అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
14, నవంబర్ 2023, మంగళవారం
సాయుధ బలగాల ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
15 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్
15 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ రామమోహనరావు తెలిపారు.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ రామమోహనరావు తెలిపారు. రిజిస్ట్రేషన్లు 15-17, ధ్రువపత్రాల పరిశీలన 16-18, కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు 17-19, వెబ్‌ఐచ్ఛికాల మార్పు 20, సీట్ల కేటాయింపును 22 తేదీల్లో చేయనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు 23వ తేదీ లోపు కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు.
13, నవంబర్ 2023, సోమవారం
AP Govt : ఆ 21 కులాలు ఇకపై రాష్ట్రమంతటా బీసీలే, భౌగోళిక పరిమితులు తొలగింపు | AP Govt: Those 21 castes are now BC across the state, removal of geographical restrictions
AP Govt : భౌగోళిక పరిమితుల కారణంగా కొన్ని ప్రాంతాలకే బీసీలుగా పరిగణిస్తు్న్న 21 కులాలు, ఉపకులాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రాంతంతో సంబంధం లేకుండా వారందరినీ బీసీలుగా పరిగణిస్తామని ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం
AP Govt : ఏపీ ప్రభుత్వం బీసీ ఉపకులాలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీసీలుగా పరిగణించే 21 కులాలు, ఉపకులాలకు భౌగోళిక పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రాంతం, భౌగోళిక పరిమితులు లేకుండా ఆ 21 కులాలు, ఉపకులాలను రాష్ట్ర వ్యాప్తంగా బీసీలుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో 138 కులాలను వెనుకబడిన తరగతులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 21 కులాలపై భౌగోళిక పరిమితులు ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారీగా ఈ 21 కులాలను బీసీలుగా పరిగణిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బీసీలుగా పరిగణించడంలేదు.
AP Govt : ఏపీ ప్రభుత్వం బీసీ ఉపకులాలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీసీలుగా పరిగణించే 21 కులాలు, ఉపకులాలకు భౌగోళిక పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రాంతం, భౌగోళిక పరిమితులు లేకుండా ఆ 21 కులాలు, ఉపకులాలను రాష్ట్ర వ్యాప్తంగా బీసీలుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో 138 కులాలను వెనుకబడిన తరగతులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 21 కులాలపై భౌగోళిక పరిమితులు ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారీగా ఈ 21 కులాలను బీసీలుగా పరిగణిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బీసీలుగా పరిగణించడంలేదు.
ఇకపై బీసీ సర్టిఫికేట్
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రమంతటా వీరిని బీసీలుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ 21 కులాలు, ఉపకులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే రాయలసీమ ప్రాంతంలో కల్లుగీతపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం ఇది వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
ఆ 21 కులాలివే!
- బీసీ-ఏ గ్రూపులో ఆరు కులాలు, వాటి ఉపకులాలకు భౌగోళిక పరిమితులు తొలగించారు. పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలను బీసీ జాబితాలో చేర్చారు.
- బీసీ-బి గ్రూపులో నాలుగు కులాలు, వాటి ఉపకులాలను చేర్చారు. గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), అచ్చుకట్లవాండ్లు, కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమలో తప్ప), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల కులాలను బీసీ జాబితాలో చేర్చారు.
- బీసీ-డి గ్రూపులో 11 కులాలు, వాటి ఉపకులాలు చేర్చారు. మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, నగరాలు, అయ్యరక, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ వైశ్య కులాలను బీసీ లిస్ట్ లో చేర్చారు.
DOT | సిమ్ కార్డు సర్వీస్ పేరిట సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తు.. డాట్ ఏమOదంటే..?!
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.
ఇందులో భాగంగా మొత్తం 20 కేటగిరీలో 14,528 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. నోటిఫికేషన్ నందు ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, VRO, విల్లేజ్ సర్వేయర్ తదితర పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా వీటిని ఎంపిక చేస్తారు. శాఖల పోస్టుల ఖాళీలు అర్హతలు
పోస్టు పేరు – ఖాళీలు
1. పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182 పోస్టులు
2. గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 112 పోస్టులు
3. ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 618 పోస్టులు
4. పశుసంవర్ధక సహాయకుడు – 4765 పోస్టులు
5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60 పోస్టులు
6. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005 పోస్టులు
7. విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 467 పోస్టులు
8. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23 పోస్టులు
9. మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092 పోస్టులు
10. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982 పోస్టులు
11. పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 134 పోస్టులు
12. డిజిటల్ అసిస్టెంట్ – 736 పోస్టులు
13. విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 990 పోస్టులు
14. సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578 పోస్టులు
15. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170 పోస్టులు
16. వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371 పోస్టులు
17. వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197 పోస్టులు
18. వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 436 పోస్టులు
19. వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 157 పోస్టులు
20. ఎనర్జీ అసిస్టెంట్ – 1127 పోస్టులు
21. మొత్తం ఖాళీలు – 14,523 పోస్టులు
22. AP సచివాలయం 3rd Notification 2023 కు దరఖాస్తు చేయబోవు అభ్యర్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
23. SC, ST వారికి – 5 సంవత్సరాలు
24. BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
25. విద్యార్హతలు :
26. గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్ II – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
27. పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
28. ANM (గ్రేడ్-III) (మహిళలు మాత్రమే) – SSC లేదా ఇంటర్, MPHA
29. పశుసంవర్ధక సహాయకుడు – సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా
30. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc లేదా B.Sc
31. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి
32. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ – అగ్రికల్చర్ విభాగంలో.....పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.Sc
33. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్)
34. మహిళా పోలీస్ మరియు మహిళా మరియు శిశు సంక్షేమ సహాయకుడు– ఏదైనా డిగ్రీ,
35. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – మెకానికల్ (డిప్లొమా/డిగ్రీ)
36. పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ VI) – ఏదైనా డిగ్రీ
37. డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్స్ట్రుమెంటేషన్), BCA
38. విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్
39. సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
40. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ
41. వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్)
42. వార్డ్ ఎడ్యుకేషన్& డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)
43. వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా ప్లానింగ్ లో డిగ్రీ
44. వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్)
నోటిఫికేషన్ త్వరలో విడుదల.
12, నవంబర్ 2023, ఆదివారం
SBI Bank Jobs: SBIలో ఉద్యోగాలు పోస్టుల వివరాలు..అర్హత..వయోపరిమితి..దరఖాస్తు రుసుము..ఎంపిక ప్రక్రియ..అప్లికేషన్ లింక్ మరియు నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి: Click Here
SBI sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
హోమ్‌పేజీలో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజర్ (సెక్యూరిటీ) కోసం దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
11, నవంబర్ 2023, శనివారం
ITBP: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు ఖాళీల వివరాలు: అర్హతలు: వయోపరిమితి: పే స్కేల్: పరీక్ష రుసుము: | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-11-2023. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.
ITBP: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు
భారత
హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
(ఐటీబీపీ)... స్పోర్ట్స్ కోటా-2023 కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 248
ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28లోగా ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్): 248 పోస్టులు
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్ట్రియన్, స్పోర్ట్స్ షూటింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,700-రూ.69,100.
పరీక్ష రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-11-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.
Recent
Empowering BA (HEP) Students: A Strategic Guide to Becoming a Professional Social Media Influencer బీఏ (హెచ్‌పీ) విద్యార్థుల సాధికారత: ప్రొఫెషనల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా ఎదిగేందుకు వ్యూహాత్మక మార్గదర్శి
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
