📰 భార్య కాపురానికి రాలేదని రైలు కింద పడి ఆత్మహత్య | Man Commits Suicide by Jumping Under a Train as Wife Refuses to Return
📰 భార్య కాపురానికి రాలేదని రైలు కింద పడి ఆత్మహత్య **తెలుగు వార్తా కథనం** **హిందూపురం (న్యూస్‌టుడే):** భార్య కాపురానికి రావడానికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వేకువజామున హిందూపురంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఎంజీఎం పాఠశాల సమీపంలో బి. సంపత్ (35) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు. వివరాల్లోకి వెళితే, హిందూపురం పట్టణం, నేతాజీనగర్‌కు చెందిన సంపత్ తాపీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే, సంపత్ రోజువారీ సంపాదనతో మద్యం తాగి జల్సా చేస్తుండేవాడు. ఏడాది క్రితం పనికి వెళ్లగా అతని చెయ్యి విరిగింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ మద్యం కోసం డబ్బులు లేక భార్యతో గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి కాపురానికి రావాలని సంపత్ పెద్దమనుషుల ద్వారా పంచాయతీ పెట్టించగా, అతను మద్యం మానేస్తేనే వస్తానని ఆమె స్పష్టం చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంపత్, గురువారం వేకువజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే హెడ్ కానిస్ట...