CBSE Single Girl Child Scholarship 2025: Eligibility, Renewal & Key Dates for Class 11/12 Students (Deadline Oct 23) సీబీఎస్‌ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2025: 11/12వ తరగతి విద్యార్థినులకు అర్హతలు, రిన్యువల్ వివరాలు, ముఖ్య తేదీలు (చివరి గడువు అక్టోబర్ 23)
📰 CBSE Scholarship: సీబీఎస్‌ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు ప్రారంభం తెలుగు వార్తా కథనం ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులకి ఏకైక సంతానంగా ఉన్న ప్రతిభావంతులైన బాలికలకు ప్రోత్సాహకరంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రత్యేక స్కాలర్‌షిప్ అందిస్తోంది. "సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్" పేరుతో ఇచ్చే ఈ అవార్డు కోసం 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న విద్యార్థినులు అక్టోబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్ పొందుతున్న వారు రిన్యువల్‌కు కూడా అర్హులు. 📌 అర్హతలు & ముఖ్యాంశాలు 10వ తరగతి పరీక్షల్లో కనీసం 70% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11 లేదా 12వ తరగతి చదువుతూ ఉండాలి. ఎంపికైన వారికి ప్రతి నెలా ₹1000 చొప్పున రెండు సంవత్సరాలు చెల్లిస్తారు. ఈ మొత్తం నేరుగా విద్యార్థినుల ఖాతాలో జమ అవుతుంది. 10వ తరగతిలో నెలసరి ట్యూషన్ ఫీ...