Alerts

--------

14, ఏప్రిల్ 2020, మంగళవారం

కలినరీ ఆర్ట్స్‌ (పాకశాస్త్రంలో) కోర్సులు Culinary Courses Admissions

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 27, 2020.
పరీక్ష తేదీ: మే 16, 2020.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: తిరుపతిలో ఉంది.
వెబ్‌సైట్‌: http://www.ici.nic.in

BBA Application Link http://thims.gov.in/IMSApplyOnline.htm

MBA Application Link  http://thims.gov.in/IMSApplyOnline.htm

బీబీఏ
సీట్లు: నోయిడా, తిరుపతి ఒక్కో క్యాంపస్‌లో 120 చొప్పున ఉన్నాయి.
విద్యార్హత: 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం. ఇంటర్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 1, 2020 నాటికి 22 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష విధానం: ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో ఒక్కోదాని నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు.
ఎంబీఏ
సీట్లు: ఒక్కో సంస్థలో 30 చొప్పున ఉన్నాయి
అర్హత: బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా కలినరీ ఆర్ట్స్‌ లేదా హాస్పిటాలిటీ కోర్సులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం. ఆఖరు సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
వయసు: ఆగస్టు 1, 2020 నాటికి 25 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష తీరు: ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్‌, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ విభాగాల్లో ఒక్కోదాని నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు
తిరుపతి, నోయిడా రెండు క్యాంపస్‌ల్లోనూ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులూ ఉన్నాయి. డిప్లొమాలో 18 నెలల వ్యవధితో ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఎఫ్‌ అండ్‌ బీ సర్వీస్‌, బేకరీ అండ్‌ కన్ఫెక్షనరీ కోర్సులు అందిస్తున్నారు. సర్టిఫికెట్‌ విభాగంలో 6 నెలల వ్యవధితో ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఎఫ్‌ అండ్‌ బీ సర్వీస్‌ క్రాఫ్ట్‌ కోర్సులు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు జూన్‌ 18 లోగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.
Source Link http://www.eenadupratibha.net/Pratibha/onlineDesk/topstories/indian-culinary-institute.html

కామెంట్‌లు లేవు:

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...