15, నవంబర్ 2023, బుధవారం

నవంబర్ 28న JVD 4వ విడత విడుదల కోసం 2022-23 విద్యాసంవత్సరం పూర్తి చేసిన ( ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరియు షెడ్యూల్డ్ కులాల(SC) విద్యార్థులు మినహా) విద్యార్థులకు తెలపాలని అన్ని కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు

నవంబర్ 28న JVD 4వ విడత విడుదల కోసం 2022-23 విద్యాసంవత్సరం పూర్తి చేసిన ( ఫైనల్ ఇయర్ విద్యార్థులు  మరియు షెడ్యూల్డ్ కులాల(SC) విద్యార్థులు మినహా) విద్యార్థులకు తెలపాలని అన్ని కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు

విద్యార్థి మరియు తల్లి యొక్క జాయింట్ అకౌంట్‌కు జేవీడీ 4వ విడత విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
బ్యాలెన్స్ ఖాతాతో ఉమ్మడి ఖాతాను తెరవడం కోసం.
1) తల్లి మరియు విద్యార్థి యొక్క 3 పాస్‌పోర్ట్ ఫోటోలు 
& విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు 
& విద్యార్థి ఐడి కార్డ్ (కాలేజీ ఐడి) &
DOB లేదా 10వ మార్కుల మెమో 
ప్రాథమికంగా primary account on విద్యార్థి పేరు మీద మరియు secondary తల్లి/తండ్రి గా నమోదు చేయాలి
వీటికి ఆధార్ సీడింగ్ అవసరం లేదు
4) ఎస్సీ విద్యార్థులకు ఉమ్మడి ఖాతా అవసరం లేదు
5) చివరి సంవత్సరం విద్యార్థులకు జాయింట్ ఖాతా అవసరం లేదు
6) విద్యార్థి లేదా తల్లి ఇప్పటికే ఖాతా కలిగి ఉంటే.., 
విద్యార్థి లేదా తల్లి వారి ఖాతాకు జోడించవచ్చు.
ఉమ్మడి ఖాతాలో ఎలాంటి డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండకూడదు.
7) జాయింట్ అకౌంట్ పూర్తయిన తర్వాత విద్యార్థులు సచివాలయంలో తమ ఖాతా వివరాలను సమర్పించాలి మరియు WEA/WEDPS లు నవసకం లాగిన్‌లో బ్యాంక్ వివరాలను అప్‌లోడ్ చేయవచ్చు. 
8) సంబంధిత COలు జ్ఞానభూమి లాగిన్‌లో ఖాతాలను నిర్ధారించగలరు.
JVD Joint Account FAQ - ప్రశ్న - సమాదానాలు ::
ప్ర: ఒక కుటుంబం లో ఇద్దరి విద్యార్థులు ఉన్నట్లయితే రెండు అకౌంట్స్ ఓపెన్ చేయాలా?
స: అవసరం లేదు ఆ ఇద్దరి పిల్లలకు మరియు తల్లికి ఒకే అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది.
ప్ర: అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక NPCI చేయించుకోవాలా?
స : ఈ యొక్క ఉమ్మడి ఖాతాలకు ఎటువంటి NPCI కూడా అవసరం లేదు.
ప్ర: పోస్టల్ లో కూడా ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకోవచ్చా?
స : పోస్టల్ లో ఉమ్మడి ఖాతాలు ఇవ్వరు కనుక ఇతర బ్యాంకు లును మాత్రమే సంప్రదించాలి.
ప్ర: ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకున్నాక ఏమి చేయాలి.
స : ఖాతా ఓపెన్ చేసుకున్నాక విద్యార్థి లేదా తల్లి ఆ ఖాతా యొక్క మొదటి పేజీ కాపీ ని సంబంధిత (household mapped) WEA/ WEDPS కి అందచేయాలి.
ప్ర : ఇప్పుడు అన్ని కులముల విద్యార్థులుకి, మరియు అన్ని ఏడాది విద్యార్థులు కి కూడా ఈ ఉమ్మడి ఖాతా ను తెరువాలా?
స :  2022-23 వ విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులుకి (అన్ని కులములు కూడా) ఉమ్మడి ఖాతా తెరువనవసరం లేదు. అలానే షెడ్యూల్డ్ కులములుకు చెందిన అన్ని ఏడాదిల విద్యార్థులుకు కూడా తెరువనవసరం లేదు.
ప్ర: ఖాతా తెరువటకు బ్యాంకు లో ఎటువంటి Documents సమర్పించాలి ?
1) తల్లి మరియు విద్యార్థి యొక్క 3 పాస్పోర్ట్ ఫోటోలు
2) విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు
3) విద్యార్థి ఐడి కార్డ్ (కాలేజీ ఐడి)
4) ఆధార్ కార్డు లో విద్యార్థి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ లేని యెడల DOB సర్టిఫికెట్ లేదా 10వ తరగతి మార్కుల మెమో.
ప్ర: ఖాతా లో మినిమం అమౌంట్ 1000రూ లేదా 3000రూ ఉంచాలా?
స :అవసరం లేదు అకౌంట్ పూర్తిగా జీరో అకౌంట్ కావున సొమ్ము ని జమ చేయనవసరం లేదు.
ప్ర: ఉమ్మడి ఖాతా తెరిచేటపుడు Primary అకౌంట్ హోల్డర్ ఎవరు ఉండాలి?
స: primary అకౌంట్ హోల్డర్ స్టూడెంట్ మాత్రమే ఉండాలి.
ప్ర: విద్యార్థి ఇదివరకే ఇండి విడ్యువల్ ఖాతా కలిగి ఉంటే తల్లిని వారి ఖాతాకు కానీ లేదా తల్లి ఇదివరకే ఇండివిడ్యువల్ ఖాతా కలిగి ఉంటే విద్యార్థిని వారి ఖాతాకు జోడించవచ్చా?
స: లేదు కచ్చితంగా నూతనంగా మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకనగా ఈ అకౌంట్కు ఎటువంటి డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండకూడదు. కనుక నూతన అకౌంట్ కచ్చితంగా ఓపెన్ చేసుకోమనండి.
ప్ర: తల్లి మరణించి ఉన్న విద్యార్థులుకు ఏమి చేయాలి?
స: వాళ్ళ Father లేదా సంరక్షకుడు తో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి



-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: