మే 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను మే 24న మంగళవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అదేవిధంగా, ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్లను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే 26వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి సమాచారం అందిస్తారు. భక్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది.
కాగా, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన వర్చువల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉదయం 9 గంటల నుండి మొదలవుతుంది.Gemini Internet
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
23, మే 2022, సోమవారం
తిరుమల, 2022 మే 23
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి