వార్తల్లో నేటి హిందూపురం
జిల్లాలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు ఇందులో తనకల్లుకు చెందిన మహిళ, ఓబుళదేవర చెరువు మండలం గాజుకుంట పల్లికి చెండిన మరో మహిళ, హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఒక మహిళ, మేళాపురానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. కరోనా నియంత్రణ విషయమై ఎవ్వరు కూడా హిందూపురం వాసులను రానివ్వకూడదని హిందూపురానికి వెళ్ళకూడదని కర్ణాటక మరియు దాని సరహద్దు గ్రామాలలో చాటింపులు వేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలీసు శాఖకు సూచనలిస్తూ మరింత అప్రమత్తం చేశారు ఎస్పీ సత్య యేసు బాబు. మన ఊరి పేరును నిలబెట్టాలి రా అని ఇంటిలో వారు చిన్నప్పుడు చెప్పుంటారు దానిని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నట్టున్నారు హిందూపురం వాసులు.
పాత పద్దతి ప్రకారం నేటి నుండి 4వ విడత ఉచిత రేషన్ ను ఈ నెల 27 వరకు ఇవ్వనున్నారు ఇందులో బియ్యం పప్పుశెనగ వంటి వస్తువులు ఉంటాయి. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
డి ఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబరు 3 వ తేదీ నుండి ప్రారంభం అదే నెల 8వ తేదీవరకు వరుసగా ఆరు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
టెన్త్ పరీక్షలు మార్కుల నమూనా పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం. 4 పేపర్ల నమూనాలను ఎస్సెస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. మిగిలిన పేపర్లని కూడా త్వరలో వెబ్ సైట్ లో చూడొచ్చు. మరింత సమాచారం కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్.బ్లాగ్స్పాట్.కామ్ ను చూడొచ్చు.
వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3వ తేదీన. జూన్ 3 మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
2018-19 బ్యాచ్ కి చెందిన కన్వీనర్ కోటా అభ్యర్థులకు, ఒక సారి ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. మార్కుల మెమోలకు బి ఎస్ ఇ ఎ పి.ఓ ఆర్జీ లో చూడొచ్చు.
జి ఎస్ టి ఆర్ 1 గడువు పెంపు ఏడాదికి 1.5 కోట్ల టర్నోవర్ కలిగిన వారు ఏప్రిల్ లో గా సమర్పించాల్సిన జి ఎస్ టి ఆర్ 1 ఫారాలను జూన్ లో, జులైలో సమర్పించాల్సిన ఫారాలను సెప్టెంబరులో సమర్పించవచ్చు.
యుజిసి నెట్ సి ఎస్ ఐ ఆర్ నెట్, జె ఎన్ యూ ఇ ఇ, ఐ సి ఎ ఆర్ నెట్ దరఖాస్తు గడువులను ఈ నెల 31 వరకు పెంచారు.
2008 డి ఎస్సీ మెరిట్ జాబితాలో ఉండి పోస్టులు పొందలేకపోయిన అభ్యర్థులకు
21230 రూపాయలతో కాంట్రాక్ట్ టీచర్లుగా అవకాశం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం.
వీరిలో 4579 మంది బి ఇడి 78 మంది డి ఇడి అభ్యర్థులు కలిపి 4657 మందికి
ఉన్నారు అనంతపురం జిల్లాకు సంబంధించి 641 మంది ఉన్నారు. అయితే వీరిలో కొంత
మంది ఇప్పటికే తరువాతి డి ఎస్సీలో, మరి కొందరు ఇతర ప్రభుత్వోద్యోగాలను
సంపాదించారు. మిగిలిన వారిలో ఎంత మంది కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేయడానికి
ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోనున్నారు. అనంతపురం జిల్లా అభ్యర్థులు ఈ నెల
17వ తేదీలోపు తమ ఆసక్తిని డి ఇ ఓ అనంతపురం వెబ్ సైట్ లో తెలపాలన్నారు
తెలియజేయాలని డి ఇ ఓ శామ్యూల్ శుక్రవారం తెలిపారు. ఎస్ జి టీ తెలుగు కామన్
మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలు జిల్లా వెబ్ సైట్ లో ఉంచామన్నారు.
ఒంగోలు జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్త్ పద్దతిలో సైకియాట్రిస్ట్, నర్సులు, వార్డు బాయ్స్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు చివరి తేది మే 19.
గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సైక్రియాటిట్స్ లేదా ఎం బి బి ఎస్ డాక్టర్, నర్సులు, వార్డు బాయ్స్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు చివరి తేది మే 20.
కామెంట్‌లు