19, జూన్ 2023, సోమవారం

నర్సింగ్ కోర్స్ పూర్తీ చేసిన వారికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌వైఫ్‌) గ్రూప్‌ సి (నాన్‌-గెజిటెడ్‌ అండ్‌ నాన్‌మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌వైఫ్‌) గ్రూప్‌ సి (నాన్‌-గెజిటెడ్‌ అండ్‌ నాన్‌మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ప్రాక్టికల్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

మొత్తం 81 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 34, ఓబీసీకి 22, ఎస్సీకి 12, ఎస్టీకి 06, ఈడబ్ల్యూఎస్‌కు 07 కేటాయించారు. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 10 శాతం ఖాళీలను రిజర్వు చేశారు. వీరు అందుబాటులో లేనట్లయితే ఈ పోస్టులకు నాన్‌-ఈఎస్‌ఎం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పదోతరగతి, ఆగ్జిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎం) కోర్సు పాసవ్వాలి. సెంట్రల్‌ లేదా స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ కావాలి. వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 నుంచి 8 ఏళ్ల మినహాయింపు వర్తిస్తుంది.

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)లో భాగంగా పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రతిదాంట్లోనూ అర్హత సాధించాలి. 800 మీటర్ల పరుగును 4 నిమిషాల 45 సెకన్లలో ముగించాలి. 9 అడుగుల లాంగ్‌జంప్‌, 3 అడుగుల హైజంప్‌లను మూడు ప్రయత్నాల్లో సాధించాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. దీనికి మార్కులు ఉండవు. దీంట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించినవారిని ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ)కు ఎంపికచేసి శారీరక కొలతలు తీసుకుంటారు. అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 147.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. వయసు, ఎత్తులకు తగినంత బరువు ఉండాలి. దీంట్లో అర్హత సాధించినవారిని రాత పరీక్షకు ఎంపికచేస్తారు.

* పీఈటీ సమయంలో గర్భం ధరించిన మహిళలకు ప్రసవానంతరం ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రసవమైన ఆరు వారాల తర్వాత వీరు వైద్యులు జారీచేసిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.

రాత పరీక్ష

ఈ పరీక్ష తేదీ, ప్రదేశాలను తెలియజేస్తూ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిట్‌ కార్టులను జారీచేస్తారు. వీటిని ఐటీబీపీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను ఓఎంఆర్‌, కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌... ఈ రెండింటిలో ఏ విధానంలో నిర్వహించేదీ తర్వాత తెలియజేస్తారు. ప్రశ్నపత్రంలో 5 భాగాలుంటాయి. 1) జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ రీజనింగ్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 2) జనరల్‌ అవేర్‌నెస్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 3) న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 4) ఇంగ్లిష్‌/హిందీ కాంప్రహెన్షన్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 5) ట్రేడ్‌/ప్రొఫెషన్‌ రిలేటెడ్‌- 60 ప్రశ్నలు, 60 మార్కులు ఉంటాయి.

* ట్రేడ్‌/ ప్రొఫెషనల్‌ రిలేటెడ్‌ సబ్జెక్టుల సిలబస్‌లో.. 1) కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌, 2) ప్రైమరీ హెల్త్‌కేర్‌ నర్సింగ్‌ 3) చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌ 4) మిడ్‌వైఫరీ 5) కమ్యూనిటీ హెల్త్‌ అండ్‌ హెల్త్‌ సెంటర్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. రాత పరీక్షలో అన్‌రిజర్వుడ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 33 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. దీంట్లో అర్హత పొందినవారి డాక్యుమెంట్స్‌ తనిఖీ చేసి.. ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌కు పంపిస్తారు.

ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌: దీన్ని ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహిస్తారు. దీంట్లో వైవాకు 40, ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఐడెంటిఫికేషన్‌కు 30, ప్రొసీజర్స్‌కు 30.. మొత్తం 100 మార్కులు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు. తర్వాత మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు గడువు: 08.07.2023
వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: