13, జనవరి 2021, బుధవారం

TTD Jobs 2021 Update Telugu || తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లో ఉద్యోగాలు

తిరుపతి దేవస్థానంనకు సంబంధించిన బీఐఆర్ఆర్డి ట్రస్ట్ ఆసుపత్రిలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రేడ్ -2 కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూ లు లేకుండా కేవలం మెరిట్ మార్కుల ద్వారా ఎంపిక చేయబడే ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేది జనవరి 13,2021
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 27,2021 (5PM)

విభాగాల వారీగా ఖాళీలు :

అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రేడ్ – II :

ఆర్థోపేడిక్స్4
అనాస్టీషియా3
స్పైన్ సర్జన్2
ప్లాస్టిక్ సర్జన్1
పెడియట్రిక్ ఆర్థోపెడిస్ట్స్2

మొత్తం ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు  MBBS కోర్సులో ఉత్తీర్ణత సాధించవలెను.

MS/DNB/MD/MCH విభాగాలలో పీజీ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు. మరింత ముఖ్య సమాచారం కొరకు ఈ క్రింది నోటిఫికేషన్ చూడవచ్చు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలు మించరాదు. SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాల వయసు సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

మెరిట్ మార్కుల విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాల వారీగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 91,960 రూపాయలు వరకూ జీతం లభిస్తుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా  :

అభ్యర్థులు వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారం ను నింపి ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.

To The Director (FAC),

BIRRD Trust Hospital,

TTD,

TIRUPATI – 517501.

Website 

Notification

కామెంట్‌లు లేవు: