డీఫార్మసీ సీట్లు 531 మందికి
రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ (2 Years Diploma in Pharmacy) కోర్సులో 531 మందికి సీట్లు కేటాయించారు. ఈ విషయాన్నీ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు.
48 కాలేజీల్లో 3044 సీట్లను ఈ మేరకు భర్తీ చేశారు.
9 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 506 సీట్లకు 223,
39 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 2538 సీట్లకు 308 సీట్లు భర్తీ చేశామని వివరించారు. అడ్మిషన్ల కోసం మొత్తం 762 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 531 మంది మాత్రమే ఆప్షన్లు ఎంచుకున్నారని తెలిపారు. సీట్లు పొందినవారు 7వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి