Alerts

--------

31, అక్టోబర్ 2021, ఆదివారం

*కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారికి శ్రీవారి తలంబ్రాలు* | కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారికి శ్రీవారి తలంబ్రాలు

టీటీడీ ప్రస్తుతం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులు, చేసుకున్న నవదంపతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

★ తిరుమల తిరుపతి దేవస్థానం..
దేశంలో ఎన్నో గుడులు ఉండవచ్చుగాక.. కానీ తిరుమల గుడి ప్రత్యేకతే వేరు.
◆ అక్కడికి వెళ్లి ఓసారి శ్రీవారిని దర్శించుకుంటే చాలు..
 మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. అందుకే..

★ తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత ప్రత్యేకత. సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని గంటల పాటు లైన్ లో వేచి ఉండాలి.
 నిద్రకు ఓర్చుకోవాలి.. అప్పుడే శ్రీవారి దర్శనభాగ్యం కలుగుతుంది.

🟢 టిటిడీ ప్రస్తుతం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు, చేసుకున్న దంపతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
◆ శ్రీవారికి నిత్య కల్యాణంలో పవిత్ర తలంబ్రాలను వినియోగిస్తారు. ఆ తలంబ్రాలకు కొత్త దంపతులకు అందివ్వాలని నిర్ణయించింది. కొత్తగా పెళ్లయిన, పెళ్లి చేసుకోబోయే దంపతులు స్వామి ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా తిరుమలకు రావాల్సిన అవసరం లేకుండా… వాళ్లకు డైరెక్ట్ గా ఇంటికే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను అందివ్వాలని నిర్ణయించింది.

దానికోసం..
■ నూతన దంపతులు వాళ్ల పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తిరుమలకు పంపించాల్సి ఉంటుంది. ఆ పెళ్లి పత్రిక ద్వారా.. నూతన దంపతులకు శ్రీవారి పవిత్ర తలంబ్రాలను పోస్టు ద్వారా ఉచితంగా పంపిస్తారు. కల్యాణ తలంబ్రాలతో పాటు కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని కూడా పంపిస్తారు.

❇️ ఇంకెందుకు ఆలస్యం..

★ మీకు ఇటీవలే పెళ్లి అయిందా?
★ లేదా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?
★ శ్రీవారి తలంబ్రాల కోసం వెంటనే టీటీడీ కాల్ సెంటర్ నెంబర్లు 0877-2233333, 2277777 ఫోన్ చేయండి.
చిరునామా: ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మిన్ బిల్డింగ్స్, కేటీ రోడ్, తిరుపతి – 517501.
*Dept.Of PRO TTD*

ఆయుర్వేద సిద్ధ యునాని మరియు హోమియోపతి | BAMS/BUMS/BSMS/BHMS Seats 2020-2021 UG మరియు PG కోర్సులలో ఆల్ ఇండియా కోటా All India Quota (AIQ) సీట్ల కోసం కౌన్సెలింగ్ ప్రకటన

Gemini Internet click here for official website https://aaccc.gov.in/aacccug

Minority Scholarship 2021-22 | మైనారిటీ స్కాలర్ షిప్ నవంబర్ 30 దరఖాస్తుకు చివరి తేది



Minority Scholarship 2021-22 | మైనారిటీ స్కాలర్ షిప్స్ కు మీకు అర్హత ఉందా https://www.youtube.com/watch?v=IAKkWecyqOk&ab_channel=GeminiAlertsTeluguUpdates

ISRO Recruitment 2021: రూ. 1.12 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే | నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు

ఇస్రో(ISRO) నుంచి పలు ఖాళీ భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో(ISRO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయున్నట్లు నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు. జూనియర్ ట్రాన్స్ లేషన్(Translation) ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఇస్రో(ISRO)కు చెందిన హ్యూమన్ స్పేస్ ఫైట్ సెంటర్(HSFC) లో పని చేయాల్సి ఉంటుంది. అయితే తాత్కాలిక పద్ధతిలో ఈ నియామకాలను(Recruitment) చేపట్టినట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,12,400 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.


ఎవరు అప్లై చేయాలంటే..

-అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థుల డిగ్రీ లెవల్ లో ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్(Elective Subject) అయి ఉండాలి.

-గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో హిందీ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి.

for Applications Visit Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

ఇంగ్లిష్, హిందీ కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో హిందీ మీడియం ఉండి ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి.


-హిందీ లేదా ఇంగ్లిష్ లో కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు సైతం ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో హందీ మీడియంలో చదివి ఉండాలి. లేదా హిందీ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి.

-హిందీ లేదా ఇంగ్లిష్ కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. హిందీ మరియు ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలెక్టీవ్ సబ్జెక్టులు అయి ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టులు కంపల్సరీ లేదా ఎలెక్టివ్ అయి ఉండాలి.

-ఈ విద్యార్హతలతో పాటు అభ్యర్థులు హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీ భాషకు ట్రాన్స్ లేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ట్రాన్స్ లేషన్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.


ఎలా అప్లై చేయాలంటే..
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఇస్రో అధికారిక వెబ్ సైట్లో (https://www.isro.gov.in/)అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
-ఈ ఖాళీలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమైంది. దరఖాస్తులకు నవంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేయాల్సి ఉంటుంది.
-దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు రూ. 250 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
-రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

30, అక్టోబర్ 2021, శనివారం

Navodaya *నవోదయ నోటిఫికేషన్-2021-22* | నవోదయ విద్యాలయ లో 2022 - 23 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం | నవంబర్ 30వ తేదీ 2021 లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.


నవోదయ విద్యాలయ లో 2022 - 23  విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021  నవంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
1.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 - 2020 , 2020-21, విద్యా సంవత్సరాలలో  వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి.2021-22 విద్యా సంవత్సరం లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
2.అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదీలను కలుపుకొని )
ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లు ద్వారా దరఖాస్తు ఫారంని డౌన్ లోడ్ చేసుకొని దానిని పూర్తి చేసి , 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ధృవీకరింపజేసీ మరల దానిని అన్ లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలోని నియమ నిబంధనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించి దరఖాస్తులను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ - 20/09/2021
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ  - 30/11/2021
పరీక్ష తేదీ - 30/04/2022
వెబ్ సైట్లు- www.navodaya.gov.in
https://navodaya.gov.in/nvs/en/Admission-JNVSTJNVST-class/

http://cbseitms.in/nvsregn/index.aspx
అప్లికేషన్ల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్,  ధనలక్ష్మి రోడ్, హిందూపురం. 

Direct link

Gemini Internet

For prospectus click here

నవోదయలో 6వ తరగతికి ప్రవేశాలు | Navodaya 6th Class Admission https://www.youtube.com/watch?v=odQUF3q83F0&ab_channel=GeminiAlertsTeluguUpdates

 

నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు అప్లై చేసిన వారికి కొత్త నియమం | సవరించిన Certificate తో మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. https://speedjobalerts.blogspot.com/2021/11/6-certificate.html 

కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్‌ తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది

ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదా పొందేలా ఏదైనా బిజినెస్చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త.
 

కేంద్రప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్నెట్వర్క్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టాఫీస్లు ఉన్నాయి. అందులో 89 శాతం పోస్టాఫీసులు  గ్రామీణ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రూరల్‌, అర్బన్ఏరియాల్లో సైతం సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు 2019లో ఫ్రాంఛైజ్స్కీంను అందుబాటులోకి  తెచ్చింది

పోస్టాఫీస్‌  ఫ్రాంఛైజీ తీసుకుంటే ఏం చేయాలి

 స్టాంప్స్‌, స్టేషనరీని అమ్ముకోవచ్చు

► బుకింగ్రిజిస్టర్డ్ఆర్టికల్స్‌, స్పీడ్పోస్ట్ఆర్టికల్స్‌, మనీ ఆర్డర్స్సర్వీస్లను అందించాల్సి ఉంటుంది

► పోస్టల్లైఫ్ఇన్స్యూరెన్స్‌ (పీఎల్- ఏజెంట్‌)కు సంబంధించిన అమ్మకాలు, ప్రీమియంను కట్టించుకోచ్చు.

► పోస్టాఫీస్పరిధిలోకి వచ్చే రీటైల్ సర్వీసులు అంటే బిల్స్‌, ట్యాక్స్‌, పన్నుల వసూళ్లు లేదా చెల్లింపులు  చేయాల్సి ఉంటుంది.  

ఫ్రాంఛైజీకి కావాల్సిన  అర్హతలు 

► ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవాలంటే మినిమం 8 తరగతి చదివి ఉండాలి. ఇక డిపాజిట్కింద రూ.5000 నేషనల్సేవింగ్స్సర్టిఫికెట్కింద చెల్లించాల్సి ఉంటుంది

 దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను   పోస్టాఫీస్అధికారులు మీ దరఖాస్తును డివిజనల్ హెడ్కు పంపిస్తారు

 అలా మీ ధరఖాస్తును చెక్చేస్తారు. మీ ఫ్రాంఛైజీకోసం అప్లయ్చేసిన ధరఖాస్తుకు చెందిన అడ్రస్ను పరిశీలిస్తారు. దీంతో పాటు ఫ్రాంఛైజీని నిర్వహించే సామర్ధ్యం ఉందా లేదా, కంప్యూటర్సౌకర్యం ఉందా లేదా అని పరిగణలోకి తీసుకుంటారు

► అనంతరం 14 రోజుల్లో ఫ్రాంఛైజీకి మీరు అర్హులు, కాదా అంశంపై  నిర్ణయం తీసుకుంటారు.

ఫ్రాంఛైజీకి ఎవరికి? ప్రాంతంలో ఇవ్వరు

► 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అవకాశం ఇవ్వరు

► పోస్టాఫీస్ఉద్యోగం చేస్తున్నా, లేదంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఫ్రాంఛైజీని తీసుకునేందుకు అనర్హులు 

► పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ పథకంలో భాగంగా పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు.  

ఫ్రాంఛైజీ వల్ల లాభాలు ( లింక్క్లిక్చేస్తే 22పేజీలో పూర్తి వివరాలు)

► పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్నిర్వాహకులు అందించే సేవలపై కమీషన్ లభిస్తుంది

► రిజిస్టర్డ్ పోస్ట్కు రూ.3, స్పీడ్పోస్టుకు రూ.5 కమీషన్, రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్పై రూ.3.50, అంతకన్నా ఎక్కువ మనీ ఆర్డర్పై రూ.5 కమీషన్ వస్తుంది.

► నెలలో 1000 రిజిస్టర్ పోస్టులు, 1000 స్పీడ్ పోస్ట్లు బుక్ చేస్తే 20శాతం కమీషన్ అదనంగా లభిస్తుంది

► ఇక స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ, మనీ ఆర్డర్ ఫామ్ లాంటి అమ్మకాలపై 5 శాతం కమిషన్ ఉంటుంది.

 

Gemini Internet కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్‌ | Postal Agency for Just Rs.5000/- only

https://www.youtube.com/watch?v=k0eeJxrOHwY&ab_channel=GeminiAlertsTeluguUpdates

 

Sukanya Samruddhi Yojana: అదిరిపోయే స్కీమ్‌.. నెలకు రూ.12,500 డిపాజిట్‌తో రూ. 70 లక్షల బెనిఫిట్‌..!

Sukanya Samruddhi Yojana: ప్రస్తుతం ఆదాయం పెంచుకునే పథకాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలలో సుకన్య సమృద్ది (ఎస్‌ఎస్‌వై) యోజన స్కీమ్‌ ఒకటి. ఈ పథకం అనేది ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినది. భారత ప్రభుత్వం బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా 2015లో ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక పొదుపు ప‌థ‌కం. ఆడ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసాగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉన్నత విద్య, వివాహ సమయాల్లో ఈ స్కీమ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ పథకానికి ఎవ‌రు అర్హులు?

ఆడ పిల్ల పుట్టిన తర్వాత నుంచి ఆమెకు పదేళ్ల వయసు వచ్చే లోపు ఎప్పుడైన ఈ స్కీమ్‌ కింద బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఖాతా తెరవవచ్చు. అయితే ఈ పథకంలో ఆమె చేరాలంటే ఖచ్చితంగా భారతీయురాలై ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతి ఇస్తారు. ఇందుకోసం వైద్యప‌ర‌మైన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దత్తత తీసుకున్న బాలిక పేరు పై కూడా ఈ ఖాతా తెరిచేందుకు సౌకర్యం ఉంది. అయితే ఒక‌రి కోసం రెండు ఖాతాలను తీసుకునేందుకు వీలు ఉండదు. బాలిక ప‌దేళ్ల వ‌య‌సు నుంచి ఖాతాను నిర్వహించుకోవచ్చు.

ధృవీకరణ పత్రాలు..

ఈ ఖాతా తెరిచేందుకు వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామ, పత్రాలతో పాటు జనన ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తెరవవచ్చు. ఈ స్కీమ్‌ మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు. ఉదాహారణకు చెప్పాలంటే 8 సంవత్సరాలు వయసున్న బాలికపై ఖాతాను ప్రారంభిస్తే అమ్మాయి 29 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకునే వీలుంటుంది.

ఒక ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అని అర్ధం. అకౌంట్‌ను ప్రారంభించేందుకు కనీస డిపాజిట్ రూ.250 అవ‌స‌రం . ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. అంతకు మించి డిపాజిట్‌ చేయరాదు. అకౌంట్‌ తెరిచిన ఏడాది నుంచి 14 సంవత్సరాల పాటు డిపాజిట్‌ చేయవచ్చు. ఒక వేళ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే మీరు రెండు ఖాతాలలో మొత్తం రూ.3 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు.

ఎలా డిపాజిట్ చేయవచ్చు..

అలాగే నగదు లేదా చెక్కు లేదా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ) రూపంలో కూడా డబ్బులను డిపాజిట్‌ చేయవచ్చు. అలాగే డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లించవచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని సార్లు అయినా డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే ఖాతాను డిఫాల్ట్ అకౌంట్‌గా పరిగణిస్తారు. ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోడానికి డిపాజిట్ మొత్తంతో పాటు రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. లక్షా 50 వేలకంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినట్లయితే ఖాతాదారుడు అదనపు మొత్తాన్ని ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అదనపు మొత్తంపై ఎలాంటి వడ్డీ చెల్లించరు.

వడ్డీ రేటు:

ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రభుత్వ స్కీమ్‌లపై వర్తించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువగా ఉంటుంది. అకౌంట్‌ తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు చేయవచ్చు. ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మీరు ఖాతాలో డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ఖాతాలో ప్రతి నెల 10 వ తేది కంటే ముందు న‌గ‌దు డిపాజిట్ చేస్తే నెలంత‌టికీ వ‌డ్డీ ల‌భిస్తుంది. ప్రతినెల 10 వ తేదీ నుంచి చివ‌రి వ‌ర‌కు ఉన్న త‌క్కువ న‌గ‌దుపై వ‌డ్డీ లెక్కిస్తారు. అందుకే 10 వ తేదీకంటే ముందే డిపాజిట్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ స్కీమ్‌పై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకే ఏ బ్యాంకులో ఖాతాను ప్రారంభించినా ఒకే విధంగా వడ్డీ రేట్లు ఉంటాయని గుర్తించుకోవాలి. మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా అంటే 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, దానిపై వడ్డీని చెల్లించరు.

సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది అనుకుంటే.. సంవత్సరానికి రూ.1000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత అంటే మెచ్యూరిటీ సమయంలో రూ. 46,800 పొందవచ్చు. అలాగే ఏడాదికి రూ. 1,50,000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల తరువాత రూ. 70,20,000 తీసుకోవచ్చు.

ఏడాదికి ఎంత డిపాజిట్‌ చేస్తే అమ్మాయికి 21 ఏళ్లు నిండిన తర్వాత ఎంత వస్తుందంటే..

► ఏడాదికి రూ.1000 డిపాజిట్‌ చేసినట్లయితే 21 ఏళ్ల తర్వాత 46,800 వస్తుంది.

► రూ.2000 డిపాజిట్‌ చేస్తే రూ. 93,600

► రూ.5000 డిపాజిట్‌ చేస్తే రూ.2,34000

► రూ. 10 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.4,68000

► రూ. 20 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.9,36000

► రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.23,40000

► రూ.1,00,000 డిపాజిట్‌ చేస్తే రూ.46,80000

► రూ.1.50,000 డిపాజిట్‌ చేస్తే రూ.70,20000 మొత్తాన్ని అందుకోవచ్చు.

ఇలా ఏడాది కాలానికి డిపాజిట్‌ చేసిన మొత్తానికి 21 ఏళ్ల తర్వాత ఇంత మొత్తాన్ని అందుకోవచ్చన్నమాట.

Gemini Internet

నెలకు రూ.12,500 డిపాజిట్‌తో రూ. 70 లక్షల బెనిఫిట్‌.. | Sukanya Samriddhi Yojana https://www.youtube.com/watch?v=M6lgfc8xZb0&ab_channel=GeminiAlertsTeluguUpdates

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...