19, జూన్ 2023, సోమవారం

EPFO | అధిక పెన్షన్‌కు కావాల్సిన పత్రాలివే.. దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేసిన ఈపీఎఫ్‌ఓ ఇప్పటివరకూ యజమాన్యం నుంచి ఉమ్మడి ఆప్షన్‌ ప్రూఫ్‌ చూపించలేని.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సరళతరం చేస్తూ ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) బుధవారం ఒక సర్క్యులర్‌ జారీచేసింది.

EPFO | న్యూఢిల్లీ, జూన్‌ 14: ఇప్పటివరకూ యజమాన్యం నుంచి ఉమ్మడి ఆప్షన్‌ ప్రూఫ్‌ చూపించలేని.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సరళతరం చేస్తూ ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) బుధవారం ఒక సర్క్యులర్‌ జారీచేసింది. ఇందులో పెన్షన్‌ దరఖాస్తు ఫారంతోపాటు సమర్పించాల్సిన పత్రాల జాబితాను విడుదల చేస్తూ, అటువంటి దరఖాస్తుల్ని ఈపీఎఫ్‌ఓ ఫీల్డ్‌ ఆఫీసర్లు అనుసరించాల్సిన ప్రక్రియను వివరించింది. దీని ప్రకారం అధిక పెన్షన్‌ దరఖాస్తుల్లో ఫీల్డ్‌ ఆఫీసర్లు ఈ అంశాల్ని చూస్తారు…

అధిక ఈపీఎస్‌ పెన్షన్‌కు దరఖాస్తు చేస్తూ ఉమ్మడి డిక్లరేషన్‌ ప్రూఫ్‌ను సమర్పించని ఉద్యోగులు ఫైనల్‌ క్లెయిం సెటిల్‌మెంట్‌ జరిగే సమయంలో వారి చివరగా పనిచేసిన సంస్థ (యాజమాన్యం) ద్వారా దానిని (ప్రూఫ్‌) ఇవ్వవచ్చని సర్క్యులర్‌లో వివరించారు. అధిక వేతనాలపై పెన్షన్‌ మంజూరీ జరిగేముందు ఏ సమయంలోనైనా పెన్షనర్లు/సభ్యులు..పేరా 26(6) కింద యాజమాన్యం అండర్‌టేకింగ్‌ మరియు ఉమ్మడి వినతిని సమర్పించవచ్చని పేర్కొంది. అధిక ఈపీఎస్‌ పెన్షన్‌కు దరఖాస్తు చేయడానికి ఈ జూన్‌ 26 చివరితేదీ అన్న సంగతి గుర్తుంచుకొండి.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు | There is no fee to be paid for these jobs

నర్సింగ్ కోర్స్ పూర్తీ చేసిన వారికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌వైఫ్‌) గ్రూప్‌ సి (నాన్‌-గెజిటెడ్‌ అండ్‌ నాన్‌మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌వైఫ్‌) గ్రూప్‌ సి (నాన్‌-గెజిటెడ్‌ అండ్‌ నాన్‌మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ప్రాక్టికల్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

మొత్తం 81 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 34, ఓబీసీకి 22, ఎస్సీకి 12, ఎస్టీకి 06, ఈడబ్ల్యూఎస్‌కు 07 కేటాయించారు. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 10 శాతం ఖాళీలను రిజర్వు చేశారు. వీరు అందుబాటులో లేనట్లయితే ఈ పోస్టులకు నాన్‌-ఈఎస్‌ఎం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పదోతరగతి, ఆగ్జిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎం) కోర్సు పాసవ్వాలి. సెంట్రల్‌ లేదా స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ కావాలి. వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 నుంచి 8 ఏళ్ల మినహాయింపు వర్తిస్తుంది.

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)లో భాగంగా పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రతిదాంట్లోనూ అర్హత సాధించాలి. 800 మీటర్ల పరుగును 4 నిమిషాల 45 సెకన్లలో ముగించాలి. 9 అడుగుల లాంగ్‌జంప్‌, 3 అడుగుల హైజంప్‌లను మూడు ప్రయత్నాల్లో సాధించాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. దీనికి మార్కులు ఉండవు. దీంట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించినవారిని ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ)కు ఎంపికచేసి శారీరక కొలతలు తీసుకుంటారు. అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 147.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. వయసు, ఎత్తులకు తగినంత బరువు ఉండాలి. దీంట్లో అర్హత సాధించినవారిని రాత పరీక్షకు ఎంపికచేస్తారు.

* పీఈటీ సమయంలో గర్భం ధరించిన మహిళలకు ప్రసవానంతరం ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రసవమైన ఆరు వారాల తర్వాత వీరు వైద్యులు జారీచేసిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.

రాత పరీక్ష

ఈ పరీక్ష తేదీ, ప్రదేశాలను తెలియజేస్తూ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిట్‌ కార్టులను జారీచేస్తారు. వీటిని ఐటీబీపీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను ఓఎంఆర్‌, కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌... ఈ రెండింటిలో ఏ విధానంలో నిర్వహించేదీ తర్వాత తెలియజేస్తారు. ప్రశ్నపత్రంలో 5 భాగాలుంటాయి. 1) జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ రీజనింగ్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 2) జనరల్‌ అవేర్‌నెస్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 3) న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 4) ఇంగ్లిష్‌/హిందీ కాంప్రహెన్షన్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 5) ట్రేడ్‌/ప్రొఫెషన్‌ రిలేటెడ్‌- 60 ప్రశ్నలు, 60 మార్కులు ఉంటాయి.

* ట్రేడ్‌/ ప్రొఫెషనల్‌ రిలేటెడ్‌ సబ్జెక్టుల సిలబస్‌లో.. 1) కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌, 2) ప్రైమరీ హెల్త్‌కేర్‌ నర్సింగ్‌ 3) చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌ 4) మిడ్‌వైఫరీ 5) కమ్యూనిటీ హెల్త్‌ అండ్‌ హెల్త్‌ సెంటర్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. రాత పరీక్షలో అన్‌రిజర్వుడ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 33 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. దీంట్లో అర్హత పొందినవారి డాక్యుమెంట్స్‌ తనిఖీ చేసి.. ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌కు పంపిస్తారు.

ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌: దీన్ని ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహిస్తారు. దీంట్లో వైవాకు 40, ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఐడెంటిఫికేషన్‌కు 30, ప్రొసీజర్స్‌కు 30.. మొత్తం 100 మార్కులు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు. తర్వాత మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు గడువు: 08.07.2023
వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

డిగ్రీ ప్రవేశాలకు వేళాయె నేటి నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం●

● 19 నుంచి 24 వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ● జూలై 3న సీట్ల కేటాయింపు ● జూలై 4న తరగతులు ప్రారంభం ● ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 35 వేల డిగ్రీ సీట్లు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిగ్రీ కోర్సుల అడ్మిషన్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 35 వేల సీట్లకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానుంది. కాగా మన జిల్లాలో ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ అందుబాటులోకి వస్తోంది.

ముందుగానే అడ్మిషన్లు..

ఇంటర్మీడియెట్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ లేదా డిగ్రీ లేక మెడిసిన్‌ వంటి కోర్సులను చేయటం పరిపాటి. ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించిన ఏపీ ఈఏపీ, నీట్‌, జేఈఈ అడ్వాన్స్‌ వంటి ప్రవేశ పరీక్షల ఫలితాలు ఇప్పుడిప్పుడే వరుసగా విడుదలవుతున్నాయి. అదేవిధంగా ఇటీవలే ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు సైతం విడుదలయ్యాయి. తాజాగా డిగ్రీలో చేరేందుకు ఇంటర్మీడియెట్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ఏపీ ఉన్నత విద్యా మండలి డిగ్రీ కోర్సులు అడ్మిషన్లకు ఆదివారం అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

నేటి నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌

● ఉన్నత విద్యామండలి చేపట్టిన డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని వివిధ కళాశాలల్లో చేరేందుకు ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకూ విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా తమకు కావాల్సిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.

● వెబ్‌ ఆప్షన్ల ద్వారా రాష్ట్రంలోని వారికి కావాల్సిన వివిధ కళాశాలలను సైతం ఎంపిక చేసుకోవచ్చు. ఆ వివరాలను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

● ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ స్పెషల్‌ కేటగిరి పరిశీలన విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తారు.

● అలాగే ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకూ వెబ్‌ ఆప్షన్లకు సంబంధించిన విద్యాశాఖ పరిశీలన చేయనుంది.

● జూలై మూడో తేదీన వెబ్‌ ఆప్షన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి సీట్లను కేటాయిస్తుంది.

● జూలై నాలుగో తేదీన విద్యార్థులు ఎలాట్‌మెంట్‌ జరిగిన కళాశాలల్లో రిపోర్ట్‌ చేయటమే కాకుండా అదే రోజు తరగతులను సైతం ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

కృష్ణా వర్సిటీ పరిధిలో 130 కళాశాలలు

ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలో కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా సుమారు 140 కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆయా కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీబీఎం, ఐవోటీ తదితర కోర్సుల్లో సుమారు 35 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బీఏలో 20 రకాల కాంబినేషన్లు, బీకాంలో మరో 20 కాంబినేషన్లు, బీఎస్సీలో 40 కాంబినేషన్లకు సంబంధించిన కోర్సులను ఆయా కళాశాలలు ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రధానంగా పూర్వ కాలంలో ఉన్న కాంబినేషన్లకే కాకుండా కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్‌, బయోటెక్నాలజీ వంటి రంగాలకు సంబంధించి ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న విభిన్న రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు..

కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా కృష్ణా విశ్వవిద్యాలయం తన అనుబంధ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రారంభించింది. అందులో భాగంగా, బీఏ, బీకాం, బీఎస్సీల్లోని వివిధ కోర్సుల్లో ఆనర్స్‌ను అందిస్తున్నాయి. అందులో విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఆయా కోర్సులను అందిస్తాయి. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం మధ్యలో ఆ కోర్సులు చదువుతూ ఆగిపోయి అప్పటి వరకూ జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి వివిధ రకాల సర్టిఫికెట్లను అందించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

21న డిగ్రీ ఆనర్స్‌పై అవగాహన

విజయవాడలోని కేబీఎన్‌ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన డిగ్రీ ఆనర్స్‌, సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌పై అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. నారాయణరావు తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా 2023–2024 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ఆనర్స్‌ సబ్జెక్ట్‌లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సుతో పాటు అనేక నూతన మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కళాశాల ప్రాంగణంలో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రామ్మోహనరావు ముఖ్యఅతిథిగా హాజరై నూతన విద్యా విధానంపై అవగాహన కల్పిస్తారని వివరించారు.

https://oamdc-apsche.aptonline.in/OAMDC202324/Index

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

పదో తరగతి తర్వాత.. సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం ‣ పదో తరగతి తర్వాత కోర్సులు

పదో తరగతి తర్వాత.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ.. కోర్సులు చదవాలనుందా? అయితే పాలిటెక్నిక్‌ డిప్లొమాలో చేరిపోండి. ఇప్పుడీ కోర్సులు ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలూ పొందవచ్చు లేదా స్వయం ఉపాధి, ఉన్నత విద్యలోనూ రాణించవచ్చు. అభిరుచి, ఆసక్తి ప్రకారం ఎంచుకోవడానికి పదుల సంఖ్యలో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

సాంకేతిక విజ్ఞానంపై ఆసక్తి ఉండి, తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించేవాళ్లు డిప్లొమా కోర్సులకు ఓటేయొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో పట్టున్నవారు వీటిలో రాణించగలరు. కొన్ని బ్రాంచీల్లో కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమాలో చేరడానికి పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్‌) రాయాలి. పరీక్షలో పదో తరగతి మ్యాథ్స్, ఫిజికల్‌ సైన్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న వివిధ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి.

కోర్సులు 

సివిల్, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెదర్‌ టెక్నాలజీ.. తదితర బ్రాంచీలను ఏపీ, తెలంగాణ పాలిటెక్నిక్‌ల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.  

ఉద్యోగాలు 

కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల్లో వీరు సేవలు అందించవచ్చు. రైల్వేలో జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టులకు డిప్లొమాతోనే పోటీపడవచ్చు. అలాగే వివిధ కేంద్రీయ సంస్థల్లో జేఈ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షÛన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏడాది/ రెండేళ్లకు ఒకసారి ప్రకటన విడుదల చేస్తోంది. పరీక్షలో ప్రతిభ చూపినవారు లెవెల్‌-6 మూలవేతనం రూ.35,400తో మొదటి నెల నుంచే సుమారు రూ.55,000 జీతం పొందుతారు. 

రాష్ట్ర స్థాయిలో విద్యుత్తు పంపిణీ, రహదారులు, భవనాలు; పంచాయతీరాజ్, నీటిపారుదల.. శాఖల్లో డిప్లొమాతో దూసుకుపోవచ్చు. వీరికి ప్రైవేటు రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. నిర్మాణ రంగం, ఆటోమొబైల్, పవర్‌ ప్లాంట్లు, ఇంజినీరింగ్‌ సంస్థల్లో సులువుగానే నిలదొక్కుకోవచ్చు. ప్రభుత్వ, పేరొందిన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. పలు రంగాల్లో సేవలు అందిస్తోన్న కార్పొరేట్‌ సంస్థలు ఆకర్షణీయ వేతనంతో వీరికి ఉద్యోగాలిస్తున్నాయి. రైల్వేలో లోకో పైలట్‌ పోస్టుకు సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు పోటీపడొచ్చు. 

సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలుంటాయి. 

విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎలక్ట్రికల్‌ విభాగం వాళ్లు రాణించగలరు.

సివిల్‌ డిప్లొమాతో.. నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో సేవలు అందించవచ్చు. 

కొన్ని బ్రాంచీల వారికి రక్షణ రంగంలోనూ కొలువులు ఉన్నాయి. ఎయిర్‌ ఫోర్సులో ఎక్స్, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్‌ పోస్టులకు డిప్లొమా అర్హతతో పోటీ పడవచ్చు. డిప్లొమాతోనే సౌదీ, దుబాయ్, సింగపూర్, మలేసియా.. మొదలైన దేశాల్లో మంచి అవకాశాలు అందుతున్నాయి. 

ఉన్నత విద్య

డిప్లొమా తర్వాత ఈసెట్‌తో నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. వీరు ఎంసెట్‌/ఈఏపీసెట్, ఐఐటీ-జేఈఈ రాసుకోవచ్చు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవాళ్లు ఇంజినీర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అందించే బీటెక్‌తో సమానమైన.. అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈ) పూర్తిచేసుకోవచ్చు. అనంతరం ఎంటెక్‌లో చేరవచ్చు. కొన్ని డిప్లొమాలతో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లోకి అనుమతిస్తున్నారు. 

కొన్ని డీమ్డ్, ప్రైవేటు సంస్థలు పదో తరగతి తర్వాత ఆరేళ్ల వ్యవధితో డిప్లొమా + బీటెక్‌ కోర్సులను నడుపుతున్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటిలోనూ చేరవచ్చు.

కొన్నేళ్లుగా.. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (ఏఐ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ నెట్‌

వర్కింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, వెబ్‌ డిజైనింగ్, 3డీ యానిమేషన్‌ గ్రాఫిక్స్, యానిమేషన్‌-మల్టీ మీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ.. మొదలైన కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కళాశాలల్లో డిప్లొమాలో భాగంగా అందిస్తున్నారు. పాలీసెట్‌లో చూపిన ప్రతిభతో వీటిలోనూ చేరవచ్చు. ఇవే కోర్సులను బీఎస్సీ/ బీటెక్‌లో భాగంగానూ చదువుకోవచ్చు. 

ఉద్యాన డిప్లొమాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యానవన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. పదో తరగతి గ్రేడ్‌ పాయింట్లు/మార్కులు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో ఉద్యాన డిప్లొమాల్లో సీట్లు కేటాయిస్తారు. కోర్సు వ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధిస్తారు. వీరు డిప్లొమా అనంతరరం బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. ఏపీ/ తెలంగాణల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లు చదివినవారు ప్రవేశానికి అర్హులు. ఏపీలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం ఆధ్వర్యంలో రెండేళ్ల హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. దీనికి అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయ పరిధిలో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ కోర్సు నడుస్తోంది. 

వ్యవసాయ డిప్లొమా

గ్రామీణ విద్యార్థులు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అవకాశాలందుకోడానికి.. వ్యవసాయ డిప్లొమా కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లు అందిస్తున్నాయి. వీటిని రెండేళ్ల/ మూడేళ్ల వ్యవధితో రూపొందించారు. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌), డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (సీడ్‌ టెక్నాలజీ) కోర్సులను రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ఎరువులు, క్రిమిసంహారకాల తయారీ సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ఆధునిక సాగుతో రాణించవచ్చు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు చదువుకోవచ్చు. వీరికి 20 శాతం సీట్లు అగ్రిసెట్‌తో సూపర్‌ న్యూమరరీ విధానంలో భర్తీ చేస్తారు. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ మూడేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అనంతరం బీటెక్‌ అగ్రి ఇంజినీరింగ్‌ చదువుకోవచ్చు. వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పదో తరగతి గ్రేడ్‌ పాయింట్లు/ మార్కులు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో లభిస్తుంది. రెండేళ్ల కోర్సులను తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదివుండాలి ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో.. ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో అగ్రి పాలిటెక్నిక్‌లు నడుస్తున్నాయి.  

యానిమల్‌ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ

మూగజీవాలకు సత్వర వైద్యసేవలు అందించే దిశగా వెటర్నరీ డిప్లొమా కోర్సులు రూపొందించారు. వీటిని పూర్తిచేసుకున్నవారికి పశు వైద్యశాలలు, డెయిరీ, ఆక్వా సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు లేదా సంబంధిత యూనిట్‌ నెలకొల్పి స్వయం ఉపాధి పొందవచ్చు. యానిమల్‌ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ ఈ మూడు విభాగాల్లోనూ రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. డిప్లొమా తర్వాత వీరు బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్సీల్లో చేరవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లు చదవాలి. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు/మార్కులు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో సీట్లు భర్తీ చేస్తారు. ఏపీలో.. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో కోర్సులు నడుపుతున్నారు. దీనికి అనుబంధంగా డెయిరీ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్‌ కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. తెలంగాణలో పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండేళ్ల వ్యవధితో యానిమల్‌ హజ్బెండ్రీ పాలిటెక్నిక్‌ కోర్సులు చదువుకోవచ్చు.

హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ 

వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ ‘డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’ కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు/మార్కులతో విద్యార్థులను ఎంపికచేస్తారు. విద్యార్థులకు ప్రతినెలా ఉపకారవేతనం అందిస్తారు. చదువు పూర్తయిన తర్వాత టెక్స్‌టైల్స్‌ తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్థాయి. తమిళనాడులోని సేలం, కర్ణాటకలోని గడగ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థల్లో తెలుగు విద్యార్థుల కోసం కొన్ని సీట్లు కేటాయించారు.

ప్లాస్టిక్‌ డిప్లొమా 

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌).. హైదరాబాద్, విజయవాడ క్యాంపస్‌ల్లో మూడేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ) కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లను నేరుగా పదో తరగతి విద్యార్హతతోనే భర్తీ చేస్తున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్లాస్టిక్, అనుబంధ పరిశ్రమలు, ప్లాస్టిక్‌ వినియోగ సంస్థల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్‌ స్పెషలైజేషన్‌తో బీటెక్‌ చదువుకోవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

18, జూన్ 2023, ఆదివారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా | పత్రికా ప్రకటన (18.6.23) | ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు పొడిగింపు |

పాఠశాల విద్య కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు.
రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 24వ తేదీ వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా
*పాఠశాల బోధనా సమయం:* ఉదయం 7:30 నుండి 11:30 వరకు
*రాగి జావ:* ఉదయం 8:30 నుండి 9:00 వరకు
*మధ్యాహ్న భోజనం:* మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదేశించారు.
*పాఠశాల విద్యాశాఖ కమీషనర్,* (వారి తరఫున) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APSCHE: ఏపీలో జనరల్‌ డిగ్రీ కోర్సు ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్… 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ/ ఎయిడెడ్/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్/ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో జనరల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ‘ఓఏఎండీసీ 2023-24’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో జులై 19 నుంచి 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

జనరల్‌ యూజీ ప్రోగ్రామ్‌

కోర్సులు: బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీ.ఒకేషనల్‌, బీసీఏ, బీబీఏ, బీఎఫ్‌ఏ, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌

అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.400, బీసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.200.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 19.06.2023 నుంచి 24.06.2023 వరకు.

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 21.06.2023 నుంచి 23.06.2023 వరకు.

హెల్ప్‌లైన్‌ సెంటర్లలో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం: 22.06.2023.

వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలు: 26.06.2023 నుంచి 30.06.2023 వరకు.

సీట్ల కేటాయింపు: 03.07.2023.

https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx ------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html