భారతీయ రైల్వే బోర్డు నుంచి మరో మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
సౌత్ వెస్ట్రన్ రైల్వే లో స్పోర్ట్స్ కోటా లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ ఉద్యోగాలకు ఇరుతెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | నవంబర్ 30,2020 |
దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 28,2020 |
విభాగాల వారీగా ఉద్యోగాలు :
సౌత్ వెస్ట్రన్ రైల్వే లో స్పోర్ట్స్ కోటా లో ఈ క్రింది విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అథ్లెటిక్స్ ( మెన్ ) | 3 |
అథ్లెటిక్స్ ( ఉమెన్ ) | 2 |
బాడ్మింటన్ (మెన్ ) | 2 |
క్రికెట్ ( మెన్ ) | 3 |
వెయిట్ లిఫ్టింగ్ ( మెన్ ) | 2 |
టేబుల్ టెన్నిస్ (మెన్ ) | 1 |
హాకీ ( మెన్ ) | 4 |
స్విమ్మింగ్ ( మెన్ ) | 2 |
గోల్ఫ్ ( మెన్ ) | 2 |
మొత్తం ఖాళీలు :
మొత్తం 21 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి / ఇంటర్మీడియట్ విద్యా కోర్సులను గుర్తింపు పొందిన బోర్డుల నుండి పూర్తి చేసి ఉండాలి. క్రీడా సంబంధిత విభాగాల్లో ప్రత్యేకమైన కోర్సులు చేసి ఉండవలెను.జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడ అంశాలలో ప్రావీణ్యత అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయోపరిమితి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 1-1-2021 నాటికీ 18 – 25 సంవత్సరాల మధ్యన ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ఫీల్డ్ ట్రయిల్స్, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో విజయాల మదింపు మరియు మెడికల్ టెస్టుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు VII సీపీసి విధానంలో జీతములు లభించనున్నాయి.
ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు రుసుముగా చెల్లించవలెను.400 రూపాయలు రిఫండ్ వస్తాయి. మిగిలిన కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటులను మరియు నోటిఫికేషన్ ను చూడగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి