Alerts

4, మార్చి 2021, గురువారం

Ananthapuramu District Classifieds






 

Tirumala Sri Vari Sarva Darshan (Free)

*Today  Darshan Slots For 05-03-2021(Friday )*

Slots Available Now At

1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)

*Availability  Status At 06:40pm  Today*

సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి

*తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  05-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్*

👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

 👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

3, మార్చి 2021, బుధవారం

📚✍జేఈఈ మెయిన్ కీ* *విడుదల✍📚*

*
*🌻న్యూఢిల్లీ :* జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్ కు సంబంధించిన పేపర్ 1, 2 ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఫిబ్రవరి సెషన్ పరీక్షకు హాజరైన విద్యార్థులు https://jee main.nta.nic.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఎలాంటి సందేహాలు ఉన్నా ఛాలెంజ్ చేయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. దీని కోసం ఒక్క ప్రశ్నకు రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండెబుల్ అమౌంట్. ఈ అవకాశం మార్చి 1, 2021 నుంచి మార్చి 3, 2021 (సాయంత్రం 5) వరకు అందుబాటులో ఉంటుంది. తొలి సెషన్ పేపర్ 1కు 6,20,153 మంది, పేపర్ 2 పరీక్షకు 51,229 మంది హాజరయ్యారు. ఇక పేపర్ 1 రెండో విడత పరీక్షలు మార్చి 15, 16, 17, 18వ తేదీల్లో జరగనున్నాయి.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍మార్చి జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు 6✍📚*



🌻దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించే రెండో విడత జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు శనివారం(ఈ నెల 6వ తేదీ) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల మండలి(ఎన్టీయే) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే అన్ని విడతలకు దరఖాస్తు చేసినా... మిగిలిన విడతల్లో పరీక్షలు రాసేది లేదనుకుంటే 6వ తేదీలోగా దరఖాస్తును విరమించుకోవచ్చు. పరిమిత సమయమే ఉన్నందున దరఖాస్తుల్లో సవరణకు అవకాశం ఉండదని, పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా వివరాలు పొందుపరచాలని ఎన్టీయే సూచించింది. బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్‌-2 పరీక్ష మార్చి, ఏప్రిల్‌లో జరగదు. వారికి మరోసారి మే నెలలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో జరిగిన మొదటి విడత పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ ని ఎన్టీయే వెబ్‌సైట్లో ఉంచింది. అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఛాలెంజ్‌ చేయవచ్చు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍ఆయుర్వేద, హోమియో డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం✍📚*



*🌻ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:* ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఆయుర్వేద, హోమియో వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ కోర్సుల్లో యాజమాన్య, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, నాన్‌ మైనారిటీ కేటగిరీ సీట్ల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 5 గంటల్లోగా దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఏయే కళాశాలల్లో ఎన్నెన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని రిజిస్ట్రార్‌ శంకర్‌ తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

📚✍జులై 12 నుంచి* *ఎంసెట్‌✍📚

**

*♦బైపీసీ స్ట్రీమ్‌ 19, 20 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం*

*🌻ఈనాడు, అమరావతి:* ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్‌ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్‌ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.

*♦మిగతా పరీక్షల్లో కొంత జాప్యం*
ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున ఆగస్టు 6 వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.

*♦ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్‌ల బాధ్యతలు*
ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Software Engineer for freshers at United Health Group

 

Jobs Images  
Software Engineer
Qualifications:
  • Undergraduate degree or equivalent experience
  • Knowledge in algorithms, principles and techniques to solve technical problems
  • Ability to write time and space efficient code in languages like Java, J2EE, .NET, VC++
  • Ability to solve and develop complex problems
Location: Hyderabad

For more details, please visit: careers.unitedhealthgroup.com/job/12365495/software-engineer-hyderabad-tg-hyderabad-in/

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...