కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 4726 పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) నోటిఫికేషన్ గత నెలలో విడుదలైనది.
ఈ నెల 15 వ తారీఖుతో SSC CHSL 2020 పరీక్షల దరఖాస్తు గడువు ముగిసింది. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు సర్వర్స్ లో తలెత్తిన సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురు అవ్వుతున్నాయి.
ఈ సందర్భంలో, ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా దరఖాస్తు గడువును డిసెంబర్ 26 వ తేది వరకూ పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
SSC CHSL 2020 మారిన షెడ్యూల్ :
ఆన్లైన్ లో దరఖాస్తులకు చివరి తేది :
డిసెంబర్ 26,2020
ఆన్లైన్ లో ఫీజు పేమెంట్ కు చివరి తేది :
డిసెంబర్ 28,2020
ఆఫ్ లైన్ చలానా జనరేషన్ కు చివరి తేది :
డిసెంబర్ 30,2020
చలానా ద్వారా ఫీజు పేమెంట్ కు చివరి తేది :
జనవరి 1,2021.
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (టైర్ -1) నిర్వహణ తేది :
ఏప్రిల్ 12 – 27,2021.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి