ప్రాంతీయ భాషల్లో రాత పరీక్ష
ఎస్‌ఎస్‌సీ తాజా నోటిఫికేషన్‌లో మరో ముఖ్యమైన అంశం... ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్షను తెలుగుతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు.
రాత పరీక్షకు 270 మార్కులు
* ఎంపిక ప్రక్రియలో తొలి దశగా పేర్కొన్న రాత పరీక్షను రెండు సెషన్లలో మొత్తం 270 మార్కులకు నిర్వహిస్తారు.
౨ సెషన్-1: ఇందులో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ(20 ప్రశ్నలు-60 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్(20 ప్రశ్నలు- 60 మార్కులు) విభాగాలుంటాయి.
సెషన్-2: ఈ సెషన్‌లో జనరల్ అవేర్‌నెస్(25 ప్రశ్నలు-75 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్(25 ప్రశ్నలు-75
మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* సెషన్-1లోని రెండు విభాగాల్లో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున, సెషన్-2లోని సట్జెక్ట్‌లలో ప్రతి సబ్జెక్ట్‌లో ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున కేటాయించారు.
* ప్రతి సెషన్ వ్యవధి 45 నిమిషాలు.
* పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా ఉంటుంది.
* సెషన్-2లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్క్‌ను నెగెటివ్ మార్క్‌గా నిర్దేశించారు. సెషన్-1లో
నెగెటివ్ మార్కింగ్ లేదు.
పీఈటీ/ పీఎన్‌టీ
ఎస్‌ఎస్‌సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాలకు సంబంధించి అన్ని శాఖలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఖరారు చేస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ విభాగాల్లోని హవాల్దార్ పోస్ట్‌లకు మాత్రం రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. వివరాలు...
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
* రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీల వారీగా కటాఫ్ నిర్దేశించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి.. రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది.
* పురుష అభ్యర్థులు 1,600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి.
* మహిళా అభ్యర్థులు ఒక కిలో మీటర్ దూరాన్ని 20 నిమిషాల్లో నడవాల్సి ఉంటుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
* ఈ టెస్ట్‌ను పలు పోస్ట్‌లకు మాత్రమే నిర్వహిస్తారు. అభ్యర్థులు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.
* పురుషులు 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతి విస్తీర్ణం 81 సెం.మీ ఉండాలి. (శ్వాస పీల్చినప్పుడు అయిదు సెం.మీ. విస్తరించాలి).
* మహిళా అభ్యర్థులు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. 48 కిలోల బరువుండాలి.
సెషన్-2నే కీలకం
తుది విజేతలను ఖరారు చేసే క్రమంలో సెషన్-2లో పొందిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు కచ్చితంగా సెషన్-1లో
నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే.. సెషన్-2 జవాబులను మూల్యాంకన చేస్తారు. హవాల్దార్ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:5 నిష్పత్తిలో తదుపరి దశలు పీఈటీ, పీఎస్‌టీలకు ఎంపిక చేస్తారు.
రాత పరీక్షలో విజయానికి ఇలా
మళ్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్-టెక్నికల్) పోస్ట్‌లకు నిర్వహించనున్న రాత పరీక్షలో ఆయా సిలబస్ టాపిక్స్‌ను అనుసరించి ప్రణాళికాబద్దంగా ప్రిపరేషన్ సాగించాలి.
న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ
సెషన్-1లో మొదటి విభాగంగా ఉండే ఈ సట్టెక్ట్‌లో రాణించాలంటే... ప్యూర్ మ్యాథ్స్‌తోపాటు అర్ధ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్,
ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.
రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్
సెషన్-1లో రెండో విభాగంగా ఉండేఈ సబ్జెక్ట్‌లో.. మంచి మార్కుల కోసం. వెర్బల్, నాన్-వెర్చల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీన్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్బర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్లింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
జనరల్ అవేర్‌నెస్
సెషన్-2లో మొదటి సబ్జెక్ట్‌గా ఉండే జనరల్ అవేర్‌నెస్‌లో రాణించేందుకు... భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
సెషన్-2లో రెండో విభాగంలో అడిగే ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌లో రాణించేందుకు... బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్-స్పెల్డ్ వర్డ్స్, ఇడియమ్స్, ప్రేజెస్, యాక్టివ్/ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్‌లపై పట్టు సాధించాలి. ఇందుకోసం పదో తరగతి స్థాయి ఇంగ్లిష్ పుస్తకాలతోపాటు... కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు అందుబాటులో ఉండే ప్రామాణిక ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాలను అభ్యసనం చేయాలి.
ఇతర పరీక్షలతో అనుసంధానం
ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ అభ్యర్థులు... ఇప్పటికే తాము ప్రిపరేషన్ సాగిస్తున్న ఇతర పరీక్షలతో ఈ పరీక్ష ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకుంటూ చదవితే ఒకే సమయంలో పలు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, సీహెచ్‌ఎస్‌ఎల్ ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేయడం ద్వారా అన్ని అంశాల్లో సన్నద్ధత లభిస్తుంది. అంతేకాకుండా ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అడిగే ప్రశ్నల శైలిపైనా అవగాహన ఏర్పడుతుంది.
ఫలితంగా పరీక్షలో మరింత మెరుగ్గా రాణించేందుకు ఆస్కారం లభిస్తుంది.
ముఖ్య సమాచారం
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
౨ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 18 - ఫిబ్రవరి 17, 2023
౨ ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: ఫిబ్రవరి 23, 24 తేదీలు
* రాత పరీక్ష తేదీ:ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం
౨ తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: ssc.nic.in
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి