🌻దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించే రెండో విడత జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలకు హాజరయ్యేందుకు శనివారం(ఈ నెల 6వ తేదీ) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల మండలి(ఎన్టీయే) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే అన్ని విడతలకు దరఖాస్తు చేసినా... మిగిలిన విడతల్లో పరీక్షలు రాసేది లేదనుకుంటే 6వ తేదీలోగా దరఖాస్తును విరమించుకోవచ్చు. పరిమిత సమయమే ఉన్నందున దరఖాస్తుల్లో సవరణకు అవకాశం ఉండదని, పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా వివరాలు పొందుపరచాలని ఎన్టీయే సూచించింది. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్-2 పరీక్ష మార్చి, ఏప్రిల్‌లో జరగదు. వారికి మరోసారి మే నెలలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో జరిగిన మొదటి విడత పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ ని ఎన్టీయే వెబ్‌సైట్లో ఉంచింది. అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఛాలెంజ్ చేయవచ్చు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
కామెంట్‌లు