Alerts

Loading alerts...

11, నవంబర్ 2023, శనివారం

అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం | రెండో విడత నర్సింగ్ కౌన్సెలింగ్లో 3109 సీట్ల భర్తీ | Driving License డీఎల్, Vehicle R C ఆర్సీ కార్డుల జారీ ప్రారంభం | డిజిటల్ లాకర్ సిస్టంపై అవగాహన

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం 

షరతులు వర్తిస్తాయి
రెవెన్యూ శాఖ ఉత్తర్వుల జారీ

రాష్ట్రంలోని అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు కొన్ని షరతులతో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ స్థలానికి అయ్యే వ్యయంలో ప్రభుత్వం 60% చెల్లిస్తుందని, మిగిలిన 40% జర్నలిస్టులు భరించాలని వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రస్తుతం అక్రెడిటేషన్‌ కలిగి ఉండి... మీడియాలో కనీసం అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. జర్నలిస్టులు పనిచేస్తున్న/ నివాసం ఉంటున్న జిల్లాలోనే స్థలం కేటాయిస్తారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్మన్‌గా ఏర్పడే కమిటీ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. ఇళ్ల నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

షరతులు:

* స్థలాన్ని అందజేసిన తేదీ నుంచి పదేళ్లలోగా స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. లేదంటే స్థల కేటాయింపు రద్దవుతుంది. 

* ఇల్లు కట్టుకుని ‘ఫిజికల్‌ పొజిషన్‌’ పొందిన పదేళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే అమ్ముకోవచ్చు.

దరఖాస్తు చేసే జర్నలిస్టు దంపతుల్లో ఎవరి పేరు మీదా ఇంటి స్థలం, ఇల్లు, ఫ్లాట్‌ (పనిచేసే ప్రాంతంలో లేదా నివాసం ఉండేచోట) ఉండకూడదు.

గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు/ స్థలం పొంది ఉండకూడదు.

కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పీఎస్‌యూలలో పని చేస్తున్నా అనర్హులవుతారు.

సమాచారశాఖ పేర్కొన్న తేదీ నుంచి 45 రోజుల్లోగా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

*అర్హులైన అక్రెడిటెడ్‌ జర్నలిస్టుల జాబితాను జిల్లా కలెక్టర్లకు సమాచార శాఖ పంపుతుంది.

రెండో విడత నర్సింగ్ కౌన్సెలింగ్లో 3109 సీట్ల భర్తీ

ఆరోగ్య విశ్వవిద్యాలయం: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 225 నర్సింగ్ కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన 4135 బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు సీట్లకు విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నిర్వహించిన కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్ 3109 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 1026 సీట్లు ఖాళీగా ఉన్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

All Qualified Candidates in APEAPCET- 2023 are Eligible for B.Sc(Nursing) Course. 

Provisional Allotment Order - Phase - II by clicking the below.

https://ugnursing.ysruhs.com/ugnu_allotment/index.php 

డీఎల్, ఆర్సీ కార్డుల జారీ ప్రారంభం

అనంతపురం అర్బన్, నవంబరు 10: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించామని జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి వీర్రా జు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు జిల్లాలో 32 వేల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, 55 వేల ఆర్సీ కార్డులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. పక్షం రోజులుగా ప్రింటింగ్ జరుగుతోందని, ఇప్పటిదాకా 32 వేల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను ప్రింట్ చేశామని తెలిపారు. మరో పదిరోజుల్లో పోస్టల్ ద్వారా వాహనదారుల ఇంటికే కార్డులను పంపుతామని తెలిపారు. ఇప్పటి వరకు 12 వేల ఆర్సీ కార్డుల ప్రింటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. డిసెంబరు నెలాఖరులోగా కార్డులను వాహనదారుల ఇంటికి పంపుతామని పేర్కొన్నారు. 
డిజిటల్ లాకర్ సిస్టంపై అవగాహన కల్పించండి

అనంతపురం విద్య, నవంబరు 10: డిజిటల్ లాకర్ సిస్టంను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని డీఈఓ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలు, విశ్వవిద్యాలయాలు. విద్యాసంస్థలకు ఈ డీజీ లాకర్ను అమలు చేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. డీజీలాకర్లో 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ, జననధ్రువీకరణ పత్రాలు, ఓబీసీ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు, ఈబీసీ సర్టిఫికెట్లు, రేషన్ కార్డు తదితర సర్టిఫికెట్లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చునన్నారు. వీటిని ఎక్కడైనా పేపర్ లెన్గా డిజిటల్ రూపంలో వినియోగించుకోవచ్చునన్నారు. డీజీ లాకటర్ ఓపెన్ చేయడానికి ఎలాంటి రుసుం అవసరమూ లేదన్నారు. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను చైతన్యపరిచి పిల్లల పేరుతో ఈ డీజీ లాకర్ను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. తమ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీజీ లాకర్ అనే యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకోవచ్చనని తెలిపారు. మరిన్ని వివరాలకు http://etgovernment.com/s/arzx6qr

సంప్రదించాలని సూచించారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు:

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...