ప్రభుత్వ ఉద్యోగాలు
ఎయిమ్స్ రిషికేశ్‌లో 86 టీచింగ్ ఖాళీలు
ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్‌లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ డెప్యుటేషన్/
కాంట్రాక్ట్ పద్ధతుల్లో 86 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
1. అసోసియేట్ ప్రొఫెసర్ 2. అసిస్టెంట్ ప్రొఫెసర్
3. ప్రొఫెసర్ 4. అడిషనల్ ప్రొఫెసర్
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, డెంటిస్ట్రీ,
జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఈఎన్‌టీ
తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్, డీఎం/ ఎంసీహెచ్/ పీహెచ్‌డీతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.
ఎంపిక: దరఖాస్తు షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-11-2023.
వెబ్‌సైట్:https://aiimsrishikesh.edu.in/a1_1/
ప్రవేశాలు
శ్రీ కొండా లక్ష్మణ్ వర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ
సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్
హార్టికల్చరల్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్
ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
1. ఎంఎస్సీ (హార్టికల్చర్): 30 సీట్లు
స్పెషలైజేషన్: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్
ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఆరోమాటిక్
క్రాప్స్
అర్హత: బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.
2. పీహెచ్‌డీ (హార్టికల్చర్): 06 సీట్లు
స్పెషలైజేషన్: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్
ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఆరోమాటిక్
క్రాప్స్
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్ ఏఐసీఈ-
జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.
వయసు: గరిష్ఠ వయసు 31 డిసెంబర్ 2023 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్సీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. మిగతా అభ్యర్థులందరికీ రూ.2000.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్
ఆఫీస్, ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ, ములుగు, సిద్దిపేట’ జిల్లా చిరునామాకు
పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2023
వెబ్‌సైట్:https://www.skltshu.ac.in/
వాక్ ఇన్
వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్‌లు
నంద్యాల జిల్లా మహానందిలోని వ్యవసాయ కళాశాల- ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
1. టీచింగ్ అసోసియేట్ (జీపీబీఆర్): 01
2. టీచింగ్ అసోసియేట్ (ప్లాంట్ పాథాలజీ): 01
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ.
వేతనం: నెలకు రూ.49,000.
ఇంటర్వ్యూ తేదీ: 15-11-2023.
ప్రదేశం: అసోసియేట్ డీన్ కార్యాలయం, అగ్రికల్చర్ కాలేజీ, మహానంది, నంద్యాల జిల్లా.
సీఎస్‌ఎల్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌లు
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(సీఎస్‌ఎల్)... ఒప్పంద
ప్రాతిపదికన నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నర్సింగ్ అసిస్టెంట్ కమ్ ఫస్ట్ ఎయిడర్: 02
అర్హత: ఏడో తరగతి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్‌తోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 15-11-2023.
వేదిక: రీక్రియేషన్ క్లబ్, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, కొచ్చి.
వెబ్‌సైట్: https://cochinshipyard.in/Careers
Tags :
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి