ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం నగరంలో డిసెంబర్ 4వ తేదీన వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో భాగంగా జాబ్ మేళా ను నిర్వహించనున్నారు.
సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ( సిడాప్ ) మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన సమాచారం :
జాబ్ మేళా నిర్వహణ తేదీ | డిసెంబర్ 4,2020 |
జాబ్ మేళా నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
జాబ్ మేళా నిర్వహణ ప్రదేశం | TTDC ట్రైనింగ్ సెంటర్, బాలయోగీ ఘాట్ ప్రక్కన,నల్ల వంతెన, అమలాపురం,తూర్పుగోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్. |
సంస్థల వారీగా ఉద్యోగ అవకాశాలు :
న్యూ ల్యాండ్స్ లేబరేటరీ సంస్థ (హైదరాబాద్ ):
ఈ సంస్థలో ఖాళీగా ఉన్న మాన్యుఫాక్చరింగ్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలను ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు కల్పించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపీసీ /బైపీసి విభాగాలలో ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి ఉన్న మరియు B.Sc ను మధ్యలో వదిలివేసిన పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలను ఎంపిక చేసుకోవచ్చు.
శ్రీ సిటీ, తడ :
ఈ సంస్థలో హ్యుందాయ్ మోటార్ ఆపరేషన్స్, హీరో క్రాప్ మోటార్స్ ప్రొడక్షన్స్ ఆపరేటర్స్ ఉద్యోగాలను కల్పించనున్నారు.
ఫ్లెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్స్ :
ఈ జాబ్ మేళా ద్వారా ఫ్లెక్ ఇండియా సంస్థలో ఆపరేటర్ /లైన్ లీడర్ ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /డిప్లొమా /డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన స్త్రీలు మాత్రమే అర్హులు.
వేతనాలు :
ఈ జాబ్ మేళా ద్వారా వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు నుండి 14,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి