3, మార్చి 2024, ఆదివారం

AP SSC Hall tickets: 4న పదో తరగతి హాల్‌ టిక్కెట్లు విడుదల

AP SSC Hall tickets: 4న పదో తరగతి హాల్‌ టిక్కెట్లు విడుదల  

* మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు
 
ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్‌ టిక్కెట్లు సోమవారం (మార్చి 4) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12గంటల నుంచి పాఠశాలల లాగిన్‌తో పాటు విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

APRS CAT: ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2024

APRS CAT: ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2024 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏపీఆర్‌ఎస్‌ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2024 నోటిఫికేషన్​ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా ఏపీఆర్‌ఎస్‌ గురుకుల పాఠశాలలు​ ఉన్నాయి. అర్హులైన ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అనాథ, పీహెచ్‌సీ తదితర కేటగిరీ విద్యార్థులు మార్చి 31వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్‌ 25వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు...

ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024 (ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2024)

తరగతులు: 5, 6, 7, 8.

ఏపీ గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్ల సంఖ్య: 3,920.

ఏపీ గురుకుల పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి సీట్ల సంఖ్య: 575.

అర్హత: 2023-2025 విద్యా సంవత్సరంలో తరగతిని బట్టి.. 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.అప్లికేషన్ల కోసం సంప్రదించండి  జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

వయసు: అయిదో తరగతికి 01.09.2013 నుంచి 31.08.2015 మధ్య; ఆరో తరగతికి 01.09.2012 నుంచి 31.08.2014 మధ్య; ఏడో తరగతికి 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య; ఎనిమిదో తరగతికి 01.09.2010 నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.

ప్రవేశ పరీక్ష: ప్రశ్నపత్రం ఓమ్మార్‌ షీట్‌ విధానంలో రెండు గంటల వ్యవధితో, 100 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్‌ కేటగిరీ, స్థానికత​ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2024.

హాల్‌టికెట్‌ జారీ తేదీ: 17.04.2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 25.04.2024.

ఫలితాల ప్రకటన, మొదటి ఎంపిక జాబితా వెల్లడి తేదీ: 14.05.2024.

రెండో ఎంపిక జాబితా వెల్లడి తేదీ: 21.05.2024.

మూడో ఎంపిక జాబితా వెల్లడి తేదీ: 28.

Important Links

Posted Date: 02-03-2024