Alerts

22, నవంబర్ 2023, బుధవారం

NID, ఆంధ్రప్రదేశ్ B.Des. ప్రవేశం 2024 - 25 NID, Andhra Pradesh B.Des. Admission 2024 - 25 National Institutes of Design (NID), Andhra pradesh has released the notification for admission in to four year Bachelor of Design programme in the following areas of specialization

NID, ఆంధ్రప్రదేశ్ B.Des. ప్రవేశం 2024 - 25

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి), ఆంధ్ర ప్రదేశ్ కింది స్పెషలైజేషన్ విభాగాల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


NID AP B.Des ప్రోగ్రామ్ సీట్లు: 75

NID AP B.Des ప్రోగ్రామ్ - వ్యవధి: 04 సంవత్సరాలు

NID AP B.Des ప్రోగ్రామ్ - స్పెషలైజేషన్:

  1. ఇండస్ట్రియల్ డిజైన్ ఫ్యాకల్టీ
  2. కమ్యూనికేషన్ డిజైన్ ఫ్యాకల్టీ
  3. టెక్స్‌టైల్ ఫ్యాకల్టీ
  4. దుస్తులు
  5. జీవనశైలి & అనుబంధ డిజైన్
  6. సిరామిక్ & గ్లాస్ డిజైన్.

NID AP B.Des ప్రోగ్రామ్ - అర్హత: ఏదైనా స్ట్రీమ్‌లో 10+2 లేదా తత్సమానం

NID AP B.Des ప్రోగ్రామ్ దరఖాస్తు రుసుము

వర్గం

దరఖాస్తు రుసుము (1 క్రమశిక్షణ మాత్రమే)

దరఖాస్తు రుసుము (2 క్రమశిక్షణ మాత్రమే)

 

జనరల్, జనరల్-EWS & OBC-NCL

రూ.3,000

రూ.4,500

SC, ST, PwD

రూ.1,500

రూ.2,500

ఓవర్సీస్ (సూపర్‌న్యూమరీ)

రూ.5000

రూ.75000

 

NID AP B.Des ప్రోగ్రామ్ - ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు

NID AP B.Des ప్రోగ్రామ్ - ముఖ్యమైన తేదీలు:

ఈవెంట్స్

తేదీలు

దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ

డిసెంబర్ 01, 2023

అప్లికేషన్ ఫారమ్‌లను సవరించడానికి విండో

డిసెంబర్ 05, 2023 నుండి డిసెంబర్ 07, 2023 వరకు

DAT ప్రిలిమ్స్ కోసం అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయండి

డిసెంబర్ 12, 2023

డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రిలిమ్స్ తేదీ

డిసెంబర్ 24, 2023

 

మరిన్ని వివరాల కోసం, దయచేసి సందర్శించండి: https://admissions.nid.edu/NIDA2024/download/BDes_AdmissionsHandbook2024-25.pdf

చివరి తేదీ
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

EMRS: 10,391 ఉద్యోగాల పరీక్ష తేదీలు వెల్లడి * నెస్ట్స్‌ కీలక ప్రకటన

EMRS: 10,391 ఉద్యోగాల పరీక్ష తేదీలు వెల్లడి

* నెస్ట్స్‌ కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలు వెల్లడయ్యాయి. డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌ జరగనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌/ టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ కానున్నాయి. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ద్వారా భర్తీకానున్న ఖాళీల వివరాలు...

 


ఉద్యోగం                 ఖాళీలు
ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)           5,660
హాస్టల్ వార్డెన్ (పురుషులు)              335
హాస్టల్ వార్డెన్ (మహిళలు)              334
ప్రిన్సిపల్                  303
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ)          2,266 
అకౌంటెంట్                  361
జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్          759
ల్యాబ్‌ అసిస్టెంట్‌              373
మొత్తం ఖాళీలు             10,391

   వెబ్‌సైట్‌   

 


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

SBI Jobs: ఎస్‌బీఐలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు అర్హతలు: వయోపరిమితి: జీత భత్యాలు: ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు రుసుము: ముఖ్యమైన తేదీలు…లాంటి వివరాలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

SBI Jobs: ఎస్‌బీఐలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు 

ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్‌ సెంటర్‌… దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ సర్కిళ్లు: అహ్మదాబాద్, అమరావతి, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, నార్త్‌ ఈస్ట్రన్‌, హైదరాబాద్, జైపుర్, లఖ్‌నవూ, కోల్‌కతా, మహారాష్ట్ర, ముంబై మెట్రో, న్యూదిల్లీ, తిరువనంతపురం.

వివరాలు:

సర్కిల్ బేస్డ్ ఆఫీసర్: 5,447 పోస్టులు(రెగ్యులర్ ఖాళీలు- 5,280; బ్యాక్‌లాగ్ ఖాళీలు- 167)

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.  

వయోపరిమితి: 31-10-2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.36,000-రూ.63,840.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). 

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.11.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2023.

అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: జనవరి 2024.

ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి 2024.


Important Links

Posted Date: 21-11-2023

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html


Lawcet: లాసెట్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తు గడువు పొడిగింపు * నవంబర్‌ 30న సీట్లు కేటాయింపు

Lawcet: లాసెట్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

* నవంబర్‌ 30న సీట్లు కేటాయింపు


లాసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలనకు దరఖాస్తు గడువును నవంబర్‌ 23వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన గడువు మంగళవారం(నవంబర్‌ 21)తో ముగిసింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ విద్యార్థుల బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థుల వినతి మేరకు రెండు రోజులు పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్‌ 30న సీట్లు కేటాయిస్తారు. డిసెంబరు 4 నుంచి తరగతులు మొదలవుతాయని లాసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య పి.రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం వరకు ఎల్‌ఎల్‌బీ 3, 5 సంవత్సరాలతోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు సుమారు 13 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆ మూడు కోర్సుల్లో సుమారు 8 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎంఈడీ, ఎంపీఈడీ చివరి విడత కౌన్సెలింగ్‌ గడువు 23

ఎంఈడీ, ఎంపీఈడీ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) సీట్ల భర్తీకి సీపీగెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ కాలపట్టికను కన్వీనర్‌ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి మంగళవారం(నవంబర్‌ 21) ప్రకటించారు. నవంబర్‌ 23వ తేదీ వరకు సీపీగెట్‌లో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి నవంబర్‌ 26న సీట్లు కేటాయిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

  


\-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నేటి నుంచి వృత్తి విద్యా నైపుణ్యంపై శిక్షణ తరగతులు

నేటి నుంచి వృత్తి విద్యా నైపుణ్యంపై శిక్షణ తరగతులు
కొడిగెనహళ్లి (పరిగి): మండల పరిధిలో కొడిగెనహళ్లి పంచాయతీలోని సేవా మందిర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహికులైన నిరుద్యోగులకు వృత్తి విద్యా నైపుణ్యంపై బుధవారం నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామని సంస్థ కార్యదర్శి కె.టి. సరిత ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, పేపర్, జూబ్బ్యాగుల తయారీ, హెర్బల్ షాంప్ లు, ఫౌడర్లు, మిల్లెట్ మాల్ట్ గోవు ఆధారిత వస్తువుల తయారీ, తేనెటీగల పెంపకం, ఎలక్ట్రిషియన్, ప్లంబరింగ్పై శిక్షణ తరగతులు ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు చరవాణి నెంబర్లు 79891 10294, 93924 92324లకు సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.

JEE Mains జేఈఈ-మెయిన్‌-2024 సన్నద్ధత | విజయానికి ఇవే ప్రధానం...

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

విజయానికి ఇవే ప్రధానం!

జేఈఈ మెయిన్‌ - 2024 మొదటి సెషన్‌ను జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీల మధ్య నిర్వహించనున్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారి సౌలభ్యం కోసం విద్యా సంవత్సరం మొదటిలోనే ప్రవేశ పరీక్షల సిలబస్‌ను ప్రకటిస్తుంటారు. కానీ పరీక్షకు కేవలం రెండు నెలల ముందే జేఈఈ-మెయిన్‌ 2024 సిలబస్‌ను వెల్లడించారు. అయితే సిలబస్‌ను కొంతమేరకు తగ్గించడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం.



జేఈఈ-మెయిన్‌-2024 సన్నద్ధత

జేఈఈ మెయిన్‌ - 2024 మొదటి సెషన్‌ను జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీల మధ్య నిర్వహించనున్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారి సౌలభ్యం కోసం విద్యా సంవత్సరం మొదటిలోనే ప్రవేశ పరీక్షల సిలబస్‌ను ప్రకటిస్తుంటారు. కానీ పరీక్షకు కేవలం రెండు నెలల ముందే జేఈఈ-మెయిన్‌ 2024 సిలబస్‌ను వెల్లడించారు. అయితే సిలబస్‌ను కొంతమేరకు తగ్గించడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం. ఈ సందర్భంగా జేఈఈ మెయిన్‌లో ఆశించిన ర్యాంకు తెచ్చుకోవాలంటే ఎలాంటి కృషి చేయాలి? తెలుసుకుందాం!  

సిలబస్‌కు అనుగుణంగానే ప్రశ్నపత్రాలు రూపొందించి నిర్వహిస్తే ఫలితం ఉంటుంది. లేకపోతే మారిన కొత్త సిలబస్‌ వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే..జేఈఈ మెయిన్‌ను ఈ సంవత్సరం రెండు సెషన్స్‌లో సెషన్‌కు 5 రోజులు, రోజుకు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. అంటే ఈ పరీక్షకు సుమారు 20కి పైన విభిన్న ప్రశ్నపత్రాలు అందజేస్తూ.. మారిన సిలబస్‌కు అనుగుణంగా నిర్వహించడం.. కత్తి మీద సాము లాంటిదే!
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లతో పోల్చుకుంటే  కెమిస్ట్రీ నుంచి కాస్త ఎక్కువగానే అధ్యాయాలను తొలగించారు. ఇది విద్యార్థులకు చాలా ఉపశమనమే. ఇదే మాదిరిగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా కెమిస్ట్రీలో సిలబస్‌ తగ్గిస్తే చాలా భారం తగ్గుతుంది. ఇంతవరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 సిలబస్‌ గురించి ఎటువంటి విషయం తెలియకపోవడంతో కాస్త అయోమయ స్థితి ఏర్పడింది. గత సంవత్సరం వరకూ జేఈఈ-మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌లు రెండూ ఒకటే కావడంతో విద్యార్థులు ఎలాంటి గందరగోళం లేకుండా ప్రిపేర్‌ అయ్యారు. దీనిపై కూడా త్వరలోనే స్పష్టత వస్తుందని భావిద్దాం.
‘పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం’ అని మహాత్మాగాంధీ చెప్పినట్టు జాతీయ స్థాయి పరీక్షల్లో మినహాయింపుల్లేకుండా సన్నద్ధం కావాలి. జేఈఈ సిలబస్‌లో జరిగిన మార్పులకు తగ్గట్టుగా చదివే పంథాను మార్చుకోవాలి. నిర్మాణాత్మక ప్రణాళిక, సమర్థ వ్యూహాలతో జేఈఈ-మెయిన్‌లో విజయావకాశాలను పెంచుకోవచ్చు.

పరీక్ష సరళిని అర్థం చేసుకోండిజేఈఈ-మెయిన్‌

2023 మాదిరిగానే జేఈఈ మెయిన్‌-2024ను నిర్వహిస్తున్నారు. ప్రశ్నల సంఖ్య, వాటి మార్కులు, రుణాత్మక మార్కులు, ఛాయిస్‌ వంటివన్నీ జేఈఈ-మెయిన్‌-2023 మాదిరిగానే ఉంటాయి. అంటే.. ప్రతి సబ్జెక్టులోని రెండో సెక్షన్‌లో వచ్చే న్యూమరికల్‌/ఇంటిజర్‌ టైప్‌ తరహా ప్రశ్నలకు మాత్రమే ఛాయిస్‌ ఉంది. మొదటి సెక్షన్‌లోని స్ట్రెయిట్‌ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఛాయిస్‌ లేదు.

స్టడీ మెటీరియల్‌

2019 నుంచి 2023 వరకు 95 శాతం ప్రశ్నలు కెమిస్ట్రీలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ఇస్తున్నారు. అలాగే ఫిజిక్స్‌లో కూడా సుమారు 75 శాతం ప్రశ్నలు యథాతథంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ఇస్తున్నారు. మ్యాథ్స్‌ అయినా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అయినా ఎన్‌సీఈఆర్‌టీలోని అంశాలపైనే ఉంటాయి. కానీ ఎక్కువ సమస్యల సాధన నిమిత్తం మీరు తీసుకునే కోచింగ్‌ సంస్థల స్టడీ మెటీరియల్‌నే అనుసరించవచ్చు.

పట్టులేనివాటికి ప్రాధాన్యం

ఇది విద్యార్థులను బట్టి మారుతుంది. ముఖ్యంగా అందరూ స్టేట్‌మెంట్‌-1, స్టేట్‌మెంట్‌-2 లేదా అసర్షన్స్‌ అండ్‌ రీజన్స్‌ తరహా ప్రశ్నల్లో తప్పు చేస్తున్నారు. అంతే కాదు, ప్రతి సబ్జెక్టులో కొన్ని ముఖ్యమైన స్టాండర్డ్‌ ఫార్ములాలుంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం. పరీక్ష హాల్లో వాటిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే సమయం వృథా అవుతుంది. మీ బలమైన అంశాలపై అంటే మీకు బాగా పట్టున్న అంశాలపై ప్రశ్నలు వస్తే తప్పు చేయవద్దు.

రెగ్యులర్‌ ప్రాక్టీస్‌, పాత ప్రశ్నపత్రాలు

ప్రశ్నపత్రాల విశ్లేషణను బట్టి- ప్రతి సబ్జెక్టులో 40 శాతం ప్రశ్నలు డైరెక్టుగా ఫార్ములా బేస్డ్‌, 40 శాతం ప్రశ్నలు పాత ప్రశ్నపత్రాల నుంచి, 10 శాతం ప్రశ్నలు పాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోని స్ట్ర్టెయిట్‌ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, 5 శాతం ప్రశ్నలు కాస్త ఎక్కువ సమయం పట్టేవి, మిగిలిన 5 శాతం ప్రశ్నలు కాస్త కొత్త పదాలను ఉపయోగించి అడిగే ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి క్రమం తప్పకుండా పాత ప్రశ్న  పత్రాలన్నీ సాధన చేయడం ఎంతైనా మంచిది.

మాక్‌ టెస్ట్‌లు

ఇవి ఎన్ని రాస్తే అంత మంచిది. దీనివల్ల టైమ్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన పెరుగుతుంది. మీరు తరచూ చేసే తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడటానికి దోహదం చేస్తాయి. ఇప్పటినుంచీ కనీసం రెండు రోజులకు ఒక మాక్‌ టెస్ట్‌ సాధన చేయడం మేలు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఈ మాక్‌ టెస్టులను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

ఆరోగ్య సంరక్షణ

అన్నిటికన్నా ఇది చాలా ముఖ్యం. సమయానికి సరైన పోషకాహారం తీసుకోవడంతోపాటు తగినంత వ్యాయామం, నిద్ర మిమ్మల్ని చాలా చురుగ్గా ఆలోచించేలా చేస్తాయి. వీటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు.
 

జేఈఈ మెయిన్‌ 2023 ఆలిండియా ర్యాంక్స్‌  vs (  పర్సంటైల్‌ స్కోర్స్‌

జేఈఈ మెయిన్‌ 2023లో రెండు సెషన్లు నిర్వహించిన అనంతరం వాటిని క్రోడీకరించి ప్రకటించిన ఆల్‌ ఇండియా ర్యాంకులూ, సాధించినవారి పర్సంటైల్స్‌ కింది పట్టికలో ఉన్నాయి. సుమారుగా ఇదేవిధంగా జేఈఈ మెయిన్‌-2024 చివరి ఫలితాలు ఉండొచ్చు. ప్రాథమికంగా ఒక అంచనా కోసం ఈ పట్టికను  ఉపయోగించుకోవచ్చు.

సలహాలు - సందేహ నివృత్తి

ఏ సబ్జెక్టు ప్రిపేర్‌ అయినా అందులోని అంశాలను పద్ధతి ప్రకారం సన్నద్ధం కావాలి. పూర్తి అవగాహన రాకపోతే అధ్యాపకుల సలహాలతో సందేహ నివృత్తి చేసుకోండి. మీ సన్నద్ధత అంతటా సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. ప్రేరణ కోల్పోకుండా మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోండి.

పరీక్ష రోజు

పరీక్ష రోజున మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత బాగా రాస్తారు. ఎంత చదివారన్నది కాదు.. ఎంత బాగా రాశారన్నదే ముఖ్యం. మీ ప్రిపరేషన్‌లో నిజాయతీ ఉంటే 90 శాతం ప్రశ్నలు మీరనుకున్నవే ప్రతి పేపర్లో ఉంటారయని నమ్మండి. ఎటువంటి పరిస్థితిలోనూ తెలిసిన ప్రశ్నను తప్పు చేయొద్దు.
జేఈఈ మెయిన్‌ ప్రిపరేషన్‌, ఇతర పరీక్షల అధ్యయనాల మధ్య సమతుల్యతను పాటించండి. నిలకడ కలిగిన స్మార్ట్‌ ప్రిపరేషన్‌ ముఖ్యమని గుర్తించండి. ఇవన్నీ పాటిస్తే ఇక అంతిమ విజయం మీదే.
 


గమనించండి!

  • మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో జేఈఈ మెయిన్‌-2024 కోసం ప్రత్యేకంగా తొలగించిన అంశాలన్నీ ఏపీ, టీఎస్‌ ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో ఉన్నాయి.  
  • అందులోనూ తొలగించిన ఆ భాగాల నుంచి ప్రశ్నలు కూడా ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షల్లో తప్పకుండా వస్తాయి. అందువల్ల జేఈఈ-మెయిన్‌ కోసం మాత్రమే సన్నద్ధమయ్యే విద్యార్థులు, తొలగించిన ఆయా అంశాలను బోర్డు పరీక్షల స్థాయిలో సన్నద్ధం కావడం మంచిది.
  • జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు కూడా జేఈఈ-మెయిన్‌లో తొలగించిన అంశాలపై పట్టు సాధించాలి. మరీ ముఖ్యంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లలో జేఈఈ-మెయిన్‌లో తొలగించిన అంశాల ప్రభావం జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఎంతమాత్రం చూపించదు.
  • జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2024 సిలబస్‌ కూడా ప్రకటించిన తర్వాత మనకు పూర్తిగా అర్థమవుతుంది. అంతవరకు జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2023ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Internships Work From Home వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
హ్యాపీమైండ్‌

1. సైకాలజీ (మార్కెటింగ్‌)
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023
అర్హతలు: సైకాలజీ (మార్కెటింగ్‌) నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/d92531
2.ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023
internshala.com/i/0dc7ea 
ఫిజిక్స్‌ కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: హజ్‌టెన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఫిజిక్స్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌, టీచింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/e143f2
ఆర్కిటెక్చర్‌
సంస్థ: డిజిప్లస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.25,000-30,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023
అర్హతలు: 3డిఎస్‌ మ్యాక్స్‌, అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ రెవిట్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
internshala.com/i/d8e45a
డిజిటల్‌ మార్కెటింగ్‌ (మెమె అండ్‌ కరౌసెల్‌ మేకింగ్‌)
సంస్థ: లాటెక్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023 అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎస్‌ఈఎం, ఎస్‌ఈఓ, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/ab1a61
గ్రాఫిక్‌ డిజైన్‌
సంస్థ: ఆంత్రోఫిట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కో
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా నైపుణ్యాలు
internshala.com/i/36dd0b
జనరల్‌ మేనేజ్‌మెంట్‌
సంస్థ: అడోర్‌ ఎర్త్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం
internshala.com/i/5d52e9
యూఐ/యూఎక్స్‌ డిజైన్‌
సంస్థ: రాధికా కపూర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వెబ్‌ఫ్లో, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/69dea7
టాలెంట్‌ అక్విజిషన్‌
సంస్థ: టాప్‌హైర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం
internshala.com/i/611852

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...