బీటెక్లో 10నెలలు ఇంటర్న్షిప్
* ఉన్నత విద్యామండలి కసరత్తు ఈనాడు, అమరావతి: బీటెక్ పాఠ్యాంశాల్లో మార్పులు రాబోతున్నాయి. కొత్తగా కొన్ని నైపుణ్య సబ్జెక్టులను ప్రవేశపెట్టడంతోపాటు ఇంటర్న్షిప్ కాలాన్ని పెంచనున్నారు. బీటెక్లో నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. మొదటి రెండేళ్లల్లో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులకు అదనంగా కొత్తవి తీసుకురానున్నారు. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, మౌఖిక పరీక్షల సన్నద్ధత వంటివి నేర్పించనున్నారు. మూడు, నాలుగు ఏడాదిలో విద్యార్థుల కోర్సులకు అనుగుణంగా అందించనున్నారు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ ఆరు నెలలు ఇంటర్న్షిప్ ఉండగా.. దీన్ని 10 నెలలకు పెంచనున్నారు. మొదటి రెండేళ్లు వేసవి సెలవుల్లో రెండేసి నెలలు చొప్పున ఇంటర్న్షిప్ను తీసుకురానున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------------
ఏపీ ఎంసెట్ జులై 27 నుంచి
* ఈసెట్ 24న
* ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ ఎంసెట్ను జులై 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలోకి ప్రవేశానికి నిర్వహించే ఈసెట్ను జులై 24న నిర్వహించనున్నారు. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు మే 20వరకు ఉంది. ఇప్పటి వరకు ఎంసెట్కు 2,48,614 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్కు 1,69,137 మంది, వ్యవసాయ, వైద్య విద్యకు 78,959 మంది, రెండింటికీ 518 మంది దరఖాస్తు చేశారు. 3 వేల మంది రుసుము చెల్లించినా దరఖాస్తులు సమర్పించలేదు. ఇంజినీరింగ్ను ఎనిమిది విడతలుగా, వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలను నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయి.
పరీక్షలు.. తేదీలు
ప్రవేశ పరీక్ష తేదీ
ఈసెట్ జులై 24
ఐసెట్ జులై 25
ఎంసెట్ జులై 27-31
పీజీ ఈసెట్ ఆగస్టు 2-4
ఎడ్సెట్ ఆగస్టు 5
లాసెట్ ఆగస్టు 6
పీఈసెట్ ఆగస్టు 7-9
-----------------------------------------------------------------------------------------------------------------------
జేఈఈ, నీట్ పరీక్షల తేదీలు ఖరారు
దిల్లీ: ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. జులై 18-23 మధ్య జేఈఈ(మెయిన్స్), జులై 26న నీట్, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఇక వాయిదా పడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కరోనా వైరస్వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్కారణంగా వివిధ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో పరీక్షల తేదీల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఏప్రిల్లో జేఈఈ మెయిన్స్, మే నెలలో నీట్జరగాల్సి ఉండగా.. లాక్డౌన్నేపథ్యంలో వాయిదా పడ్డాయి.

ఆన్లైన్లో ఇంటర్ పాఠాలు
* జూన్ నుంచి అందుబాటులోకి ఈనాడు, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైతే ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఇంటర్ మొదటి, రెండో ఏడాది మొత్తం పాఠాలను నిపుణులైన లెక్చరర్లతో వీడియో రికార్డు చేయించనున్నారు. రికార్డు చేసిన వీడియోలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వీటిని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా వినియోగించుకోవచ్చు. జూన్ నుంచి ఆన్లైన్ వీడియోలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు ఏదైనా పాఠం అర్థం కాకపోయినా, రెడ్జోన్లో ఉండి తరగతులకు హాజరుకాలేని వారు సైతం వాటిని వినియోగించుకోవచ్చు.
రూపకల్పన ఇలా..
* ఒక పాఠంపై ముగ్గురు, నలుగురు లెక్చరర్ల నుంచి పాఠ్యాంశాలు(కంటెంట్)ను స్వీకరిస్తారు. ఎంపికైన వారి నుంచి ఆ పాఠం వీడియో రికార్డు చేస్తారు.
* తరగతిలో చెప్పే దానికి భిన్నంగా విద్యార్థులకు తేలికగా అర్థమయ్యేందుకు పాఠ్యాంశానికి అవసరమైన వీడియోలను జత చేస్తారు.
* ఇంటర్ అకడమిక్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది. ఆ నెలకు సంబంధించి ఒక్కో సబ్జెక్టు నుంచి మూడు పాఠాలు అవసరం కానున్నాయి. ముందుగా వాటిని పూర్తి చేస్తారు.
* ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలు జాప్యం కానున్నందున ముందుగా రెండో ఏడాది పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి