RRB NTPC Latest Update 2020 రైల్వే NTPC పై వచ్చిన ముఖ్యమైన ప్రకటన
రైల్వే NTPC పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటన:
RRB NTPC పరీక్ష కోసం చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పరీక్ష ఇప్పటిలో జరిగే విధముగా కనిపించడం లేదు ఎందుకంటే RRB NTPC ఎగ్జామ్స్ నిర్వహించడానికి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల నుంచి RRB టెండర్లు ఆహ్వనించిన సంగతి తెలిసింతే. లాక్‌డౌన్ కారణంగా ఈ టెండర్ ప్రక్రియ వాయిదా వెయ్యడం జరిగింది. Covid -19 కారణంగా నివారణ చర్యలలో భాగంగా కోజింగ్,ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్,ఒపెనింగ్ తేదీలను సవరిస్తున్నట్లు RRB ప్రకటించడం జరిగింది.
కావున టెండర్ ప్రక్రియ పూర్తి అయితే తప్ప పరీక్ష నిర్వహించడానికి లేదు. అయితే ఇప్పటి లో పరీక్ష నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. కావున పరీక్ష నిర్వహణకు 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.మరితం తెలుసుకోండి:
రైల్వే ఎన్‌టిపిసి (ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి), గ్రూప్ డి (ఆర్‌ఆర్‌బి గ్రూప్ డి) నియామక పరీక్షల్లో మరింత ఆలస్యం జరగవచ్చు.ఎన్‌టిపిసి, గ్రూప్ డి రైల్వేలలో అతిపెద్ద నియామకాలు, ఈ పరీక్షల ద్వారా 35 వేలు మరియు, 1 లక్ష పోస్టులకు పైగా నియామకాలు జరగాలి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సీనియర్ అధికారి ఒక సంభాషణలో మాట్లాడుతూ, “రైల్వే ప్రస్తుతం పరీక్షను నిర్వహించడానికి ఏజెన్సీని నియమించే పనిలో ఉంది.
ఏజెన్సీ నియామకం ఇంకా పూర్తి కాలేదు, కాని త్వరలో ఏజెన్సీ నియామకం పూర్తవుతుంది. RRB NTPC and Group D latest Update 2020
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మార్చిలో ఈ నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. మొదట ఎన్‌టిపిసి లేదా గ్రూప్ డిలో ఏ పరీక్ష జరుగుతుందో నిర్ణయించబడలేదు అని చెప్పడం జరుగుతుంది.
ఎన్‌టిపిసి మరియు గ్రూప్ డి పరీక్ష తేదీలు జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల అవుతాయని భావిస్తున్నాము.
ఎన్‌టిపిసి 35,208 పోస్టుల నియామకానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఫిబ్రవరి 28 న నోటిఫికేషన్ జారీ చేసిందని.
ఈ పోస్టులకు 1 కోట్ల 26 లక్షల 30 వేల 885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్‌లో, పరీక్షా తేదీ జూన్ నుండి సెప్టెంబర్ 2019 మధ్య ఉంటుంది అని వ్రాయబడినది. అయితే, అక్టోబర్ 15 న బోర్డు నోటీసు జారీ చేసి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అదే సమయంలో, గ్రూప్ డి గురించి మాట్లాడుతూ, ఇది ఇప్పటివరకు రైల్వేలో అతిపెద్ద నియామకం మరియు దీని కింద 1 లక్ష 3 వేల 769 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. 1 కోట్ల 15 లక్షల 67 వేల 248 మంది అభ్యర్థులు నియామకాలకు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-డి పరీక్ష తేదిలపై అనేకమైన ప్రటనలు విడుదల అవుతున్నాయి. కాని రైల్వే అధికారికవెబ్‌సైట్ లో వచ్చినప్పుడు మాత్రమే అభ్యర్థులు నమ్మవలసి ఉంటుంది.
కామెంట్‌లు