1, జనవరి 2021, శుక్రవారం

CIA Jobs Recruitment 2021 Telugu || రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ లో ఉద్యోగాలు

 

భారత దేశ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రి ఎక్సటెన్షన్ మేనేజ్ మెంట్ (మేనేజ్ ) లో విభాగాలవారీగా ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.

ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. CIA Jobs Recruitment 2021 Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిడిసెంబర్ 30,2020
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 21,2021

విభాగాల వారీగా ఖాళీలు :

కన్సల్టెంట్ (ఏసీ & ఏబీసీ )7
కన్సల్టెంట్ (ఏసీ & ఏబీసీ డాక్యూమెంటేషన్ )1
టెలి అడ్వైజర్1
బిజినెస్ ఎగ్జిక్యూటివ్1
మేనేజ్ రీసెర్చ్ ఫెలో1

మొత్తం ఉద్యోగాలు :

ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి ఎంబీఏ /పీజీడిఎం/ఎంఎస్సీ/తత్సమాన మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత /అగ్రికల్చర్ /అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్ /తత్సమాన విభాగాలలో బాచిలర్ డిగ్రీ /అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ /అగ్రికల్చర్ ఎకనామిక్స్ మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.మరియి సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు  45 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఈ ఉద్యోగాల దరఖాస్తుకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు  30,000 రూపాయలు నుండి 75,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

 

కామెంట్‌లు లేవు: