GEMINI TIMES | హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం | 30-05-2020
పాత పెన్షన్ విధానం అమలుకు రేపటిలోగా 2003 డిఎస్సిలో ఎంపికైన వివిధ కేడర్ల టీచర్లు శని, ఆదివారాల్లో వివరాలను https://deoananthapuramu.blogspot.com నందు అప్ లోడ్ చేయాలని డి ఇ ఓ శామ్యూల్ తెలిపారు. 31 వ తేదీ తరువాత ఎట్టిపరిస్థితులలోనూ అవకాశమ ఇవ్వబోమన్నారు. వీటిని ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని అన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితం శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు బెంగళూరుకు చెందిన గురుకుల్ సంస్థ యాజమాన్యం తెలిపింది. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో నిత్యం 2 గంటల చొప్పున 40 రోజులు ఫోన్లలోనే శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం సర్టిఫికేట్ తో పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ పాస్ లేకుంటే డిగ్రీ పాస్ లేదంటే ఫెయిల్ అయిన వారు పిజి విద్యార్థులు సైతం అర్హులన్నారు. స్పోకేన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ, లైఫ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు కాల్ చేయండి 6305334287 / 7780752418 / 9000487423 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
పట్టణంలోని 25 వాణిజ్య వర్తక సంఘాల నాయకులు సడలింపులతో వ్యాపారాలు చేసుకునేందుకు తగు అనుమతులివ్వాలని, రెండు నెలలుగా నష్టపోతున్నామని, అద్దెలు, కరెంటు బిల్లులు, జీతాలు, అరువు కింద తీసుకున్న కంపెనీలక్కు చెల్లించాల్సిన మొత్తాలు ఇలాంటి సమస్యలెన్నో తీవ్రమవుతున్నాయనే పలు అంశాల మీద తహశిల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఇతర వాణిజ్య సముదాయాల యజమానులు పాల్గొన్నారు.
కామెంట్‌లు