16, మే 2020, శనివారం

🔳కొలువు చూపే కొత్త డిగ్రీ, విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌, ఉద్యోగ శిక్షణ


పాఠ్యాంశాలు ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి
ఈనాడు - అమరావతి

కొలువు చూపే కొత్త డిగ్రీ

కొత్త విద్యా సంవత్సరం(2020-21) నుంచి డిగ్రీ విద్యలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మూడేళ్ల కోర్సులో విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ఉన్నత విద్యామండలి అప్రెంటిస్‌షిప్‌ విధానం, ఉద్యోగ నైపుణ్య శిక్షణ వంటివి చేర్చింది. ఆ మేరకు మార్చిన కొత్త పాఠ్యాంశాలు జూన్‌ నాటికి అందుబాటులోకి రానున్నాయి.

కొత్తగా ఇలా..


అప్రెంటిస్‌షిప్‌లో నైపుణ్యాభివృద్ధి, జీవన నైపుణ్యాల సబ్జెక్టులు ఉంటాయి. వీటిల్లో ప్రతి సెమిస్టర్‌కు ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో ఏడాదిలో రెండేసి నెలలను ‘అప్రెంటిస్‌షిప్‌’గా పిలుస్తారు. ఇందుకు సెలవుల్లో సమయం ఇస్తారు. చివరి ఏడాది ఆరు నెలల శిక్షణను ‘ఉద్యోగ నైపుణ్య శిక్షణ’గా పిలవనున్నారు.

నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టులు

* బీఏ: డేటా ఎనలిటిక్స్‌, పబ్లిక్‌ స్పీచ్‌, బడ్జెట్‌ తయారీ, కార్యాలయ ప్రాసెస్‌, పర్యాటక గైడెన్స్‌, సర్వే, రిపోర్టింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, జర్నలిజం.
* బీకాం: పర్యాటకం, చిల్లర వర్తకం, జీఎస్టీ, వాణిజ్య విశ్లేషణ.
* బీఎస్సీ: వైద్య ప్రయోగశాల సాంకేతికత, ఆక్వా, మత్స్య, బయోలజీ ప్రయోగశాల సాంకేతికత, ఫుడ్‌ అడల్‌ట్రేషన్‌.

Ad

జీవన నైపుణ్య సబ్జెక్టులు

* మానవ విలువలు, వృత్తి నైతికత,
* కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, * స్టాటిస్టిక్స్‌,
* ఇండియన్‌ కల్చర్‌, సైన్సు,
* ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ,
* ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌,
* ఎనటికల్‌ నైపుణ్యం, * పర్సనాలిటీ ఎన్‌హాన్స్‌, లీడర్‌షిప్‌, ‌* హెల్త్‌ ‌* పర్యావరణ విద్య.


* కొత్త పాఠ్యాంశాలపైఅధ్యాపకులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సాయంతో శిక్షణ ఇవ్వనున్నారు.

కామెంట్‌లు లేవు: