18, ఏప్రిల్ 2020, శనివారం

Central Ground Water Board 62 Job Notification 2020


సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుండి 62 ఉద్యోగాల భర్తీ

 


సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుండి 62 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొదట 3 సంవత్సరాలకు గాను టెంపరరీ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ  పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు సౌత్రన్ రీజియన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ25 ఏప్రిల్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 62 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

యంగ్ ప్రొఫెషనల్స్48
కన్సల్టెంట్స్14

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (MSc/MS/M.Tech/MScTech చేసి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

యంగ్ ప్రొఫెషనల్స్ పోస్ట్ లకు 30 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి మరియు కన్సల్టెంట్ పోస్టులకు 65 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

జీతం:

పోస్ట్ ను బట్టి 45, 000 నుండి 1, 00, 000 వరకు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు వారు దరఖాస్తు చేసుకునే రీజియన్ ను బట్టి సంబంధిత ఆఫీస్ నందు తమ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. సౌత్ రీజియన్ కు చెందిన అభ్యర్థులు సౌత్ రీజియన్ యొక్క ఆఫీస్ హైదరాబాద్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించవలసిన ఫీజు:

ఇంటర్వ్యూకు హాజరు కావడానికి / జాయిన్ అవ్వడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

కామెంట్‌లు లేవు: