లైబ్రరీ సైన్స్),
బీపీఈడీ, డిప్లొమా(ఫైన్ ఆర్ట్స్), బ్యాచిలర్స్ డిగ్రీ(మ్యూజిక్)
ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ
భాషల్లో నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.07.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://navodaya.gov.in/
Gemini Internet
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. 2023–2024 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)–గీఐఐ నోటిఫికేషన్ విడుదల చేసింది | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.07.2022.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. 2023–2024 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)–గీఐఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 6035
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–209, తెలంగాణ–99.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు:
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో
బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్
నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్
మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 20–28 ఏళ్ల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ,
మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష 100
మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌లో ప్రశ్నలు
అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్స్ పరీక్ష 200
మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్,
కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు
వస్తాయి. మెయిన్స్ పరీక్ష సమయం 160 నిమిషాలు. ప్రిలిమ్స్, మెయిన్స్
పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.07.2022
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2022
మెయిన్స్ పరీక్ష: అక్టోబర్ 2022
వెబ్‌సైట్: https://www.ibps.in/
Gemini Internet
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...