🌻జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2022-23 సంవత్సరానికి అగ్రి ఎమ్మెస్సీ (సామాజిక శాస్త్రం), ఎం.టెక్, ఎంబీఏ (ఏబీఎం) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్‌కు విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. 13న ఎంబీఏ కోర్సులో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో సీట్లకు బృంద చర్చ, ముఖాముఖి జరుగుతుందన్నారు. 14న ఎంబీఏ, ఫిజికల్ సైన్సెస్, బోటనీ బయో టెక్నాలజీ, వ్యవసాయ ఇంజినీరింగ్, సామాజిక శాస్త్రం, స్టాటికల్ సైన్సెస్, 15న అగ్రానమి, ప్లాంట్ సైన్సెస్, ఎంటమాలజీ, నెమటాలజీ, సోషల్ సైన్సెస్ కోర్సులకు కౌన్సెలింగ్ జరగనుందన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ www.angrau.ac.in ని చూడాలని సూచించారు.

కామెంట్‌లు