Alerts

Loading alerts...

15, ఆగస్టు 2022, సోమవారం

LIC HFL Recruitment 2022: ఎల్‌ఐసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.80వేలకుపైగా వేతనం | దరఖాస్తులకు చివరి తేదీ: 25.08.2022

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌.. పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయశాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల వారు ఆగస్టు 25 తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 80
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ పోస్టులు50; అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు30. 
అర్హత: అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు డిగ్రీ లేదా పీజీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణలవ్వాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాల్లో డైరెక్ట్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌(డీఎంఈ) విభాగానికి సంబంధించి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఎంబీఏలో మార్కెటింగ్‌/ఫైనాన్స్‌ చేసి ఉండాలి. అలాగే వీరికి సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. రెండు పోస్టులకు సంబంధించి కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.
వయసు: 01.01.2022 నాటికి 2128 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. డీఎంఈ పోస్టులకు 2140 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
వేతనాలు: అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.33,960 వేతనంగా చెల్లిస్తారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు ఎంపికైన వారు ప్రతి నెల రూ.80,100 వేతనంగా పొందవచ్చు.వీటికి అదనంగా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఈ పరీక్షను ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)విధానంలో నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

నాలుగు విభాగాలు 
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగంలో 50 ప్రశ్నలు50 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 35 నిమిషాలు. 
లాజికల్‌ రీజనింగ్‌: ఈ విభాగంలో 50 మార్కులకు 50 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 35 నిమిషాలు. 
జనరల్‌ అవేర్‌నెస్‌: ఇందులో 50 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 15 నిమిషాలు.
న్యూమరికల్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులుంటాయి. పరీక్ష సమయం 50 నిమిషాలు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 25.08.2022
  • వెబ్‌సైట్‌: https://www.lichousing.com/

Gemini Internet

Andhra Pradesh Govt Jobs: 1681 పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.08.2022


ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన 1681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదలచేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1681
అర్హత: ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌(సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ పూర్తిచేయాలి.
వయసు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18నుంచి 35ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు పదేళ్లు మినహాయింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్ష బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచి 200 ప్రశ్నలకు బహుళైచ్ఛిక విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 3గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.08.2022

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/

 

Gemini Internet

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి



 

Gemini Internet

14, ఆగస్టు 2022, ఆదివారం

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి








 

Gemini Internet

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి






 

Gemini Internet

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...