Alerts

7, నవంబర్ 2021, ఆదివారం

Google Scholarship ఎంపికైతే రూ. 74 వేల స్టైఫండ్.

కంప్యూటర్ సైన్స్ చదివే అమ్మాయిలకు టెక్ దిగ్గజం గూగుల్ తీపి కబురు అందించింది. కంప్యూటర్‌ సైన్స్‌ను కెరీర్‌గా మలచుకోవాలని అనుకుంటున్న విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ అందించడానికి గూగుల్ తాజాగా సిద్ధమైంది. ఈ మేరకు 'జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌' ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం విద్యార్థినుల నుంచి గూగుల్ స్కాలర్‌షిప్‌ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

కంప్యూటర్ సైన్స్‌ (Computer Science)లో చ‌దివే మ‌హిళ‌ల‌కు గూగుల్ (Google) స్కాల‌ర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆసియా-పసిఫిక్ నుంచి వచ్చిన మహిళల కోసం మాత్ర‌మే ప్రారంభించారు. కాబట్టి భారతీయ విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు (Application) చేసుకోవ‌చ్చు. కంప్యూటర్ సైన్స్‌లో మహిళల (Women) కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ (Scholarship) టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అభ్యసించడానికి విద్యార్థులకు సాయం అందిస్తుంది. ఎంపికైన విద్యార్థులు 2022-2023 విద్యా సంవత్సరానికి $1000 (రూ.74191.35) విలువైన స్కాలర్‌షిప్‌లను అందుకుంటారు. ఈ స్కాల‌ర్‌షిప్ ద్వారా కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివే వారిని మ‌రింత ప్రోత్స‌హించాల‌నేది గూగుల్ ల‌క్ష్యం. ఈ స్కాల‌ర్‌షిప్ విద్యార్థి ప‌నితీరు ఆధారంగా ఇస్తారు. ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాంకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
ఎవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..
జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పొందేందుకు అర్హతలు
- ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు 2021-2022 విద్యాసంవ‌త్స‌రంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో నమోదు అయి ఉండాలి.
- ఆసియా-పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం విద్యార్థి అయి ఉండాలి.
- అభ్య‌ర్థి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా దగ్గరి సంబంధం ఉన్న సాంకేతిక రంగం విద్య‌న‌భ్య‌సిస్తూ ఉండాలి.
- మంచి అక‌డ‌మిక్ మార్కులు క‌లిగి ఉండాలి.
అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు..
- ద‌ర‌ఖాస్తు దారు విద్యా సంవ‌త్స‌రంలో టెక్నిక‌ల్‌ ప్రాజెక్ట్‌లను మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలలో అతని నేపుణ్యాన్ని తెలిపేలా రెజ్యూమ్/CVని క‌లిగి ఉండాలి.
- ప్రస్తుత లేదా (ఏదైనా ఉంటే) మునుపటి సంస్థల నుంచి అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్.
- అభ్యర్థులు రెండు 400 పదాల వ్యాసాలను కూడా సమర్పించాలి. వ్యాసాలు ఆంగ్లంలో రాయాలి.
- ఈ వ్యాసాలు ఈక్విటీ, వైవిధ్యం, చేరిక మరియు ఆర్థిక అవసరాల పట్ల అభ్యర్థి నిబద్ధత, సామ‌ర్థ్యంపై అంచనా వేస్తాయి.
ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..
Step 1 - ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
Step 2 -  ముందుగా https://buildyourfuture.withgoogle.com/scholarships/ లింక్‌లోకి వెళ్లాలి.
Step 3 - అందులో Generation Google Scholarship (Asia Pacific) లింక్‌ను ఎంచుకోవాలి.
Step 4 - ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌ల‌ను పూర్తిగా చ‌దివి Apply Now ఆప్ష‌న్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తుప్రారంభించాలి.
Step 5 - ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
సాంకేతిక విద్య‌లో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఈ స్కాల‌ర్‌షిప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యార్థుల ఎంపిక‌లో కంపెనీదే పూర్తి బాద్య‌త‌. స్కాల‌ర్‌షిప్ నేరుగా విద్యార్థి ఖాతాలో ప‌డుతాయి. ఆస‌క్తిగల విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు

Covid Scholarship Programmes 2021-22

కరోనా కారణంగా పేరెంట్స్ ను కోల్పోయిన వారికి స్కాలర్ షిప్ లు..

కరోనా(Corona) మహమ్మారి పంజాతో అనేక మంది ప్రాణాలు(Corona Death) కోల్పోయారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు ఈ మహమ్మారికి బలయ్యారు. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులను(Parents) కోల్పోయిన అనేక మంది చిన్నారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వారి చదువులు(Education) అర్థంతరంగా ఆగిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ సంస్థలు కరోనా(Corona) కారణంగా ఇంటి పెద్దలను కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాయి. వారికి స్కాలర్ షిప్(Scholarship) లు అందించనున్నట్లు ప్రకటించాయి. అలాంటి స్కాలర్ షిప్ ల వివరాలు..

1. Kotak Shiksha Nidhi:
కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా కుటుంబంలో సంపాధించే వారిని కోల్పోయిన వారికి ‘కొటక్ శిక్ష నిధి’ స్కాలర్ షిప్ ను అందిస్తోంది. మొదటి తరగతి నుంచి డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే వారు ఈ స్కాలర్ షిప్ లకు అప్లై చేసుకునేందుకు అర్హులు.
అర్హతలు:
-కరోనాతో ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన వారు లేదా ఒకరిని కోల్పోయిన వారు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు అర్హులు.
-కరోనా తో కుటుంబంలో ప్రాథమిక సంపాదన సభ్యుడిని కోల్పోయిన వారు..(తల్లిదండ్రులు కాకుండా..)
-విద్యార్థులు స్కూల్ లేదా కాలేజీకి పోయే వారు అయి ఉండాలి. వయస్సు 6 నుంచి 22 ఏళ్లు ఉండాలి.(క్లాస్ 1 నుంచి డిగ్రీ, డిప్లొమా కోర్సు)
ఆఖరి తేదీ: ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు వచ్చే ఏడాది మార్చి 31 ఆఖరి తేదీ.
అప్లికేషన్ లింక్: https://kotakeducation.org/kotak-shiksha-nidhi/

2. HDFC Bank Parivartan’s Covid Crisis Support Scholarship Programme 2021:
-HDFC బ్యాంక్ పరివర్తన్ సపోర్ట్ స్కాలర్ షిప్ కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ఈ స్కాలర్ షిప్ ను ప్రకటించింది. క్లాస్ 1 నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే వారు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు.
అర్హతలు:
-కరోనా కారణంగా తల్లిదండ్రులను, సంపాధించే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారు కూడా ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసేందుకు అర్హులు.

-అభ్యర్థులు క్లాస్ 1 నుంచి 12, డిప్లొమా, యూజీ, పీజీ చదివే వారు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు అర్హులు.
-దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉండాలి.
ఆఖరి తేదీ: ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
అప్లికేషన్ లింక్: www.b4s.in/it/CCSS1

3. Digital Bharati Covid Scholarship 2021-22
డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్‌షిప్ ను కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అందిస్తున్నారు.
ఆఖరి తేదీ: నవంబర్ 31
అప్లికేషన్ లింక్: www.b4s.in/it/DBCS1

 

Kittur Rani Channamma Residential Sainik School for Girls, Kittur Karnataka Admissions

Gemini Internet

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2021 మేనేజ్‌మెంట్ ట్రైనీ – 6 పోస్టులు www.nationalfertilizers.com చివరి తేదీ 23-11-2021



Name of Organization Or Company Name :National Fertilizers Limited


Total No of vacancies: – 6 Posts


Job Role Or Post Name:Management Trainee 


Educational Qualification:BE/ B.Tech/ B.Sc (Engg), PG (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:23-11-2021


Website: www.nationalfertilizers.com


Click here for Official Notification


ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ మేనేజ్‌మెంట్ రిక్రూట్‌మెంట్ 2021 SRF, YP II – 7 పోస్ట్‌లు www.iiwm.res.in చివరి తేదీ 26-11-2021 — వాక్ ఇన్ చేయండి



Name of Organization Or Company Name :ICAR-Indian Institute of Water Management


Total No of vacancies:– 7 Posts


Job Role Or Post Name:SRF, YP II 


Educational Qualification:Degree/ PG (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:26-11-2021 — Walk in


Website: www.iiwm.res.in


Click here for Official Notification



ఇందిరా గాంధీ రాష్ట్రీయ మానవ్ సంగ్రహాలయ రిక్రూట్‌మెంట్ 2021 మ్యూజియం అసోసియేట్, మోడలింగ్ అసిస్టెంట్, పెయింటర్, స్టెనోగ్రాఫర్ & ఇతర - 7 పోస్టులు igrms.gov.in చివరి తేదీ 21 రోజుల్లోపు


Name of Organization Or Company Name :Indira Gandhi Rashtriya Manav Sangrahalaya


Total No of vacancies: 7 Posts


Job Role Or Post Name:Museum Associate, Modelling Assistant, Painter, Stenographer & Other


Educational Qualification:---


Who Can Apply:All India


Last Date:Within 21 days from the date of advertisement (refer Noification)


Website: igrms.gov.in




NFL రిక్రూట్‌మెంట్ 2021 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II, స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్ II & ఇతర - 32 పోస్టులు www.nationalfertilizers.com చివరి తేదీ 24-11-2021



Name of Organization Or Company Name :National Fertilizers Limited


Total No of vacancies: 32 Posts


Job Role Or Post Name:Junior Engineering Assistant Grade II, Store Assistant Grade II & Other


Educational Qualification:Diploma, Any Degree, Degree (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:24-11-2021


Website: www.nationalfertilizers.com


Click here for Official Notification


Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...