కర్నూలు జిల్లా నంద్యాలలోని రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ నందు బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటూ లాక్ డౌన్ తో నంద్యాలలో చిక్కున్న అనంతపురం,హిందూపురం, పెనుకొండ, ధర్మవరం,కదిరి,కొత్తచెరువు,గోరంట్ల,తాడిపత్రి, రామగిరి,పామిడి,గార్లదిన్న,ఓడిసి,సోమందేపల్లి తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 37 మంది (7మంది హిందూపురం వారు ఉన్నారు) అభ్యర్థులను అధికారులు 11.05.2020 ఉదయం నంద్యాల నుండి AP21Z/0781బస్సులో వాళ్ళ స్వస్థలాలకు తరలించారు. ఇందులో 16 మందిని అనంతపురం TTDCలో, నలుగురిని తాడిపత్రి quarentineలో, హిందూపురం వారితో సహా మిగిలిన 17 మంది, సోమందేపల్లిలోని కస్తూరిబా పాఠశాల నందు quarentineలో ఉంచారు.
మంజునాథ్,సవిత,శుభారాణి తదితరులు హిందూపురంకు చెందిన వారున్నారు.
---------------------------------------------------------------------------------------------------------------------మంజునాథ్,సవిత,శుభారాణి తదితరులు హిందూపురంకు చెందిన వారున్నారు.
పోస్టాఫీసులో బ్యాంకు డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు తమకు అవసరమైన నగదును ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ఖాతాదారుని బయోమెట్రిక్ ద్వారా నగదు ఇవ్వడం లేదా ఇతర అకౌంటుకు పంపడం జరుగుతోంది సరిగ్గా ఇలాంటి సౌకర్యాన్నే కల్పిస్తున్నాయి పోస్టాఫీసులు. ఇందుకోసం వ్యక్తి తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకుని ఉంటే ఊ సదుపాయాన్ని పోస్టాఫీసులో కూడా పొందవచ్చు.
---------------------------------------------------------------------------------------------------------------------దేశ ఆర్థిక ప్రగతి గురించి దేశభక్తులు కోరుకుంటున్నట్టుగానే ప్రధాని మోదీ దేశ ప్రజలకు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకెజీ ప్రకటించడంతో పాటు స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యతనివ్వాలని దేశప్రజల యొక్క బాధ్యతను గుర్తుచేశారు
--------------------------------------------------------------------------------------------------------------------------
ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను వర్తించేలా ప్రభుత్వం చర్యలు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు, క్యాన్సర్, ధలసీమియా, పక్షవాతం రోగుల పింఛన్లకు మాత్రం దీనిని నుంచి మినిహాయించారు. ఆధార్ ప్రభుత్వ సర్వేల ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఒక రేషనుకు రెండు పింఛన్లను పొందుతున్న వారి వివరాలను ఇప్పటికే సేకరించి మునిసిపల్ కమీషనర్లకు మరియు ఎం పి డి వోలకు పంపింది ఈ నెల 15వ తేదీలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించే బాధ్యతను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ఈ విషయమై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇన్ ఛార్జ్ రాజబాబు ఆదేశాలు జారీ చేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------
కరోనా నివారణ చర్యల్లో భాగంగా సుమారు 51 సూపర్ మార్కెట్ లకు హిందూపురం పట్టణంలోడోర్ డెలివరీ కోసం జిల్లా కలెక్టరు అనుమతి ఇచ్చినా కొన్ని సూపర్ మార్కెట్ లో కౌంటర్ ద్వారా మాత్రమే విక్రయాలు జరుపుతున్నారనే సమాచారంతో తనిఖీ చేయగా రెండు సూపర్ మార్కెట్లపై ఎఫ్ ఐ అర్ నమోదు చేయడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణులను రజకులను సమావేశ పరిచి ఎట్టి పరిస్థితులలో షాపులు తెరవకూడదని వినియోగదారుల ఇంటివద్దకు వెళ్ళరాదని, ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటుమన్నారు.
60 ఏళ్క పై బడిన వారు బయట తిరగకూడదని అలా కాదని బయట తిరిగిన వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నామని రెండవ సారి బయట కనబడితే వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు.
అత్యవసర సేవలు అందించే వారు మాస్కులు తప్పకుండా ధరించాలని పాల వ్యాపారస్తులు కేవలం డోర్ డెలివరీ ద్వారానే విక్రయించాలని లేదంటే వారి పైన కేసులు నమోదు చేస్తామని పెనుకొండ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పేర్కొన్నారు.
https://www.youtube.com/watch?v=TE7Cvx6Tp4c
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి