వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కోవిడ్ వారియర్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
13 జిల్లాల్లోని 271 మెడికల్ కళాశాలలు/డెంటల్/యునాని/ఆయుర్వేద/నర్సింగ్ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు.
ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకుంటాం.
వలంటీర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లలో ప్రాధాన్యం ఇస్తాం.
వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్గినవారు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. health.ap.gov.in/CVPASSAPP/Covid/Volunteerjobs
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి