●
19 నుంచి 24 వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ● జూలై 3న సీట్ల
కేటాయింపు ● జూలై 4న తరగతులు ప్రారంభం ● ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 35
వేల డిగ్రీ సీట్లు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి
కృష్ణా జిల్లాలో డిగ్రీ కోర్సుల అడ్మిషన్లకు ప్రభుత్వం శ్రీకారం
చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను ప్రభుత్వమే
నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 35 వేల
సీట్లకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానుంది. కాగా
మన జిల్లాలో ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ అందుబాటులోకి వస్తోంది.
ముందుగానే అడ్మిషన్లు..
ఇంటర్మీడియెట్ కోర్సులు పూర్తి చేసిన
విద్యార్థులు ఇంజినీరింగ్ లేదా డిగ్రీ లేక మెడిసిన్ వంటి కోర్సులను చేయటం
పరిపాటి. ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఏపీ ఈఏపీ, నీట్, జేఈఈ
అడ్వాన్స్ వంటి ప్రవేశ పరీక్షల ఫలితాలు ఇప్పుడిప్పుడే వరుసగా
విడుదలవుతున్నాయి. అదేవిధంగా ఇటీవలే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్
సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు సైతం విడుదలయ్యాయి. తాజాగా డిగ్రీలో చేరేందుకు
ఇంటర్మీడియెట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ
నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ఏపీ ఉన్నత విద్యా మండలి
డిగ్రీ కోర్సులు అడ్మిషన్లకు ఆదివారం అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల
చేసింది.
నేటి నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్
● ఉన్నత విద్యామండలి చేపట్టిన డిగ్రీ
కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని వివిధ కళాశాలల్లో
చేరేందుకు ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకూ విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా
తమకు కావాల్సిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.
● వెబ్ ఆప్షన్ల ద్వారా రాష్ట్రంలోని వారికి
కావాల్సిన వివిధ కళాశాలలను సైతం ఎంపిక చేసుకోవచ్చు. ఆ వివరాలను ఆన్‌లైన్‌లో
రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
● ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ స్పెషల్
కేటగిరి పరిశీలన విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల
ప్రాంగణంలో నిర్వహిస్తారు.
● అలాగే ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లకు సంబంధించిన విద్యాశాఖ పరిశీలన చేయనుంది.
● జూలై మూడో తేదీన వెబ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి సీట్లను కేటాయిస్తుంది.
● జూలై నాలుగో తేదీన విద్యార్థులు ఎలాట్‌మెంట్
జరిగిన కళాశాలల్లో రిపోర్ట్ చేయటమే కాకుండా అదే రోజు తరగతులను సైతం
ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కృష్ణా వర్సిటీ పరిధిలో 130 కళాశాలలు
ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలో కృష్ణా
విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా
సుమారు 140 కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆయా కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ,
బీసీఏ, బీబీఏ, బీబీఎం, ఐవోటీ తదితర కోర్సుల్లో సుమారు 35 వేల సీట్లు
అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బీఏలో 20 రకాల కాంబినేషన్లు, బీకాంలో మరో 20
కాంబినేషన్లు, బీఎస్సీలో 40 కాంబినేషన్లకు సంబంధించిన కోర్సులను ఆయా
కళాశాలలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రధానంగా పూర్వ కాలంలో ఉన్న కాంబినేషన్లకే
కాకుండా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ వంటి రంగాలకు
సంబంధించి ప్రస్తుతం డిమాండ్ ఉన్న విభిన్న రకాల కోర్సులు అందుబాటులో
ఉన్నాయి.
నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు..
కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా
విధానంలో భాగంగా కృష్ణా విశ్వవిద్యాలయం తన అనుబంధ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి
నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రారంభించింది. అందులో భాగంగా, బీఏ, బీకాం,
బీఎస్సీల్లోని వివిధ కోర్సుల్లో ఆనర్స్‌ను అందిస్తున్నాయి. అందులో
విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఆయా కోర్సులను అందిస్తాయి. అలాగే విద్యార్థుల
సౌకర్యార్థం మధ్యలో ఆ కోర్సులు చదువుతూ ఆగిపోయి అప్పటి వరకూ జరిగిన
పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి వివిధ రకాల సర్టిఫికెట్లను అందించేందుకు
ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.
21న డిగ్రీ ఆనర్స్‌పై అవగాహన
విజయవాడలోని
కేబీఎన్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన డిగ్రీ ఆనర్స్, సింగిల్
మేజర్ సబ్జెక్ట్‌పై అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు ఆ కళాశాల
ప్రిన్సిపాల్ డాక్టర్ వి. నారాయణరావు తెలిపారు. నూతన విద్యా విధానంలో
భాగంగా 2023–2024 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ఆనర్స్
సబ్జెక్ట్‌లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్ల డిగ్రీ
కోర్సుతో పాటు అనేక నూతన మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు
21వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కళాశాల ప్రాంగణంలో అవగాహన సదస్సును
నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య
కె. రామ్మోహనరావు ముఖ్యఅతిథిగా హాజరై నూతన విద్యా విధానంపై అవగాహన
కల్పిస్తారని వివరించారు.
https://oamdc-apsche.aptonline.in/OAMDC202324/Index
------------------------------------------------------------------------
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.
Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.
పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.
తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.
జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-
డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి