7, ఫిబ్రవరి 2023, మంగళవారం

జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 తుది కీ విడుదల✍️📚♦️. నేడు ఫలితాల విడుదల



🌻ఈనాడు, న్యూస్: జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1 తుది కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. తొలి విడత పరీక్షలు ఈనెల 1న ముగిసిన సంగతి తెలిసిందే. బీటెక్‌ సీట్ల కోసం ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 8.60 లక్షల మంది రాయగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది ఉన్నారు. తుది కీ విడుదల చేసిన నేపథ్యంలో ఏ క్షణంలో అయినా విద్యార్థుల స్కోర్‌ను వెల్లడించనున్నారు. అంటే మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు చివరి విడత పరీక్షలు ఏప్రిల్‌లో జరగనుండగా దానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది.

కామెంట్‌లు లేవు: