23న ముసాయిదా ఓటరు
జాబితా విడుదల
అనంతపురం అర్బన్: పశ్చిమ రాయలసీమ
(కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ ఉమ్మడి
జిల్లాలు) పట్టభద్ర ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎన్నికల్లో ఓటరుగా నమోదు ప్రక్రియ ఈ నెల 7వ
తేదీ రాత్రి 12 గంటలకు ముగిసింది. పట్టభద్ర
ఎమ్మెల్సీకి సంబంధించి ఓటరుగా నమోదుకు
3,50,362 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటరుగా
నమోదుకు 29,786 మంది దరఖాస్తు చేసుకు
న్నారు. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులను పరి
శీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అర్హు
లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల
19వ తేదీలోపు పూర్తి చేసి, 23న ముసాయిదా
ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి
డిసెంబర్ 9వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరి
స్తారు. ఇప్పటి వరకూ ఓటరుగా నమోదు చేసుకోని
వారి నుంచి తిరిగి దరఖాస్తులను స్వీకరిస్తారు.
వచ్చిన అభ్యంతరాలను, దరఖాస్తులను డిసెంబరు
25వ తేదీలోపు పరిష్కరిస్తారు. డిసెంబరు 30వ
తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. కాగా,
2017లో జరిగిన పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం ఓట
రుగా నమోదుకు లక్షకు పైగా దరఖాస్తులు అధికం
గా రావడం గమనార్హం.
కామెంట్‌లు