14, నవంబర్ 2023, మంగళవారం

సాయుధ బలగాల ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), సీఆర్పీఎఫ్ విభాగాల్లోని కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రామ్క ఫౌండేషన్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నాయి. సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం 80 వేలకు పైగా ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్లు ఈనెల 26న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు ప్రకటిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2 నుంచి వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇచ్చి శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు 9703651233ని సంప్రదించాలన్నారు.

కామెంట్‌లు లేవు: