హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 22-05-2020
హిందూపురంలో బర్గర్ పెయింట్స్, ఫార్మా, స్టీల్ పరిశ్రమల్లో తక్కువ మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించారు. ఇలా మరిన్ని పరిశ్రమలు ప్రారంభించే వారు apindustries.gov.in వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సుదర్శన్ బాబు తెలిపారు.
జిల్లాలో కరోనా తీవ్రత తక్కువ గా ఉన్న ప్రాంతాలలో ఇప్పటికే కొన్ని దుకాణాలు తెరుచుకోగా ప్రజలు కూడా బయట తిరుగుతున్నారు కాకపోతే హిందూపురం, లేపాక్షి లాంటి కంటైన్ మెంట్ జోన్ లలో మాత్రం పూర్తిగా నిషేధాలు అమలవుతున్నాయి.
హిందూపురంలో తాజాగా రహమత్ పూర్, కంసల పేట, ముక్కడిపేట, మోడల్ కాలనీ, బాపూజి నగర్, కె బసవనపల్లిలో 11 కరోనా పాజిటి కేసులు నమోదు అయ్యాయి, ఇంత వరకూ సేకరించిన బ్లడ్ సాంపిళ్ళతో కేసులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు, గ్జౌజులు వంటి వాటి పట్ల శ్రద్ద చూపితే కరోనా వల్ల భయపడాల్సిన పని లేదని ఎం పీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఎం పి, ఎం ఎల్ సి ఇక్బాల్ కలిసి 15, 16, 30 వార్డులలో 3 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపి పెట్టారు. బైసాని రాంప్రసాద్ సహకారంతో 30 మంది బ్రాహ్మణ కుటుంబాలకు ఎం ఎల్ సి మహమ్మద్ ఇక్బాల్ నిత్యావసర సరుకులు, విధుల్లో ఉన్న ఉద్యోగులకు భోజన ప్యాకెట్లను వితరణ చేశారు.
ఒకే సారి రెండు డిగ్రీలు చదివేంద్యుకు యుజిసి విద్యార్థులకు అవకాశం కల్పించింది ఒకేసారి ఒకే విభాగం లేదా వేర్వేరు విభాగాల్లో చేయవచ్చు అయితే ఒక డిగ్రీ రెయులర్ అయి ఇంకో డిగ్రీ డిస్టెన్స్ లేదా ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు అని యుజిసి కార్యదర్శి రజ్ నీజ్ జైన్ తెలిపారు.
ఇంటర్వ్యూ ఆధారంగా కాంట్రాక్టు పద్దతిలో చిత్తూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్లు
ఇందులో టెక్నికల్ ఆఫీసర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2
పని కల్పించే ప్రదేశం - వైరల్ లోడ్ ల్యాబ్, ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి, ఏఆర్టీ సెంటర్, చిత్తూరు
అర్హతః ఎం ఎస్సీ మెడిక్ వైరాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్, బి ఎస్సీ/డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీత పాటు అనుభవం
ఇంటర్వ్యూ తేది మే 26
మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం .....
కామెంట్‌లు