GEMINI TIMES | హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 29-05-2020
4 రూపాయలకే త్రాగునీరును సరఫరా చేసే ప్లాంట్ ప్రస్తుతం మూతపడడం వల్ల బిందె నీరు 10 నుంచి 15 వరకు విక్రయిస్తున్నారని దీనితో పాతే నిత్యావసర సరుకుల సమస్యలు ఉన్నాయని ముక్కడిపేటలోని వారు ఐ ఎఫ్ ఎస్ అధికారి చైతన్యకు వివరించారు, ఈ విషయాలు అడిగి తెలుసుకున్న ప్రత్యేక అధికారి స్పందించి వాలంటీర్ల ద్వారా సమస్యలు తీరుస్తామన్నారు.
ఆధార్ వివరాలు ఇచ్చిన వారికి 10 నిముషాలలోనే ఆన్ లైన్ లో పాన్ నెంబరు కేటాయించే సదుపాయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం అధికారికంగా ప్రారంభించారు.
ఫిబ్రవరి 12వ తేదీన ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించి ఇప్పటివరకుక 677680 పాన్ నెంబర్లు ఆన్ లైన్ లో కేటాయించారు. ఆధార్ తో పాన్ పొందాలనుకునే వారు ఆధార్ నెంబరు, ఆధార్ లో నమోదు చేసుకున్న మొబైల్ నెంబరు ఉన్నవారికి ఆన్ లైన్ పాన్ కేటాయింపు వర్తిస్తుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో జరిపే ఆస్తుల అమ్మకం కొనుగోళ్ళు, షేర్ మార్కెట్ లావాదేవీలకు సంబంధించిన వివరలు, వాటికి సంబంధించి చెలించే మూలంలో పన్ను కోత, మూలం వద్దే పన్ను వసూలు వంటి వివరాలతో సవరించిన కొత్త ఐటీ ఫారం 26 ఎఎస్ ను అందుబాటులోకి తెచ్చింది ఐటి శాఖ.
టిక్ టాక్ యాప్ కు పోటీగా ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించిన మిత్రో యాప్ ను ఇప్పటివరకు 50 లక్షల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు, ఇది భారతీయ యాప్ కావడం, చైనా, భారత్ తో కాలుదువ్వడం వంటి పరిణామాలతో భారతీయులు ఈ యాప్ ఎక్కువగా ఆదరిస్తున్నారు.
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఖాళీ వయసు 65 ఏళ్ళకు మించకూడదు, వేతనం 75000, దరఖాస్తుకు చివరి తేది జూన్ 9, అర్హత- ఇంజినీరింగ్ / మేనేజ్ మెంట్ / కామర్స్ విభాగాల్లో డిగ్రీ/ పిజి, కంప్యూటర్ పరిజ్ఞానం, 15 ఏళ్ళు ఆర్థిక సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. www.apcob.org
ఆచార్య ఎన్ జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ గ్రామీణ్ కృషి మౌసమ్ సేవా స్కీమ్ కోసం రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు
అర్హతః ఆగ్రో మెటీరియాలజీ/ఆగ్రోనమీ స్పెషలైజేషన్ లో పిజి, బోధన లేదా పరిశోధన రంగాల్లో కనీసం మూడేళ్ళ అనుభవం ఉండాలి, పి హెచ్ డి ఉన్నవారికి ప్రాధాన్యం
వయసు- పురుషులకు 40, మహిళలకు 45 లోపు
హెచ్ ఆర్ ఏ సహా నెలకు జీతం 47000/-.
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జూన్ 5న ఆసక్తి గల వారు ఒరిజినల్ సర్టిఫికేట్లు, బయోడేటాతో ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.
తిరుపతిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్ క్కు దరఖాస్తులు, విభాగాలు - మేథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ
అర్హతః పి హెచ్ డి తో పాటు రేండేళ్ళ పరిశోధన అనుభవం.
ఫెలోషిప్ లో హెచ్ ఆర్ ఏ తో సహా నెలకు 47000/- జీతం, పిహెచ్ డీ డిగ్రీ కోసం ఎదురుచూస్తున్నవారికి హెచ్ ఆర్ ఏ సహా 35000/- జీతం.
పరిశోధనా అనుభవంతో పాటు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తుకు చివరి తేది జూన్ 10
బెంగళూరు లోని డిఆర్ డి ఓ కి చెందిన ఎయిరోనాటికల్ డెవలప్ మెంట్స్ ఏజెన్సీ లో ఉద్యోగాలు
ఖాళీలు 18
ఉద్యోగాలు సైంటిస్ట్ / ఇంజినీర్
విభాగాలు ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్
అర్హతః సంబంధిత సబ్జెక్టుల్లో బిఇ/బీటెక్ ఉత్తీర్ణత అలాగే వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి
వాలిడ్
గేట్ స్కోర్, డిస్క్రిప్టివ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
జరిగే ఈ ఉద్యోగాలకు, ఆన్ లైన్ ద్వారా దరఖస్తులకు చివరితేది జూలై 7
డి ఎడ్ మొదటి సంవత్సరం విద్యార్థులు జూన్ 6 లోపు పరీక్ష ఫీజును చెల్లించాలని గడువులోగా చెల్లించని పక్షంలో 50 రూపాయలు అపరాధ రుసుముతో జూన్ 15 వరకు చెల్లించాలని, పరీక్షలు ఆగస్టు లో ఉంటాయని డి ఇ ఓ శామ్యూల్ తెలిపారు.
కామెంట్‌లు