18, మార్చి 2021, గురువారం

ఎన్‌ఎండీసీలో 304 ఉద్యోగాలు | NMDC Jobs

 


హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎండీసీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 304
పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ)–65, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌)(ట్రెయినీ)–148, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ)–81, బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ)–01, ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ)–09.

ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌–35, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–30.
అర్హత: మిడిల్‌ పాస్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌) (ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –76, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–72.
అర్హత: వెల్డింగ్‌/ఫిట్టర్‌/మెషినిస్ట్‌/మోటార్‌ మెకానిక్‌/డీజిల్‌ మెకానిక్‌/ఆటో ఎలక్ట్రీషియన్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –49,బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–32.
అర్హత: ఎలక్ట్రికల్‌ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ): అర్హత: బ్లాస్టర్‌ ట్రేడులో మెట్రిక్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. మైనింగ్‌ మేట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. బ్లాస్టింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ): అర్హత: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయసు: 15.04.2021 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి రాతపరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఆధారంగా.. మిగిలిన పోస్టులకి రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. మిగతా పోస్టులకి 130 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్‌(సంబంధిత ట్రేడు) 30 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును పోస్ట్‌ బాక్స్‌ నెం.1383, పోస్ట్‌ ఆఫీస్, హుమాయూన్‌ నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, పిన్‌–500028 చిరునామాకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021
దరఖాస్తు హార్ట్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.04.2021

వెబ్‌సైట్‌: www.nmdc.co.in

కామెంట్‌లు లేవు: