3, మార్చి 2021, బుధవారం

📚✍జేఈఈ మెయిన్ కీ* *విడుదల✍📚*

*
*🌻న్యూఢిల్లీ :* జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్ కు సంబంధించిన పేపర్ 1, 2 ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఫిబ్రవరి సెషన్ పరీక్షకు హాజరైన విద్యార్థులు https://jee main.nta.nic.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఎలాంటి సందేహాలు ఉన్నా ఛాలెంజ్ చేయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. దీని కోసం ఒక్క ప్రశ్నకు రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండెబుల్ అమౌంట్. ఈ అవకాశం మార్చి 1, 2021 నుంచి మార్చి 3, 2021 (సాయంత్రం 5) వరకు అందుబాటులో ఉంటుంది. తొలి సెషన్ పేపర్ 1కు 6,20,153 మంది, పేపర్ 2 పరీక్షకు 51,229 మంది హాజరయ్యారు. ఇక పేపర్ 1 రెండో విడత పరీక్షలు మార్చి 15, 16, 17, 18వ తేదీల్లో జరగనున్నాయి.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

కామెంట్‌లు లేవు: