Alerts

Loading alerts...

6, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఇండియన్ కోస్టల్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 260 సెయిలర్స్: 10+2 అర్హత., దరఖాస్తు చేసుకోండి | Indian Coastal Force Recruitment 260 Sailors: 10+2 Qualification., Apply

ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ విభాగాల్లో జనరల్ డ్యూటీ సీమాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులకు అర్హతలు, ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం, ఇతర సమాచారం క్రింద పేర్కొనబడింది.

రిక్రూటింగ్ అథారిటీ: ఇండియన్ కోస్ట్ గార్డ్
పోస్ట్ పేరు: సెయిలర్
పోస్టుల సంఖ్య : 260

అర్హత : మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్‌లో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు అర్హత
కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 22 సంవత్సరాలు మించకూడదు. 01 సెప్టెంబర్ 2002 మరియు 31 ఆగస్టు 2006 మధ్య జన్మించి ఉండాలి. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం: స్టేజ్-I, II, III, IV. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పీఈటీ/పీఎస్టీ/డీవీ/మెడికల్ టెస్ట్ మరియు ఇతర పరీక్షలు వరుసగా ఉంటాయి.

దరఖాస్తు విధానం
- కోస్ట్ గార్డ్ సీమాన్ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు https://joinindiancoastguard.cdac.in/cgept/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- నావికుడి పోస్ట్ కోసం రిజిస్ట్రేషన్ పొందడానికి లింక్ ఓపెన్ వెబ్‌పేజీలో అందించబడుతుంది. క్లిక్ చేయండి.
- మొదట రిజిస్ట్రేషన్ పొందండి మరియు తరువాత వివరణాత్మక దరఖాస్తును సమర్పించండి.
- అప్లికేషన్ లింక్ ఫిబ్రవరి 13న ఇవ్వబడుతుంది.

సీఫేరర్ పోస్టులకు ఎంపికైన వారికి బేసిక్ పే రూ.21,700. అన్ని ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ప్రమోషన్ కూడా ఉంటుంది మరియు నావిక్ పోస్టులకు ర్యాంక్ ఆధారంగా పోస్టుల హోదాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
NAVIK (చెల్లింపు స్థాయి 3)
మంచి నావికుడు (చెల్లింపు స్థాయి 4)
ప్రధాన్ నావిక్ (పే స్థాయి 5)
అధికారి (పే స్థాయి 6)
మంచి అధికారి (పే స్థాయి 7)
ప్రధాన్ అధికారి (చెల్లింపు స్థాయి 8)

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు ప్రారంభ తేదీ: 13-02-2024
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 27-02-2024 17-30 PM మధ్య.

దరఖాస్తు రుసుము రూ.300. SC/ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. నెట్ బ్యాంకింగ్, UPI పే లేదా ఇతర మోడ్‌ల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

మరింత సమాచారాన్ని చదవడానికి క్రింది PDF ఫైల్‌ను క్లిక్ చేయండి.

ఉద్యోగ వివరణ

INR 21700 నుండి 880000/నెలకు
పోస్ట్ పేరు నావికుల నియామకం
వివరాలు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు
ప్రచురణ తేదీ 2024-02-05
చివరి తేదీ 2024-02-27
ఉద్యోగ రకము పూర్తి సమయం
ఉపాధి రంగం రక్షణ శాఖ
జీతం వివరాలు

నైపుణ్యం మరియు విద్యా అర్హత

నైపుణ్యం --
అర్హత ద్వితీయ పీయూసీ సైన్స్ పాస్
పని అనుభవం 0 సంవత్సరాలు

రిక్రూటింగ్ ఏజెన్సీ

సంస్థ పేరు ఇండియన్ కోస్ట్ గార్డ్
వెబ్సైట్ చిరునామా https://joinindiancoastguard.cdac.in/index.html
సంస్థ లోగో

ఉద్యోగము చేయవలసిన ప్రదేశము

చిరునామా వివిధ రంగాలు
స్థానం వివిధ రంగాలు
ప్రాంతం న్యూఢిల్లీ
పోస్టల్ నెం 110001
దేశం IND

 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

5, ఫిబ్రవరి 2024, సోమవారం

CBSE: సీబీఎస్‌ఈ పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల * డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌

సీబీఎస్‌ఈ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల ఆన్‌లైన్‌ అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. గతంలో పరీక్ష టైం టేబుల్‌ (Time Table) తేదీల వివరాలు వెల్లడైన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. 

    సీబీఎస్‌ఈ పరీక్షల అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్‌ చేయండి  

  సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల టైం టేబుల్  
 
  సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AP Teacher Posts: 2217 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ | మొదట టెట్‌ నిర్వహించి, ఆ తరువాత డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల్లో సింహభాగం ఉమ్మడి కర్నూలు జిల్లాకు దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యలో 4,057 టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫై చేశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 2,217 పోస్టులు నోటిఫై అయ్యాయి. 2008 డీఎస్సీ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,683 పోస్టులు భర్తీ అయ్యాయి.

2,217 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
ఇందులో భాగంగా 2008 డీఎస్సీలో అర్హత పొంది ఉద్యోగాలు పొందలేకపోయిన వారితో పాటు 1998 డీఎస్సీ అర్హులకు మినిమం టైం స్కేల్‌తో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చింది. 2024 డీఎస్సీలో జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు 2,217 పోస్టులు విద్యాశాఖ నోటిఫై చేసింది.

వీటికి రెసిడెన్షియల్‌, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, ఆశ్రమ స్కూల్స్‌, మున్సిపల్‌ స్కూళ్లలోని ఖాళీలు అదనంగా జతకానున్నాయి. ప్రస్తుతం నోటిఫై చేసిన పోస్టులను అవసరమైన మేరకు ఖరారు చేసి జాబితాను శనివారం రాత్రికి కమిషనర్‌ ఆఫీస్‌కి డీఈఓ ఆధ్వర్యంలో పంపనున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 2,865 ఉండగా, వీటిలో 4.57 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 12,700 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 15,298 మంది ఉపాధ్యాయులు ఉండాలి. ప్రస్తుతం 2,217 పోస్టులను నోటిఫై చేయడంతో నిరుద్యోగులకు ఊరట లభించింది.

2024 డీఎస్సీ ద్వారా ఇచ్చే పోస్టులతో కలిపితే మొత్తంగా 3,238 టీచర్‌ పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుంది. మొదట టెట్‌ నిర్వహించి, ఆ తరువాత డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండు నోటిఫికేషన్లు వారం రోజుల్లో రానున్నాయి.

డీఎస్పీ ద్వారా భర్తీ చేసే అవకాశం

ఎస్‌జీటీ 1,646, స్కూల్‌ అసిస్టెంట్‌

571 పోస్టులు

వీటికి అదనంగా రెసిడెన్షియల్‌,

మున్సిపల్‌, ఏపీ మోడల్‌ స్కూళ్ల

పోస్టులు పెరిగే అవకాశం

ఉమ్మడి క ర్నూలు జిల్లాలో నోటిఫై చేసిన పోస్టుల వివరాలు..

క్యాటగిరీ పోస్టులు ఖాళీల

వివరాలు

స్కూల్‌ అసిస్టెంట్‌(లాంగ్వేజ్‌–1) 84

స్కూల్‌ అసిస్టెంట్‌(లాంగ్వేజ్‌–2) 113

స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిషు 43

స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం 73

స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ 44

స్కూల్‌ అసిస్టెంట్‌ 44

బయోలాజికల్‌ సైన్స్‌

స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ 35

స్కూల్‌ అసిస్టెంట్‌ 135

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌

ఎస్‌జీటీ(తెలుగు మీడియం) 1,614

ఎస్‌జీటీ(కన్నడ మీడియం) 32

మొత్తం పోస్టులు 2,217

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AP DSC TET: నేడే టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్‌ * మొత్తం 6,100 ఖాళీల భర్తీ * కొత్తగా అప్రెంటిస్‌షిప్‌ విధానo

AP DSC TET: నేడే టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్‌

* మొత్తం 6,100 ఖాళీల భర్తీ 
* కొత్తగా అప్రెంటిస్‌షిప్‌ విధానం

రాష్ట్రంలో డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రకటనను సోమవారం (ఫిబ్రవరి 5న) విడుదల కానుంది. ఆ రోజు నుంచే దరఖాస్తు స్వీకరిస్తారు. డీఎస్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తీసుకురానున్నారు. డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్‌ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్‌షిప్‌ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. టెట్‌, డీఎస్సీలకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

* డీఈడీ వారికే ఎస్జీటీ అర్హత

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పేపర్‌-1, స్కూల్‌ అసిస్టెంట్లకు పేపర్‌-2 విడివిడిగా టెట్‌ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్‌ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 7,902 పోస్టులకు ప్రకటన ఇవ్వగా.. 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్‌ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్‌, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెట్‌, డీఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేనాటికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది.
 
  డీఎస్సీ ఆంధ్రప్రదేశ్   

  స్కూల్ అసిస్టెంట్  
 
తెలుగు (కంటెంట్)
హిందీ (కంటెంట్)
ఇంగ్లిష్ (కంటెంట్)
బయాలజీ (కంటెంట్)
ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
విద్యా దృక్పథాలు (కంటెంట్)
 సైకాలజీ (కంటెంట్)

  తెలుగు పండిట్   
 
కంటెంట్
మెథడాలజీ

  సెకండరీ గ్రేడ్ టీచర్స్   
 
లాంగ్వేజ్ - I తెలుగు (కంటెంట్)
గణితం (మెథడాలజీ)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
 సైన్స్ (కంటెంట్)
 విద్యా దృక్పథాలు
సైకాలజీ (కంటెంట్)

లాంగ్వేజ్ - II ఇంగ్లిష్ (కంటెంట్)

లాంగ్వేజ్ - I హిందీ (కంటెంట్)
 
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Comedk 2024 Requirements | Comedk 2024 కొరకు అవసరమైన వివరాలు

1.   Requirements for Comedk 2024

2.   SSC Marks Memo

3.   Photograph

4.   Student Signature

5.   Parent's Signature

6.   Email ID

7.   Mobile Number

8.   Aadhaar or PAN Card

9.   Comedk Fee Rs.1800/-

10.               Father Name

11.               Mother Name

12.               Father / Mother Aadhaar

13.               Father / Mother Mobile Number

14.               Address Details Candidate

15.               Intermediate Study Details Like School Name, State, City of College, Pin Code,

16.               other Entrance Examination Details that Candidate Appearing

17.               Payment Mode: Bring your own ATMs (Please ensure your card is enabled for online transactions.) and through e commerce enabled Debit/Credit Cards  or through Net Banking

COMEDK UGET: కొమెడ్‌కె యూజీఈటీ 2024 - ఇంజినీరింగ్ కోర్సులు 

కన్సార్షియం ఆఫ్‌ మెడికల్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ డెంటల్‌ ఆఫ్‌ కర్ణాటక(కొమెడ్‌కె)- ఇంజినీరింగ్ కోర్సులుకు సంబంధించి యూజీ ప్రవేశ పరీక్ష 2024 ప్రకటన విడుదలైంది. కొమెడ్‌ పరిధిలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీఈ, బీటెక్‌ ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం 20,000 సీట్లు ఉన్నాయి.

పరీక్ష వివరాలు:

కొమెడ్‌కె యూజీఈటీ 2024 - ఇంజినీరింగ్ కోర్సులు

అర్హత: సెకండ్ పీయూసీ/ 10+2 హయ్యర్ సెకండరీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. గ్రూప్‌ సబ్జెక్టుల్లో కనీసి 45 శాతం మార్కులు ఉండాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,800 ప్లస్ కన్వీనియన్స్ ఫీజు.

ముఖ్య తేదీలు...

దరఖాస్తు ముగింపు తేదీ: 05-04-2024.

టెస్ట్ అడ్మిషన్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం : 06-05-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 12-05-2024.

Website https://www.comedk.org/index

Notification https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/COMEDK-UGET-03-02-2024.pdf

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ ఖాళీ: వివిధ 214 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం Sports Authority of India Job Vacancy: Applications invited for various 214 posts

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ ఖాళీ: వివిధ 214 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

SAI జాబ్ నోటిఫికేషన్ 2024: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్, అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు కింది సమాచారాన్ని తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యాంశాలు:

  • SAI నుండి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్.
  • వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
  • మొత్తం 214 పోస్టులు ఉన్నాయి.
sports authority of india recruitment 2024
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2024 వివిధ పోస్టులకు దరఖాస్తు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ కోచ్, సీనియర్ కోచ్, కోచ్, హై పెర్ఫార్మెన్స్ కోచ్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, పేర్కొన్న పోస్ట్‌లలో ఆసక్తి ఉన్నవారు ఇచ్చిన తేదీలోపు దరఖాస్తు చేసుకోండి

పోస్టుల వివరాలు
హై పెర్ఫార్మెన్స్ కోచ్ : 09
సీనియర్ కోచ్: 45
కోచ్: 43
అసిస్టెంట్ కోచ్: 117

పోస్ట్ వారీగా గరిష్ట వయస్సు అర్హత
హై పెర్ఫార్మెన్స్ కోచ్: 60 సంవత్సరాలు.
సీనియర్ కోచ్: 50 సంవత్సరాలు.
కోచ్: 45 సంవత్సరాలు.
అసిస్టెంట్ కోచ్: 40 సంవత్సరాలు.

ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సూచించిన అనుభవం, సామర్థ్యాలు, నైపుణ్యాలు కలిగి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 15-01-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 14-02-2024 సాయంత్రం 05 గంటల వరకు.

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

SAI ఉద్యోగ నోటిఫికేషన్ 2024

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుదారులు వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ / ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయబడతారు.

ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా లేదా ఈ మోడ్ కాకుండా నేరుగా ఆమోదించబడదు. పేరు, SSLC మార్క్ షీట్, వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, అర్హత పత్రాలు, పని అనుభవం పత్రాలు దరఖాస్తు అవసరం.

 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

నేవీలో 10+2 ఎంట్రీ స్కీం * ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు * జనవరి 20 దరఖాస్తుకు గడువు

నేవీలో 10+2 ఎంట్రీ స్కీం

* ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు

* జనవరి 20 దరఖాస్తుకు గడువు

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం ప్రకటన వెలువడింది. అమ్మాయిలూదరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ ర్యాంకు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఇందులో అవకాశం వచ్చినవారికి ఇంజినీరింగ్‌ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం అన్నీ ఉచితంగానే దక్కుతాయి. చదువు, శిక్షణ పూర్తయిన వెంటనే విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే రూ.లక్ష కంటే ఎక్కువ వేతనం అందుతుంది. 

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు నేవీ 10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీంకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌లో ర్యాంకు తప్పనిసరి. అందులో సాధించిన ర్యాంకుతో మెరిట్‌ ప్రకారం వచ్చిన దరఖాస్తులను మదింపు చేస్తారు. ఖాళీలకు అనుగుణంగా కొంత మందిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ)... బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంల్లో ఎక్కడైనా మార్చి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి. 

తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు చేపడతారు. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలో నెగ్గినవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ నిలిచినవారిని తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌బీలో సాధించిన మెరిట్‌ ప్రకారం అర్హులకు అవకాశం కల్పిస్తారు.  

 జులైలో శిక్షణ 

ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జులై 2024 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ అప్లైడ్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు...అన్నీ ఉచితంగా అందిస్తారు. 

విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) - న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. 

అనంతరం వీరు సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు. చేరిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ లేదా ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ కేటాయిస్తారు. వీరికి లెవెల్‌ 10 మూలవేతనం అంటే రూ.56,100 చెల్లిస్తారు. మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 అదనంగా దక్కుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలిపి గరిష్ఠంగా రూ.లక్ష కంటే ఎక్కువే వేతన రూపంలో అందుకోవచ్చు. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్‌ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు.. ఇలా ప్రోత్సాహకాలు పొందవచ్చు. 60 వార్షిక, 20 సాధారణ సెలవులు లభిస్తాయి. 

ముఖ్య వివరాలు

ఖాళీలు: మొత్తం 35. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ (ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌) విభాగాల్లో ఉన్నాయి. కనీసం పది పోస్టులు మహిళలతో నింపుతారు. 

విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌-2023లో ర్యాంకు పొందాలి. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.

వయసు: జనవరి 2, 2005 - జులై 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...