.
Vashista Infinity రాసిన ఈ పోస్ట్ చదవండి. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి
"తిన్నది అరగక, ఎక్కడ పని లేక, వాపుని చూసుకొని బలుపు అని భ్రమలో చేస్తున్న ఉద్యమమే ఈ పంజాబ్ రైతుల ఆందోళన"
"ఢిల్లీ పక్కనే కూత వేటు దూరంలో ఉంది కాబట్టి, 96వేల ట్రాక్టర్లు వేసుకొని వచ్చి, షో ఆఫ్ చేస్తున్నారు".
"దేశంలో 29 రాష్ట్రాల రైతులకు లేని కడుపు నొప్పి ఈ సర్దార్ గాళ్ళకు ఎందుకో అంత ఇది".
ఇలా నానా మాటలు అంటు, ఒక ప్రజా ఉద్యమాన్ని, దేశానికి అన్నం పెట్టే రైతుని కించపరుస్తున్నారు చాలా మంది.
అసలు పంజాబ్ రైతులే ఎందుకు అంతలా ఆందోళన చేస్తున్నారు, మిగితా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనే విషయం నేను చెప్తాను వినండి.
కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు చేసింది. ముందు వాటి మీద మనకు అవగాహన ఉండాలి. ఆ తర్వాత రైతుల ఆందోళన ఎందుకో అర్ధం అవుతుంది.
1. వ్యవసాయ స్వేచ్ఛయుత మార్కెట్ చట్టం :- ఈ చట్టం రైతులకు వాళ్ళు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఇస్తుంది. అంటే ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు. రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు. టాక్స్ ఉండదు. అంటే one nation one market. ఇక్కడి వరకు బాగుంది కానీ ఈ చట్టంలో రైతులకు ప్రభుత్వం ప్రతి పంట మీద ఒక మద్దతు ధర నిర్ణయించి ఇస్తుంది, దాన్నే minimum support price అంటారు. బక్క చిక్కిన చిన్న సన్న కారు రైతులకు ఇప్పుడు ఈ చట్టంలో ఆ రక్షణ లేదు. అసలు MSP అనే పదమే లేదు. రైతు తాను పండించిన పంటను APMCలో అంటే మార్కెట్ యార్డులో అమ్ముకుంటే తనకు కనీస మద్దతు ధర వస్తది కానీ ఇలా బయట అమ్మడం మొదలుపెడితే తన బ్రతుకు కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తారు అనే భయం మొదలయింది.
మరి పంజాబ్ రైతులే ఎందుకు భయపడుతున్నారు మిగితా రాష్ట్రాల రైతులు ఎందుకు కనీసం పట్టించుకోవట్లేదు అంటే, ఇతర రాష్ట్రాల్లో రైతులు 90% వరకు వాళ్ళు పండించిన పంటకు ఆల్రెడీ ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముతున్నారు. కేవలం 10% రైతులే మార్కెట్ యార్డులో అమ్ముతున్నారు. కానీ పంజాబ్లో పరిస్థితి భిన్నంగా ఉంది, 90% రైతులు తమ పంటను మార్కెట్ యర్డ్స్ APMC లో మాత్రమే అమ్ముకుంటారు. అక్కడ వాళ్లకు MSP రక్షణ ఉంటుంది. రైతు సంఘాలు క్రియాశీలకంగా ఉంటాయి కాబట్టి కేవలం పంజాబ్లోనే దేశం మొత్తం మీద ఉన్న APMC మార్కెట్ యార్డులు 33% పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్లకు ఈ APMC లు దూరం అయితే MSP కనీస మద్దతు ధర దూరం అవతది అనే భయం, ఆందోళన ఉంది. వాళ్ళు ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు అంటే, MSP అనే క్లాస్ చట్టంలో స్పష్టంగా పొందుపరచాలి, దేశానికి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టొద్దు అని.
వాళ్ళు ఇంతలా ఆందోళన చెందడానికి, ఆందోళన చేయడానికి కారణం, 2006లో బిహార్లో ఈ ఫ్రీ మార్కెట్ చట్టం చేసి, అక్కడి రైతులకు APMC మార్కెట్ యార్డులు దూరం చేసారు, వాళ్ళు పండించిన పంటను ప్రైవేట్ వ్యాపారులు ఎంత ధర నిర్ణయిస్తే అంతకు అమ్ముకొని నష్టపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఒక సెల్ ఫోన్ కంపెనీ వాడు తాను తయారు చేసిన ప్రొడక్ట్ ఎంతకు అమ్మలో వాడే నిర్ణయిస్తాడు కానీ ఒక రైతు మాత్రం, తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎవడో అంబానీ, అదాని గాడు వచ్చి నిర్ణయిస్తే మేము ఎలా ఉరుకుంటాం అనే ఆత్మ గౌరవం నుండి పుట్టిందే ఈ పంజాబ్ రైతుల ఆందోళన.
ఈ ముసలాయనకు ఎక్కడ పనిలేక, ఎముకలు కొరికే చలిలో ఈ వయసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నాడు అనుకుంటున్నారా...???
2.కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదా ఒప్పంద వ్యవసాయ చట్టం :-
ఈ చట్టం కింద రైతులు కొంతమంది బడా కార్పొరేట్ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. అదేంటంటే. ఆ సంస్థలు చెప్పిన పంట పండిస్తే, రైతులకు పంట పెట్టుబడి సాయం ముందే కలిపిస్తారు, పంట పండిన తర్వాత ఆ పంటను ఆ కంపెనీ కొనే బాధ్యత తీసుకుంటారు. పంట వేసే ముందే ధర కూడా నిర్ణయిస్తారు. ఒకవేళ మార్కెట్లో ఆ పంటకు ధర పడిపోయిన, ఆ కంపెనీ మాత్రం వాళ్లకు ముందు కుదుర్చుకున్న ధరనే ఇస్తుంది.
అంత బాగానే ఉంది కదా మరి, ఇంకా సమస్య ఏంటి అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్న, సమస్యలు అన్ని ఒక్కొక్కటిగా క్లియర్ గా తెలుసుకుందాం.
1. రైతు ఏ పంట పండిచాలో బడా కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తాయి. అంటే రైతు తనకు నచ్చిన పంట పండించే వెసులుబాటు కోల్పోతాడు, అంటే కంపెనీ చేతిలో కీలు బొమ్మ ఐపోతాడు.
2. రైతుకు ఆహార భద్రత ఉండదు, ఎందుకంటే మన దేశంలో 86% రైతులు చిన్న కమతాల ఉన్న చిన్న సన్న కారు రైతులు. ఒకవేళ ఈ ఒప్పందం వ్యవసాయం చేస్తే రైతులు, ఇప్పుడు ఇంటి పూర్తి వరకు పండించే ఆహార పంటలు పండించుకోలేడు. వాణిజ్య పంటల ఊబిలో పడిపోయి తన ఆహార భద్రత కోల్పోతాడు.
3. కంపెనీ వాడు చెప్పినట్లు మిర్చి, పత్తి, ఆలుగడ్డ, సొయా లాంటి వాణిజ్య పంటలు పండించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, కంపెనీ వాడు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు, పురుగు మందులు, రసాయనాలు వాడి ఆ రైతు తన భూమిని గుళ్ల చేసుకుంటాడు. ఎక్కువ ఉత్పత్తి చేయడం కోసం ఎక్కువ రసాయన మందులు వాడి, భూమి సారం కోల్పోతాడు.
4. ఒకప్పుడు తెలంగాణ లాంటి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా తృణ ధాన్యాలు(ఉలువలు, సజ్జలు,రాగులు,జొన్నలు) పండేవి, కానీ హరిత విప్లవం మోజులో పడిపోయి తెలంగాణ రైతులు తమ సంప్రదాయ పంటలను, ఆహార భద్రతను కోల్పోవడమే కాకుండా, వీపరితమైన నీళ్లు అవసరం ఉండే పంటలు వేసి, వాటికోసం అప్పులు తెచ్చి బోర్లు వేసి, ఆ ఫెయిల్ అవ్వడంతో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే పంజాబ్లో కూడా జరిగింది.
5. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మనం లొట్టలేసుకొని తినే lays packet తయారు చేసే pepsico company వాళ్ళు పంజాబ్ రైతులతో ఒక ఒప్పందం చేసుకున్నారు, మేము ఇచ్చే హైబ్రిడ్ ఆలు గడ్డలు పండిస్తే మీకు మార్కెట్ కంటే ఎక్కువ ధర ఇస్తాం అని. అలాగే ఒకటి రెండు సార్లు ఇచ్చారు కూడా కానీ ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లో వీటికి అంత ధర పలకడం లేదు, మేము ఇవ్వలేం అని చేతులు ఎత్తేసారు. అక్కడి రైతులకు ఆత్మహత్యలే మిగిలాయి. ముందు ఆశ చూపించి ఆ తర్వాత ఆకు నాకిస్తారు ఈ కార్పొరేట్ కంపెనీలు.
6. మరి ఈ కంపెనీలు మోసం చేస్తే న్యాయం కోసం న్యాయస్థానాలు లేవా అంటే, లేవు అనే చెప్పాలి ఎందుకంటే ఈ చట్టంలో సెక్షన్ 19 ప్రకారం సివిల్ న్యాయస్థానాలు ఇందులో జోక్యం చేసుకోరాదు, అంటే seperate ట్రిబ్యునల్ ఉంటుంది దానికి వెళ్లి కేస్ వేయాలి. రెండు ఎకరాలు ఉన్న బక్క చిక్కిన రైతు, 20లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ వెంట్రుక కూడా పీకలేడు కదా. ఈ ప్రాసెస్ లో రైతు ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం కోల్పోయి, మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటాడు
7. 55% జనాభా వ్యవసాయం మీద ఆధారపడే ఈ దేశంలో రైతు తన భూమిలో తాను ఒక కూలీ వాడు ఐపోతాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ బిహార్లో నీలి మందు(indigo) మాత్రమే పండిచాలి అని నిబంధన పెట్టి అప్పట్లో ఎలా అయితే రైతుల్ని ఆహార భద్రత కోల్పోయేలా చేసిందో ఈ చట్టం కూడా ఇప్పుడు రైతుల నడ్డి విరవడానికే అని మరిచిపోవద్దు.
పొద్దున లేస్తే ఈ దేశాన్ని అంబానీ దోచుకుంటున్నాడు, అదాని దోపిడీ చేస్తున్నాడు అని అందరు అరిచి గీపెట్టి ఆఖరికి వురుకుంటారు, పెద్దగా సీరియస్ గా పట్టించుకోరు. కానీ......
ఇప్పుడు వాళ్ళు అన్నం పెట్టే రైతుల మీదకు వచ్చారు. ఇప్పుడు కూడా వురుకున్నావో, రేపు నీ ఆకలి చావుకు నువ్వే కారణం అవుతావు గుర్తుపెట్టుకో.
3. నిత్యావసర వస్తువుల చట్ట సవరణ 2020 :-
ఇంతకు ముందు ఉన్న essential commodities చట్టం ప్రకారం, ఎవరు ప్రభుత్వం విధించిన పరిమితి కంటే ఎక్కువగా ఆహార ధాన్యల్ని, నిత్యావసర వస్తువుల్ని నిలువ చేసుకోవడానికి వీలులేదు. దీన్ని MRTP monopoly restrictive trade practices అంటారు, అంటే అక్రమంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు నిత్యావసర వస్తువుల్ని నిలువ చేసుకొని కృత్రిమ కొరత సృష్టించి, మార్కెట్లో ఆ వస్తువుల ధర వీపరితంగా పెరిగిన తర్వాత ఆ వస్తువుల్ని అమ్ముకునే వ్యాపారస్తులను నియంత్రించే చట్టం. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం, నిత్యావసర సరుకులను అందరికి అందుబాటు ధరల్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.
కానీ ఇప్పుడు చేసిన కొత్త చట్టంలో ఈ నియంత్రణ అనే అంశాన్ని ఎత్తివేసారు అంటే వ్యాపారస్తులు వారికి నచ్చినట్లు, నచ్చినంత నిలువ చేసుకోవచ్చు. వారికి అవసరం ఉన్నప్పుడు అవసరమైన వారికి అమ్ముకోవచ్చు. అంటే వ్యాపారస్తుల మీద ప్రభుత్వానికి నియంత్రణ ఉండదు. ఒకవేళ ఆ వ్యాపారస్తులను నియంత్రించాలంటే నిత్యావసర సరుకుల ధరలు 50% పెరగాలి లేదా యుద్ధం కానీ ఏదైనా విపత్తు కానీ రావాలి, అప్పుడే ప్రభుత్వం వీటి మీద అజమాయిషీ ఉంటుంది. అప్పటి వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోదు, చేసుకునే వీలు లేదు.
మరి ఇలా నిత్యావసర వస్తువులను, బడా కార్పొరేట్ సంస్థలు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని వాటిని ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తది అన్నమాట. సరే ఇదంతా వ్యాపారం అలాగే ఉంటుంది అనుకుందాం. అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ బడా కార్పొరేట్ వ్యాపార సంస్థలు రేపు మార్కెట్లో కావాలని కృత్రిమ కొరత సృష్టించి, అందరు సిండికేట్ అయిపోయి. నిత్యావసర వస్తువుల ధరలను వీపరితంగా పెంచితే, అటు రైతు ఇటు వినియోగదారుడు ఎంత నష్టపోతారు. మధ్యలో ఈ కార్పొరేట్ సంస్థలు ఇద్దరితో వ్యాపారం చేసి ఎంత దోచుకుంటారు ప్రజల్ని ఒక్కసారి ఆలోచించండి. మొదట అందరు jio sim ఫ్రీ, ఆఫర్లు అన్ని ఫ్రీ అని కొన్నారు, ఇప్పుడు ఏమైందో చూసారు కదా. రేపు అదే జరుగుతుంది కూడా. ఇప్పటికే మన దేశం పేద దేశం అని దేశ ప్రధానులు ఒప్పుకుంటున్నారు, దేశంలో ఆకలి చావులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే వెనకబడి ఉన్నాం( కావాలంటే గూగుల్ చేసి సెర్చ్ చేయండి).
ఇదంతా ఇంకా క్లియర్ గా అర్ధం కావాలంటే మీకు 1943 great bengal famine గురించి తెలియాలి.
బెంగాల్ ప్రజలు 30 లక్షల మంది 1943లో వచ్చిన కరువులో ఆకలితో ఆహకరాలు చేస్తూ ఎండిన డొక్కాలతో, అస్థి పంజరాళ్ల తయారు ఐయ్యి చనిపోయారు, కేవలం తినటానికి తిండి లేక 30లక్షల మంది ప్రజలు చనిపోయారు. వాస్తవానికి 1943లో అసలు కరువు ఏర్పడలేదు, క్షామం లాంటి పరిస్థితి లేదు, అయినప్పటికీ అంత మంది చనిపోవడానికి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ పండిన పంట మొత్తం ఇంగ్లాండుకు తరలించడం, రెండు ఇక్కడి వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి ఉన్న కొంత ఆహార ధాన్యల్ని ఎక్కువ ధరకు అమ్ముకోవడం.
దాని వల్ల బెంగాల్ లో, కృత్రిమ కరువు ఏర్పడి ఒక హోల్ జనరేషన్ ఆకలితో అంతమైపోయింది. (గూగుల్ చేసి చదవండి)
జై హింద్.
#Save_farmers
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి