3, డిసెంబర్ 2020, గురువారం

Junior Lecturer Jobs 2020 || గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పలు బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్  పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయినది. అర్హతలు గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కృష్ణ లంక గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న బోధన విభాగాలకు గాను అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 5,2020  సాయంత్రం 4 గంటల లోపు.

బోధన విభాగాల వారీగా అధ్యాపక పోస్టులు :

బోటనీ

సివిక్స్

అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన విశ్రాంత అధ్యాపకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటనలో పొందుపరిచారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కృష్ణ లంక గవర్నమెంట్ జూనియర్ కళాశాలను నేరుగా సంప్రదించవచ్చును.

కామెంట్‌లు లేవు: