కొత్తచెరువు వద్ద టన్నెల్ పనులు జరుగుతున్నందున అనంతపురం మీదుగా వెళ్లేవారాంతపు స్పెషల్, రోజూ తిరిగే పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా కోయంబత్తూరు-నిజాముద్దీన్ మధ్య తిరిగే కొంగు ఎక్స్ప్రెస్ (రైల్ నంబర్: 12647/12648) రైళ్లనురద్దు చేసినట్లు అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. వీక్లీ స్పెషల్ గా ప్రతి గురువారం బెంగళూరు, అనంతపురం, సికింద్రాబాద్, ఆగ్రా, ఢిల్లీ మీదుగా తిరిగే ఈ రైళ్లను ఫిబ్రవరి 7వ తేదీ వరకు రద్దు చేసినట్లు వివరించారు.
అనంతపురం మీదుగా పలు రైళ్ల రద్దు
• కొంగు, కొండవీడు, గరీబోథ్, ఇండోర్, డెమో రద్దు | ఫిబ్రవరి 8 తరువాత పునరుద్ధరణ
కొండవీడు యశ్వంతపుర-మచిలీపట్నం వయా అనంతపురం, నంద్యాల, విజయవాడ మీదుగా తిరిగే ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్లు: 17212/17211) రైళ్లను కూడా రద్దు చేశారు. వారంలో మూడ్రోజుల పాటు (మంగళ, గురు, శనివారాల్లో) తిరిగే వీక్లీ స్పెషల్ రైళ్లను కూడా ఫిబ్రవరి 8 వరకు రద్దు చేశారు.
యశ్వంతపుర-సికింద్రాబాద్ మధ్య తిరిగే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ (రైళ్ల నంబర్: 12735/12736) రైళ్లను రద్దు చేశారు. ఈ రైళ్లు ప్రతి సోమ, గురువారాల్లో అనంతపురం మీదుగా రాకపోకలు సాగించేవి. వీటిని ఫిబ్రవరి 8 తరువాత పునరుద్ధరిస్తారు.
• యశ్వంతపుర-ఇండోర్ వయా అనంతపురం, సికింద్రాబాద్ మీదుగా నడిచే ఇండోర్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్: 19302) రద్దయింది. ఫిబ్రవరి 6 వరకు ఈ రైలును నిలిపివేస్తున్నారు.
• గుంతకల్లు-హిందూపురం మధ్య తిరిగే డెమో ప్యాసింజర్ (రైళ్ల నంబర్లు: 07693/07694) రైళ్లను ఫిబ్రవరి 8 వరకు రద్దు చేసినట్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
కుర్లా ఎక్స్ప్రెస్ రూటు మార్పు
కుర్లా కోయంబత్తూరు మధ్య తిరిగే (రైళ్లు నంబర్: 11013/11014) కుర్లా ఎక్స్ ప్రెస్ రైళ్లను రూటు మార్చి నడపునున్నట్లు అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు మీదుగా తిరిగే ఈ రైళ్లను తిరుపతి, రేణిగుంట, నందలూరు, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు మీదుగా రూటు మార్చినట్లు వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్రయాణికులు తమ ప్రయాణాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైల్వే శాఖ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి