14, ఏప్రిల్ 2020, మంగళవారం

ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును పొడిగించింది.
Education News
కొన్నింటిని ఈనెల 30 వరకు, కొన్ని పరీక్షలకు వచ్చే నెల 15, 16, 31 తేదీల వరకు గడువును పెంచింది.
  • మార్చి 31తో ముగిసిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జేఈఈ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించారు.
  • ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్‌డీ, ఎంబీఏ ప్రవేవేశాలకు నిర్వహించాల్సిన అడ్మిషన్ టెస్టు దరఖాస్తుల స్వీకరణ గడువు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు కూడా ఈనెల 30 వరకు పొడిగించారు.
  • యూజీసీ నెట్ (జూన్) దరఖాస్తుల గడువును మే 16కి పొడిగించారు.
  • సీఎస్‌ఐఆర్ నెట్ దరఖాస్తుల గడువు మే 15కి, ఆల్‌ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టు (ఏఐఏపీజీఈటీ) దరఖాస్తు గడువును మే 31కి పెంచారు. 
Source Link https://www.sakshieducation.com/TeluguStory.aspx?cid=2&sid=115&chid=794&tid=0&nid=262399

కామెంట్‌లు లేవు: