15, నవంబర్ 2023, బుధవారం

Education Jobs Update ఎడ్యుకేషన్ జాబ్స్ అప్డేట్

అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు కౌన్సెలింగ్
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ (హ్యాన్స్) అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి చివరి మ్యాప్ ఆఫ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జీ రామారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17వ తేదీన గుంటూరు నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఈ కౌన్సెలింగ్కు అర్హులని తెలిపారు. వివరాలకు www.angrau.ac.in సందర్శించాలని సూచించారు.

నేటితో ముగియనున్న నాలుగేళ్ల బీఈడీ దరఖాస్తు గడువు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఈ
ఏడాది ప్రవేశపెట్టిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులకు కోర్సులకు దరఖాస్తు గడువు
ముగియనుందని Universityవైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు తెలిపారు.
టెస్ట్ - 2023 మంగళవారం ఓ ప్రకటనలో |జాతీయ ..కామన్ ఎంట్రన్స్(ఎన్సెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులు బుధవారం సాయంత్రంలోగా నేరుగా దరఖాస్తులు సమర్పించాలని విసి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు www.brau.edu.in చూడవచ్చని చైస్ చాన్సలర్ వెంకటరావు తెలిపారు.

జనవరిలో పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష 

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ల (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్) పోస్టుల భర్తీ కోసం
జనవరి 4న కంప్యూటర్ రాతపరీక్ష ఆధారిత నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 2018 జారీచేసిన నోటిఫికేషన్కు అనుబంధంగా ఈ ఏడాది ఏప్రిల్లో ఇచ్చిన నోటిఫికేషన్ కు సంబంధించిన ఈ పరీక్ష ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో జరుగుతుందన్నారు. జనవరి 4న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ(పేపర్-1), మధ్యాహ్నం 2.30-5 గంటల వరకు సంబంధిత సబ్జెక్టు (సెపర్-2) పేపర్ ఉంటాయన్నారు. హాల్ టికెట్లను వెబ్సైట్ https://psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

దరఖాస్తుల వెల్లువ

• ఐసీడీఎస్ 22 పోస్టులకు 849 దరఖాస్తులు పుట్టపర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం 

పుట్టపర్తి అర్బన్: ఐసీడీఎస్ పోస్టులకు భారీగా దరఖాస్తులు అందాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న

22 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, దరఖాస్తు స్వీకరణకు చివరిరోజైన నవంబర్ 8వ తేదీ

సాయంత్రం వరకూ 849 దరఖాస్తులు అందినట్లు ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి తెలిపారు.

డీసీపీఓ పోస్టుకు 50, పీఓ పోస్టుకు 77, పీఓఎన్ఎస్ఐసీ పోస్టుకు 73, ఎల్సీఓ పోస్టుకు 7, కౌన్సెలర్ పోస్టుకు 67, అకౌంటెంట్ పోస్టుకు 95, డేటా అనలిస్ట్కు 96, సహాయ డీఈఓకు 159, అవుట్ రీచ్ వర్కర్ పోస్టుకు 113, మేనేజర్ పోస్టుకు 34, సోషల్ వర్కర్కు 29, ఏఎన్ఎం పోస్టులకు 21, ఆయా పోస్టులకు 19, చౌకీదార్కు 8, వైద్యుని పోస్టులు ఒక దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. వాటిని పరిశీలించి 419 దరఖాస్తులను అర్హమైనవిగా నిర్ధారించామన్నారు. ఆయా పోస్టులకు ఈనెల 17, 18 తేదీల్లో సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫలితాలను ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో నోటీస్ బోర్డులో ఉంచుతామని పీడీ వివరించారు.




కామెంట్‌లు లేవు: